• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

IPL 2021 New Rules: నో డౌట్..అంపైర్ ఇక డమ్మీ: కీలక మార్పులతో గందరగోళం..అంతకుమించి

|

ముంబై: ఇంకొద్ది రోజులే. ఒకవంక అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరుకుంటోన్న వేళ.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 సీజన్ 14వ ఎడిషన్ ఆరంభం కాబోతోంది. ఏప్రిల్ 9వ తేదీన చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడబోతున్నాయి. ఈ పరిణామాల మధ్య ఐపీఎల్ 2021 నిబంధనల్లో కొత్తగా రూపొందించిన నిబంధనల్లో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కీలక మార్పులు చేసింది. తాజాగా వాటిని బీసీసీఐ ఆమోదించింది.

సాఫ్ట్ సిగ్నల్‌ను చేసే ప్రతిపాదనలకు బీసీసీఐ ఆమోదం తెలిపింది షార్ట్‌ రన్‌ను నిర్ధారించే బాధ్యత ఇకపై థర్డ్ అంపైర్‌ చేతిలో ఉంటుంది. ఇదివరకు ఫీల్డ్ అంపైర్ దీన్ని నిర్ణయించేవారు. థర్డ్ అంపైర్‌కు అప్పీల్ చేసినప్పుడు ఫీల్డ్ అంపైర్ అభిప్రాయాన్ని తీసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. దాన్ని క్రికెట్ పరిభాషలో సాఫ్ట్ సిగ్నల్‌గా వ్యవహరిస్తారు. చాలా సందర్భాల్లో ఇవి వివాదాలను రేకెత్తిస్తుంటాయి. ఇకపై ఆ ఆనవాయితీకి బ్రేక్ పడనుంది. ఐపీఎల్ 2021లో సాఫ్ట్ సిగ్నల్ విధానం ఉండదు.

IPL 2021 New Rules: BCCI confirms no soft signal and 90-minute time restriction

సాఫ్ట్ సిగ్నల్ నిబంధన.. ఇదివరకు పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. దీన్ని మార్చాలనే డిమాండ్‌ను సీనియర్ క్రికెటర్లు వినిపించారు. ఫలితంగా ఇందులో మార్పులు, చేర్పులు చేయడానికి టీమిండియా మాజీ కేప్టెన్ అనిల్ కుంబ్లే నేతృత్వంలో ఐసీసీ కమిటీ సైతం ఏర్పాటైంది. ఐసీసీ గుర్తింపు రహిత మెగా క్రికెట్ టోర్నమెంట్ కావడం వల్ల ఐపీఎల్‌ 2021లో సాఫ్ట్ సిగ్నల్‌ రూల్‌ను తొలగించారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై బీసీసీఐ ఆమోదముద్ర వేసింది.

రన్ తీసే క్రమంలో బ్యాట్స్‌మెన్ క్రీజును టచ్ చేయకుండా వెళ్లి పోతే దాన్ని షార్ట్‌రన్‌గా పరిగణించడం సంప్రదాయం. క్రికెటర్ క్రీజ్‌ను టచ్ చేశాడా? లేదా? అనేది కూడా ఆన్‌ ఫీల్డ్ అంపైర్లే గుర్తించాల్సి ఉంటుంది. దాన్ని నిర్దారించడంలో పొరపాట్లు చోటుచేసుకోవడం, ఫీల్డ్ అపైంర్లు తమ దృష్టిని పూర్తిస్థాయిలో దానిపై కేంద్రీకరించకపోవడం వంటి పరిణామాల నేపథ్యంలో షార్ట్ రన్స్ గుర్తించే బాధ్యతను కూడా బీసీసీఐ థర్డ్ అంపైర్‌కే అప్పగించింది. అంపైర్ చేసే కొన్ని తప్పిదాలు జట్ల గెలుపోటములపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంటాయి. గెలిచే మ్యాచ్ దూరం అయ్యే పరిస్థితి తరచూ ఏర్పడుతుంటుంది.

అలాగే, ఆన్‌ఫీల్డ్ అంపైర్లు ప్రకటించే నో బాల్స్‌పై తుది నిర్ణయం తీసుకునే అధికారాన్ని సైతం థర్డ్ అంపైర్‌కు కట్టబెట్టింది. కాగా, మ్యాచ్ టై అయితే ఫలితం తేలే వరకూ సూపర్ ఓవర్లు ఆడించే రూల్‌లో కూడా బోర్డు మార్పులు చేసింది. కొత్త రూల్ ప్రకారం మ్యాచ్ ముగిసిన తర్వాత ఒక గంటలోపు మాత్రమే సూపర్ ఓవర్లు ఆడించాలని నిర్ణయించింది. అప్పటికే ఫలితం తేలకపోతే మ్యాచ్‌ను డ్రాగా ప్రకటించి చెరొక పాయింట్ ఇస్తారు. గత సీజన్‌లో ముంబై ఇండియన్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్ రెండు సూపర్ ఓవర్లకు దారితీసింది. దాంతో మ్యాచ్ ఆలస్యంగా ముగిసింది. ఈ క్రమంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది.

English summary
The BCCI, in the revised playing conditions for IPL 2021, circulated among the franchises said the 20th over must be finished in 90 minutes. Previously, the 20th over was to start by the 90th minute.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X