• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

విలియమ్సన్ గాయంపై అప్‌డేట్: కేన్ ఆడటంపై తేల్చేసిన డేవిడ్ వార్నర్

|

చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్, 14వ ఎడిషన్‌లో భాగంగా శనివారం రాత్రి చెన్నై చెపాక్ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో తలపడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎలాంటి అద్భుతాలను ఆవిష్కరించలేకపోయింది. ఎప్పట్లాగే ఓటమిపాలైంది. వరుస పరాజయాలను చవి చూస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆ జట్టు గెలవడం అద్భుతంగానే చెప్పుకోవాల్సి వస్తోంది. ఏకంగా నాలుగు మార్పులతో బరిలోకి దిగినప్పటికీ.. పరాజయాన్ని మాత్రం అధిగమించలేకపోయింది వార్నర్ సేన.

కొత్తగా జట్టులోకి వచ్చిన ఆ నలుగురూ ప్రత్యర్థిపై ఏ మాత్రం ప్రభావాన్ని చూపలేకపోయారు. నిరాశపరిచారు. సన్‌రైజర్స్ జట్టు తాను ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ విజయం అంచుల వరకూ వెళ్లి పతనమైంది. కోల్‌కత నైట్ రైడర్స్‌పై 10, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఆరు పరుగుల తేడాతో ఓటమి చవి చూసింది. తాజాగా 13 రన్స్‌ తేడా ముంబై ఇండియన్స్‌కు మ్యాచ్‌ను ధారదాత్తం చేసుకుంది. ఈ పరిస్థితుల్లో కేన్ విలియమ్సన్ జట్టులో ఎంతటి కీలక ఆటగాడనేది మరోసారి తేలిపోయింది.

కేన్ జట్టులో ఉండి ఉంటే.. ఆ మూడు మ్యాచ్‌ల ఫలితాలు వేరుగా ఉండేవనేది అభిమానుల మాట. టాప్ ఆర్డర్, మిడిలార్డర్ దారుణంగా విఫలమౌతోన్న నేపథ్యంలో.. ఆ రెండింటినీ అనుసంధానించేలా కేన్ విలియమ్సన్‌కు స్థానం కల్పిస్తే జట్టు కుప్పకూలకుండా ఉంటుందనేది విశ్లేషిస్తున్నారు. కేన్ విలియమ్సన్ ఎప్పుడొస్తాడంటూ అభిమానులు ఎదురు చూస్తున్నారు. అతని గాయంపై అప్‌డేట్ ఏమిటనేది ఇప్పటిదాకా పెద్దగా ఎవరికీ తెలియట్లేదు. మేనేజ్‌మెంట్ దీనిపై ఎలాంటి స్పష్టమైన ప్రకటన చేయలేదిప్పటిదాకా.

IPL 2021: SRH captain David Warner gives key update on Kane williamsons injury

ఈ పరిణామాల మధ్య హైదరాబాద్ కేప్టెన్ డేవిడ్ వార్నర్.. కీలక అప్‌డేట్ ఇచ్చాడు. ఎప్పుడొస్తాడనేది చెప్పనప్పటికీ.. త్వరలోనే పునరాగమనం చేస్తాడని మాత్రం స్పష్టం చేశాడు వార్నర్. మ్యాచ్ అనంతరం అవార్డుల ప్రదానం సందర్భంగా కేన్ విలియమ్సన్ గాయం అంశంపై స్పందించాడు. తాను ఫిజియోథెరపిస్ట్‌తో మాట్లాడానని, విలియమ్సన్ రీఎంట్రీ ఆశించిన స్థాయిలో ఉంటుందని అన్నాడు. జట్టులో కేన్ కీలక పాత్ర పోషించడం ఖాయమని స్పష్టం చేశాడు. జట్టు బ్యాలెన్స్డ్‌గా ఉండటానికి స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ అవసరమని చెప్పుకొచ్చాడు.

ముంబై ఇండియన్స్ నిర్దేశించిన 150 పరుగుల లక్ష్యం ఛేదించదగ్గదే అయినప్పటికీ.. బ్యాటింగ్ విభాగం విఫలమైందని స్పష్టం చేశాడు. బ్యాట్స్‌మెన్ల మధ్య చెప్పుకోదగ్గ భాగస్వామ్యం ఉండి ఉంటే.. ఫలితం ఇలా ఉండేది కాదని చెప్పాడు. మిడిలార్డర్‌లో స్మార్ట్ క్రికెట్ ఆడాల్సిన అవసరం ఉందని, ప్రస్తుతం జట్టులో అదే లోపించిందని వ్యాఖ్యానించాడు. మూడు మ్యాచుల్లో చోటు చేసుకున్న పొరపాట్లు.. పునరావృతం కానివ్వబోమని తేల్చి చెప్పాడు. కేన్ జట్టులో చేరితే సమతౌల్యం బాగుంటుందని వార్నర్ అభిప్రాయపడ్డాడు.

English summary
David Warner Gives Update on Kane Williamson’s Absence After Mumbai Indians Beat Sunrisers Hyderabad. Williamson is coming along nicely, he said. The Sunrisers Hyderabad franchise hit rock bottom on Saturday as they lost their third straight game on the trot.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X