• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఈ సాల కప్ నమ్‌దే: కింగ్ ఆఫ్ ద క్రికెట్: ఐపీఎల్ ఫీవర్ బిగిన్స్: ఫస్ట్ మ్యాచ్: ఆడేదెవరు

|

చెన్నై: దేశీయ క్రికెట్ టోర్నమెంట్లకు కింగ్‌లో భావించే ఇండియన్ క్రికెట్ ప్రీమియర్ (ఐపీఎల్) 2021 సీజన్ 14వ ఎడిషన్.. సరిగ్గా అయిదు నెలల్లో ప్రేక్షకులను పలకరించబోతోంది.. ఆలరించబోతోంది. గత ఏడాది కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న పరిస్థితుల కారణంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు పరిమితమైన ఈ మెగా క్రికెట్ ఈవెంట్.. ఈ సారి దాదాపు అలాంటి పరిస్థితుల మధ్యే భారత్‌లోనే కనువిందు చేయనుంది. ఈ సాయంత్రం తొలి మ్యాచ్ ఆరంభం కానుంది. ఇప్పటికే అయిదు సార్లు కప్‌ను ఎగురేసుకెళ్లిన ఛాంపియన్ ముంబై ఇండియన్స్, ఇప్పటిదాకా ఏనాడూ కప్ కొట్టని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్యే తొలిపోరు.

చెన్నై ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభమౌతుంది. టీమిండియా కేప్టెన్ విరాట్ కోహ్లీ సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. అదే టీమిండియాకు వైస్ కేప్టెన్‌గా వ్యవహరిస్తోన్న రోహిత్ శర్మ ప్రత్యర్థులుగా మారారు. రోహిత్‌ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్‌ టైటిల్ హాట్ ఫేవరెట్‌గా బరిలో దిగింది. ముంబై ఇండియన్స్ వరుసగా రెండుసార్లు కప్ కొట్టింది. ఈ సారి కూడా కొట్టేస్తే. .హ్యాట్రిక్ పూర్తవుతుంది. ముంబై ఇండియన్స్ సెంటిమెంట్.. తొలి మ్యాచ్‌లో ఓడిపోవడం. ఈ సారి ఆ ఆనవాయితీని బ్రేక్ చేయొచ్చు.

IPL 2021: MI vs RCB Playing 11 Team Prediction, Tips, Best Playing 11 Details

విరాట్‌ కెప్టెన్సీలోని రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఇప్పటిదాకా ఛాంపియన్‌గా ఆవిర్భవించనే లేదు. ఈ సాల కప్ నమ్‌దే అంటూ ఊరిస్తూ వస్తోందే తప్ప.. అది మాత్రం సాధ్యం కావట్లేదు.ఈ సారి విజేతగా నిలవడానికి సమాయాత్తమౌతోంది. తొలి మ్యాచ్‌లో ఆ జట్టు పెర్‌ఫార్మెన్స్ ఎలా ఉంటుందనేది ఆసక్తి రేపుతోంది. రెండు జట్లలో స్టార్లకు కొదవ లేదు, మ్యాచ్ విన్నర్లకు లోటు లేదు. ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించే సత్తా ఉన్న బ్యాట్స్‌మెన్లు, బౌలర్లు, ఆల్‌రౌండర్లు రెండు టీముల్లోనూ ఉన్నారు. కిందటి నెలలో ముగిసిన మినీ వేలం సందర్భంగా కొందరు కీలక బౌలర్లను తీసుకుంది ఆర్సీబీ. జట్టులో మార్పులు చేర్పులు చోటుచేసుకున్నాయి.

చెన్నై పిచ్‌పై పరుగుల వరద పారే అకాశం ఉన్నది. గత సీజన్‌లో చిదంబరం స్టేడియం పిచ్‌పై 145 యావరేజ్ స్కోర్ రికార్డయింది. తొలుత బ్యాటింగ్ చేసిన జట్టుకే విజయావకాశాలు ఉన్నాయి ఈ స్టేడియంలో. గత సీజన్ల ట్రాక్ రికార్డ్ ఇదే చెబుతోంది. సాధారణంగా ఐపీఎల్‌లో టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్‌కు ప్రిఫర్ చేస్తుంది. ప్రత్యర్థికి భారీ లక్ష్యాన్ని నిర్దేశిస్తుంటుంది. అదే ట్రెడీషన్ ఈ సారి కంటిన్యూ అవ్వొచ్చు. రెండు జట్లలోనూ ఆల్‌రౌండర్లు ఉన్నందున టాస్ పెద్దగా ప్రాధాన్యత చూపకపోవచ్చు. ప్రత్యర్థి జట్టు ఎంత పెద్ద స్కోరును నిర్దేశించినప్పటికీ.. పిడుగుల్లాంటి షాట్లతో విరుచుకుపడటం బ్యాట్స్‌మెన్లకు అలవాటే కావడం వల్ల టాస్ పట్ల పెద్దగా ఆసక్తి చూపకపోవచ్చు.

ముంబై ఇండియన్స్‌ జట్టు కూర్పు.. ఇలా ఉండొచ్చు. రోహిత్ శర్మ, క్రిస్ లియాన్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, కీరన్ పొల్లార్డ్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, జిమ్మీ నీషమ్, రాహుల్ చాహర్, జస్‌ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్.
ఆర్సీబీలో ఎవరెవరు ఆడొచ్చంటే.. విరాట్ కోహ్లీ, మహ్మద్ అజరుద్దీన్, ఏబీ డివిలియర్స్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, పవన్ దేశ్‌పాండే, డేనియల్ క్రిస్టియన్, వాషింగ్టన్ సుందర్, కైలే జెమిసన్, యజువేంద్ర చాహల్, మహ్మద్ సిరాజ్, నవ్‌దీప్ షైనీ

English summary
The IPL 2021 is just a day away and the excitement is palpable even if the tournament is playing behind closed doors this year owing to the Covid 19 scenario. The opening match will be between defending champions Mumbai Indians and Royal Challengers Bangalore here at the MA Chidambaram Stadium.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X