జగిత్యాల వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అగ్గిరాజేసిన ఎమ్మెల్యే కామెంట్స్.. మెట్‌పల్లి‌లో బీజేపీ-టీఆర్ఎస్ వర్గాల తోపులాట (వీడియో)..

|
Google Oneindia TeluguNews

అయోధ్య రామాలయానికి నిధులు ఎందుకు అని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు చేసిన కామెంట్స్ అగ్గిరాజేశాయి. మెట్ పల్లిలో బీజేపీ/ హిందూ సంస్థలు ఆందోళనకు దిగాయి. రాముని పేరుతో భిక్షం ఎత్తుకుంటున్నారని ఎమ్మెల్యే కామెంట్స్ చేయగా.. బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. పాత బస్టాండ్‌లో గల శాస్త్రి విగ్రహాం వద్ద నిరసన చేపట్టాయి. కామెంట్స్ వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఆందోళనతో రోడ్లపై ఎక్కడికక్కడే వాహనాలు నిలచిపోయాయి.

తోపులాట

తోపులాట


బీజేపీ పట్టణ అధ్యక్షుడు బొడ్ల రమేశ్ బృందం ఆందోళనకు దిగగా.. టీఆర్ఎస్ శ్రేణులు అక్కడికి వచ్చాయి. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బీజేపీ- టీఆర్ఎస్ శ్రేణులు ఒకరికొకరు తోసుకున్నాయి. దీంతో హై టెన్షన్ నెలకొంది. అప్పటికే అక్కడికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. కానీ ప్రధాన రహదారిపై మాత్రం ట్రాఫిక్ స్తంభించిపోయింది.

Recommended Video

కోరుట్లలో టెన్షన్..టెన్షన్..! రోడ్డెక్కిన బీజేపీ కార్యకర్తలు
అగ్గిరాజేసిన వ్యాఖ్యలు

అగ్గిరాజేసిన వ్యాఖ్యలు

అయోధ్య రామాలయానికి నిధులు ఎందుకు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలు అగ్గిరాజేశాయి. రామ భక్తులు, హిందూ సంఘాల నేతలు ఒంటికాలిపై లేస్తున్నారు. యూపీలో గల అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరుగుతోంది. తోచిన విధంగా అందరూ సాయం చేస్తున్నారు. యూపీలో రామాలయానికి విరాళాలు ఇవ్వొద్దు అని కోరారు. ఉత్తరప్రదేశ్ రాముడు మనకెందుకు అంటూ హాట్ కామెంట్స్ చేశారు. మన వద్ద రాముడి ఆలయాలు లేవా అంటూ కొత్త వివాదానికి తెరలేపారు. ఇక్కడ ఉన్న ఆలయాలకు విరాళాలు ఇవ్వాలని కోరారు.

భిక్షం అంటూ కామెంట్స్..?

భిక్షం అంటూ కామెంట్స్..?

రాముని పేరు మీద కొందరు భిక్షం ఎత్తుకుంటున్నారని సాగర్ రావు వ్యాఖ్యలు చేశారు. కొత్త నాటాకనికి తెర లేపుతున్నారని బీజేపీపై విమర్శలు చేశారు. బొట్టు పెట్టుకుంటేనే రాముని భక్తులమా అని అడిగారు. తామంతా శ్రీరాముని భక్తులమేనని వ్యాఖ్యానించారు. భక్తి అనేది మనసులో ఉండాలని సూచించారు. కానీ సాగర్ రావు కామెంట్స్ మాత్రం వైరల్ అయ్యాయి.

English summary
bjp-trs workers clash in metpally old bus-stand for mla vidyasagar rao ayodhya fund comments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X