• search
 • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

అమ్మ..ఆవకాయ్..ఐపీఎల్ ఆక్షన్: ఫీవర్ బిగిన్: సన్‌రైజర్స్ పరిస్థితేంటీ: పర్స్ ఫుల్‌గా

|

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్-2021 జ్వరం అప్పుడే మొదలైపోయింది. ఈ మెగా టోర్నమెంట్‌కు సంబంధించిన మినీ వేలంపాట కాస్సేపట్లో ఆరంభం కాబోతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో అందరి దృష్టీ అటు వైపే నిలిచింది. తాము ఆరాధించే క్రికెటర్లను ఏ ఫ్రాంఛైజీలు బుట్టలో వేసుకుంటాయోననే ఉత్కంఠత నెలకొంది. మెరికెల్లాంటి కొందరు బ్యాట్స్‌మెన్లు, ఆల్‌రౌండర్ల పేర్లు వేలంపాట లిస్ట్‌లో చేరడం..ఈ మినీ వేలంపాటకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.

  IPL 2021 Auction : Amma, Avakai, IPL Auction Eppudu Bore Kottadu - SRH Interesting Tweet
   ఎవరెవరు..ఎక్కడెక్కడో

  ఎవరెవరు..ఎక్కడెక్కడో

  ఆరోన్ ఫించ్, అలెక్స్ హేల్స్, జేసన్ రాయ్, స్టీవ్ స్మి్, హనుమ విహారి, కేదార్ జాదవ్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, షకీబుల్ హసన్, ఎవిన్ లెవిస్, హర్భజన్ సింగ్, డారెన్ బ్రావో, టామ్ కుర్రమ్, సామ్ బిల్లింగ్స్ వంటి క్రికెటర్లు ఈ సారి మినీ ఆక్షన్ లిస్ట్‌లో ఉన్నారు. మొత్తం 292 సీనియర్లు, జూనియర్ క్రికెటర్లు వేలం పాటలో ఉన్నారు. ఈ మధ్యాహ్నం 3 గంటలకు చెన్నైలో వేలం ఆరంభం కాబోతోంది. మినీ ఆక్షన్ కావడం వల్ల ఈ ఒక్కరోజలోనే ఎవరెక్కడ అనేది తేలిపోయే అవకాశాలు ఉన్నాయి.

  61 మందికి ఛాన్స్

  61 మందికి ఛాన్స్

  మొత్తం ఎనిమిది ఐపీఎల్ ఫ్రాంచైజీలు 61 మంది ప్లేయర్లను తీసుకోనున్నాయి. ఇందులో 22 మంది విదేశీ ప్లేయర్లకు చోటు కల్పించారు. టీమిండియా క్రికెటర్లతో పాటు విదేశీ స్టార్ ప్లేయర్లు ఆక్షన్‌లో ఉన్నారు. భారత క్రికెట్ జట్టులో అడుగు పెట్టడానికి మెయిన్ డోర్‌గా భావించే ఐపీఎల్‌లో అవకాశాన్ని దక్కించుకుని సత్తా చాటాలనుకుంటోన్న దేశవాళీ యంగ్ క్రికెటర్లకు మంచి ధర పలికే అవకాశాలు లేకపోలేదు. వారిలో అదృష్టం ఎవరిని వరించబోతోందనేది సాయంత్రానికి తేలిపోతుంది.

   సచిన్ టెండుల్కర్ కుమారుడి ఎంట్రీ గ్యారంటీ?

  సచిన్ టెండుల్కర్ కుమారుడి ఎంట్రీ గ్యారంటీ?

  క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్ కుమారుడు అర్జున్‌ టెండూల్కర్‌పై ఫ్రాంఛైజీలు ఫోకస్ పెట్టారు. ప్రత్యేకించి- ముంబై ఇండియన్స్ అతణ్ని తీసుకోవడానికి ఎంత ఖర్చయినా పెట్టొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్‌, టెస్ట్ స్పెషలిస్ట్ చేతేశ్వర్ పుజారా, హనుమ విహారి, పియూష్ చావ్లా‌, పవన్‌ నేగి, ఉమేశ్ యాదవ్‌, శివమ్ దూబె లాంటి భారత ఆటగాళ్లు తమ అదృష్టం పరీక్షించుకుకోనున్నారు. ముస్తాక్‌ అలీ టీ20 టోర్నీలో 37 బంతుల్లోనే శతకం బాదిన కేరళ యువ కెరటం అజహరుద్దీన్‌ కోసం ఫ్రాంఛైజీలు పోటీ పడటం ఖాయంగా కనిపిస్తోంది.

  సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇంటరెస్టింగ్ ట్వీట్..


  ఈ పరిణామాల మధ్య సన్ రైజర్స్ హైదరాబాద్ కొద్దిసేపటి కిందటే ఓ ఆసక్తికరమైన ట్వీట్ పోస్ట్ చేసింది. అమ్మ, ఆవకాయ్, ఐపీఎల్ ఆక్షన్ ఎప్పుడూ బోర్ కొట్టదంటూ ట్వీట్ చేసింది. `మినీ ఐపీఎల్ ఆక్షన్ కోసం మేము రెడీగా ఉన్నాం.. మీరు రెడీయా?` అంటూ క్రికెట్ ప్రేమికులకు సవాల్ విసిరింది. ప్రస్తుతం 22 మంది ప్లేయర్లు సన్‌రైజర్స్‌లో ఉన్నారు. వారిలో ఏడుమంది విదేశీ ఆటగాళ్లు. ప్రస్తుతం 74 కోట్ల 25 లక్షల రూపాయలు డేవిడ్ వార్నర్ టీమ్ పర్స్‌లో ఉన్నాయి. ఇందులో రెమ్యునరేషన్ కింద 10 కోట్ల 75 లక్షల రూపాయలను చెల్లించాల్సి ఉంది. ఒక విదేశీ ప్లేయర్ సహా ముగ్గురిని తీసుకోవాల్సి ఉంది.

  English summary
  Sunrisers Hyderabad (SRH) expressed faith in their existing group of players ahead of the IPL 2021 player auction and released only five players including Fabian Allen and Billy Stanlake. SRH are expected to be one of the least busy sides at the auction on Thursday.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X