జగిత్యాల వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పనులు చేయకుంటే కొట్టండి.. హామీలు నెరవేర్చకుంటే తప్పుకుంటా.. చెప్పులు, రాజీనామా పత్రాలతో వింత ప్రచారం

|
Google Oneindia TeluguNews

Recommended Video

Telangana Elections 2018 : చెప్పులతో పాటు రాజీనామా పత్రాల తో వినూత్న ప్రచారం | Oneindia Telugu

కోరుట్ల : ఓట్ల పండుగొస్తే చిత్ర విచిత్రాలు దర్శనమిస్తాయి. ఓటర్ దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు నేతలు పడే తిప్పలు అన్నీ ఇన్నీ కావు. ఒకరు బజ్జీల కొట్టు దగ్గరకెళ్లి మిర్చిలు వేస్తే.. మరొకరు లాండ్రీ షాపులో ఇస్త్రీ చేస్తారు. ఇలాంటి ప్రచార హడావిడి చాలానే చూసి ఉంటాము. కానీ ఓ అభ్యర్థి వింత ప్రచారం ఇప్పుడు హాట్ టాపికయ్యింది. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన ఆకుల హన్మాండ్లు వినూత్నంగా ప్రచారం నిర్వహించారు. ఓటర్ల దగ్గరికి వెళ్లి చెప్పులతో పాటు రాజీనామా పత్రాలు అందించారు. అయితే ఇదేమీ ప్రచారం రా బాబూ అంటూ చాలామంది వింతగా చూశారు. ఆయన చెప్పులు, రాజీనామా పత్రాలు ఎందుకిస్తున్నారో చెబితే ఆశ్చర్యపోవడం వారి వంతైంది.

korutla independent candidate different campaign with chappal and resign letters

కోరుట్ల అసెంబ్లీ బరిలో నిలిచిన తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరుతూ ఈ వినూత్నం ప్రచారం నిర్వహించారు హన్మాండ్లు. ఒకవేళ తాను గెలిచాక పనులు చేయకపోతే కొట్టండంటూ సెలవిచ్చారు. అందుకే ఈ చెప్పులు పంచుతున్నానంటూ చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యేగా ఇప్పుడిచ్చే హామీలు నెరవేర్చకుంటే పదవి నుంచి తప్పుకొనేందుకు సిద్ధమని.. అందుకే ముందస్తుగానే ఈ రాజీనామా పత్రాలు ఇస్తున్నట్లు తెలిపారు. మొత్తానికి ఈ వింత ప్రచారం వర్కవుట్ అవుతుందో లేదో గానీ హన్మాండ్లు మాత్రం తన క్రియేటివిటీ చూపించారనే టాక్ వినిపిస్తోంది.

English summary
Akula Hanmandlu, an independent candidate in the Jagityal District Korutla constituency, has conducted an innovative campaign. he given chappal and resign letters to voters. he said that, "if i didn't work well, then slap with me this chappal, if i failed to fulfil election promises, then i will resign".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X