• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

IPL 2021: చిదంబరం స్టేడియం రహస్యాలివే: లయన్స్ డెన్: హైఓల్టేజ్ మ్యాచ్‌‌కు అదే ఎందుకు?

|

చెన్నై: ఇండియన్ క్రికెట్ ప్రీమియర్ (ఐపీఎల్) 2021 సీజన్ 14వ ఎడిషన్.. మళ్లీ క్రికెట్ ప్రేమికులను సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లోబోతోంది. సరిగ్గా అయిదు నెలల్లో ప్రేక్షకులను పలకరించబోతోంది. ఈ సాయంత్రం తొలి మ్యాచ్ ఆరంభం కానుంది. ఇప్పటికే అయిదు సార్లు కప్‌ను ఎగురేసుకెళ్లిన ఛాంపియన్ ముంబై ఇండియన్స్, ఇప్పటిదాకా ఏనాడూ కప్ కొట్టని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్యే తొలిపోరు. ఈ హైఓల్టేజ్ మ్యాచ్ కోసం చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియాన్ని సెలెక్ట్ చేసింది మేనేజ్‌మెంట్. ఐపీఎల్ మ్యాచ్‌లను నిర్వహించడానికి దక్షిణాది రాష్ట్రాల్లో ఈ ఒక్క స్టేడియాన్ని భారతీయ క్రికెట్ జట్టు ఎంపిక చేసింది.

హయ్యెస్ట్.. లోయెస్ట్.. ఆల్‌టైమ్ రికార్డ్స్

హయ్యెస్ట్.. లోయెస్ట్.. ఆల్‌టైమ్ రికార్డ్స్

ఐపీఎల్‌తో కలుపుకొని ఇప్పటిదాకా మొత్తం 82 టీ20 మ్యాచ్‌లను చెన్నై చెపాక్ స్టేడియంలో నిర్వహించారు. ఇందులో తొలిసారిగా బ్యాటింగ్ చేసిన జట్లు 47 సార్లు ఘన విజయాన్ని అందుకున్నాయి. ప్రత్యర్థి నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించడానికి రెండోసారి క్రీజ్‌లోకి దిగిన టీమ్స్ గెలిచింది 33 సార్లు మాత్రమే. తొలిసారిగా బ్యాటింగ్ చేసిన జట్లకే ఈ స్టేడియంలో విజయావకాశాలు అధికంగా ఉన్నాయనేది దీనితో స్పష్టమౌతోంది. ఫస్ట్ ఇన్నింగ్‌లో అత్యదిక స్కోరు 246 పరుగులు. ఇదో ఆల్‌టైమ్ రికార్డ్. అదే సమయంలో ఫస్ట్ ఇన్నింగ్ లోయెస్ట్ స్కోర్ కూడా నమోదైంది ఇక్కడే. తొలిసారిగా బ్యాటింగ్ చేసిన జట్టు 70 పరుగులకే చాప చుట్టేసిన మ్యాచ్ కూడా జరిగిందిక్కడే.

ఫస్ట్ ఇన్నింగ్ యావరేజ్ స్కోర్..

ఫస్ట్ ఇన్నింగ్ యావరేజ్ స్కోర్..


ఈ స్టేడియంలో తొలిసారిగా బ్యాటింగ్ చేసిన జట్ల యావరేజ్ స్కోర్.. 160. బిగ్గెస్ట్ టార్గెట్ ఛేజింగ్ సైతం ఈ స్టేడియంలోనే నమోదైంది. తొలిసారిగా బ్యాటింగ్ చేసిన జట్టు నిర్దేశించిన 208 పరుగులు ఈ పిచ్‌పై దూదిపింజల్లా తేలిపోయింది. ఈ స్టేడియంపై పూర్తి ఆధిపత్యం చెన్నై సూపర్ కింగ్స్ దే. టీమిండియా మాజీ కేప్టెన్.. జార్ఖండ్ డైనమేట్‌ మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్.. ఈ పిచ్‌పై రికార్డులను బద్దలు కొట్టిన మ్యాచ్‌లు ఉన్నాయి. చిదంబరం స్టేడియంలో 50 ఐపీఎల్ మ్యాచ్‌లను నిర్వహిస్తే.. బ్యాటింగ్, బౌలింగ్‌లో టాప్‌లో ఉన్నది సూపర్ కింగ్స్ ప్లేయర్లే.

మోస్ట్ ఐపీఎల్ రన్స్ చేసింది వీరే..

మోస్ట్ ఐపీఎల్ రన్స్ చేసింది వీరే..

చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ప్లేయర్, ఆల్‌రౌండర్ సురేష్ రైనా.. ఇదే స్టేడియంలో సెంచరీ చేశాడు. ఇప్పటిదాకా అతను 59 ఇన్నింగ్స్‌లో 1,566 పరుగులు చేశారు. బెస్ట్ స్కోర్ 100 నాటౌట్. అతని బ్యాటింగ్ యావరేజ్ 29. స్ట్రైకింగ్ రేట్ 134.08. ఎనిమిది సార్లు హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడతను. 148 బౌండరీలు అతని ఖాతాలో ఉన్నాయి. నెక్స్ట్ ప్లేస్‌లో ఎంఎస్ ధోనీ ఉన్నాడు. 52 ఇన్నింగుల్లో 1,409 పరుగులు చేశాడు. హయ్యెస్ట్ స్కోర్ 75 నాటౌట్. బ్యాటింగ్ సగటు 41.44. ఏడుసార్లు అర్ధసెంచరీ చేశాడు. మూడోస్థానంలో మైక్ హస్సీ నిలిచాడు. 25 ఇన్నింగుల్లో 1,008 పరుగులు చేశాడతను. వ్యక్తిగత అత్యధిక స్కోరు 95 పరుగులు.

 అత్యధిక వికెట్లు పడగొట్టింది వీరే..

అత్యధిక వికెట్లు పడగొట్టింది వీరే..


సూపర్ కింగ్స్ బౌలింగ్ స్టార్ డ్వేన్ బ్రావో ఈ స్టేడియంలో అత్యధికంగా 48 వికెట్లు పడగొట్టాడు. 39 ఇన్నింగుల్లో అతనీ ఘనత సాధించాడు. బౌలింగ్ యావరేజ్ 23.21. ఎకానమీ 8.08. అల్బే మోర్కెల్ 39 వికెట్లు తీసుకున్నాడు. 31 ఇన్నింగుల్లో 7.97 పరుగులు ఇఛ్చిన అతను 39 మంది బ్యాట్స్‌మెన్లను పెవిలియన్ దారి పట్టించాడు. లసిత్ మలింగ 14, అబు నేచిమ్, కీరన్ పొల్లార్డ్ ఎనిమిది వికెట్ల చొప్పున పడగొట్టారు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. అందుకే ఈ సీజన్‌లో తొలిమ్యాచ్ కోసం చిదంబరం స్టేడియాన్ని ఎంపిక చేశారు నిర్వాహకులు.

English summary
Chennai, a cricket-loving city which has hosted in vicinity of 50 IPL matches till date, is one of the six shortlisted venues for IPL 2021. Alongside the Wankhide Stadium in Mumbai, MA Chidambaram Stadium will host the first leg of the league phase before the proceedings move to Ahmedabad and Delhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X