• search
  • Live TV
జగిత్యాల వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

కాపురం కూల్చిన కళ్యాణ లక్ష్మి చెక్కు .. కట్నం చెక్ తేవాలని భార్యను పుట్టింటికి పంపిన భర్త

|

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న కళ్యాణ లక్ష్మి పథకం ఒక వివాహిత కాపురానికి చేటు చేసింది. కల్యాణ లక్ష్మి చెక్కు అందకపోవడంతో కళ్యాణ లక్ష్మి చెక్కు తీసుకుంటేనే ఇంటికి రావాలని ఓ 19 ఏళ్ల యువతిని భర్త నిర్దాక్షిణ్యంగా ఇంటి నుంచి గెంటివేసిన ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది.

కూల్చివేతలపై కేసీఆర్ కు బిగ్ షాక్ ... ఈ సారి ప్రతిపక్ష పార్టీల నుండి కాదు నిజాం వారసుల నుండి

కళ్యాణ లక్ష్మీ చెక్ నే కట్నంగా ఇస్తామన్న వధువు బంధువులు .. చెక్ కోసం భార్యను పంపేసిన భర్త

కళ్యాణ లక్ష్మీ చెక్ నే కట్నంగా ఇస్తామన్న వధువు బంధువులు .. చెక్ కోసం భార్యను పంపేసిన భర్త

జగిత్యాల జిల్లాలోని మల్యాల మండలం లోని గుడి పేటకు చెందిన రమేష్ చెవిటి సరిత అని యువతిని పెళ్లి చేసుకున్నాడు. అయితే వివాహ సమయంలో సరిత యొక్క బంధువులు ఒక లక్ష 116 రూపాయలు కట్నంగా ఇస్తామని వరుడితో చెప్పారు. కళ్యాణ లక్ష్మి చెక్ రాగానే ఆ డబ్బు తీసుకోవాలని వరుడు కి సూచించారు. అయితే కళ్యాణ లక్ష్మి చెక్ కోసం ఆరు నెలల పాటు నిరీక్షించిన రమేష్ ప్రభుత్వం నుండి కల్యాణలక్ష్మి చెక్ తీసుకున్న తర్వాతనే కాపురం చేయడానికి ఇంటికి రావాలని అప్పటి వరకూ తన పుట్టింట్లోనే ఉండాలని సరితను నిర్దాక్షిణ్యంగా గెంటివేశాడు. అయితే ఇప్పటివరకు కళ్యాణ లక్ష్మి చెక్కులు అతీగతీ లేకుండా ఉండడంతో సరిత తన పరిస్థితి ఏంటని వాపోతుంది. తన భర్త దగ్గరికి వెళ్లాలంటే కల్యాణ లక్ష్మి చెక్కు తీసుకొని వెళ్ళాలని, అది త్వరగా ఇప్పించాలని ఆమె ప్రభుత్వాన్ని కోరుతుంది.

నిరుపేద యువతీ వివాహానికి కట్నంగా కళ్యాణ లక్ష్మి ప్రోత్సాహక నగదు .. చెక్ జాప్యంతో కూలిన కాపురం

నిరుపేద యువతీ వివాహానికి కట్నంగా కళ్యాణ లక్ష్మి ప్రోత్సాహక నగదు .. చెక్ జాప్యంతో కూలిన కాపురం

కడు నిరుపేద కుటుంబంలో పుట్టిన సరిత తల్లి అనారోగ్య కారణంగా మరణించడంతో ఇక తండ్రి పొట్టకూటి కోసం మహారాష్ట్రంలోని భీమండి కి వెళ్ళాడు . నిరుపేద కుటుంబంలో పుట్టిన సరిత పెళ్లి చేయడానికి స్థానికులు తలా ఓ చేయి వేసి 40 వేలు ఖర్చు చేసి ఆమె పెళ్లి జరిపించారు. కట్నం కింద కళ్యాణ లక్ష్మి చెక్కు వస్తుందని వరుడిని ఒప్పించారు. కానీ కల్యాణ లక్ష్మి చెక్కు రాకపోవడంతో తిరిగి పుట్టింటికి చేరుకుంది. గత ఆరు నెలలుగా పుట్టింట్లోనే ఉండి చెక్కు కోసం నిరీక్షిస్తున్న సరిత తన భర్తను కలవాలంటే కల్యాణ లక్ష్మి డబ్బు రావాల్సిందేనని చెబుతోంది.

 ఎన్నికల కోడ్ ఉండటమే చెక్స్ ఆలస్యానికి కారణం .. త్వరలోనే అందేలా చూస్తామన్న అధికారులు

ఎన్నికల కోడ్ ఉండటమే చెక్స్ ఆలస్యానికి కారణం .. త్వరలోనే అందేలా చూస్తామన్న అధికారులు

కళ్యాణ లక్ష్మి చెక్కుల మంజూరుకు గల ఆలస్యానికి కారణాలేంటని ఆరాతీస్తే మొన్నటి వరకు ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో కల్యాణ లక్ష్మి ప్రోత్సాహకాల చెల్లింపు ఆలస్యమైందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఇక సరిత విషయాన్ని ఒక ప్రత్యేక కేసు కింద పై అధికారుల దృష్టికి తీసుకువెళతామని వారంటున్నారు. ఇక ఈ ఘటనతో కళ్యాణ లక్ష్మి చెక్కు ఒక యువతి వివాహం చేసిందని సంతోషపడాలో, లేక కట్నాలు తీసుకోవద్దని చెప్తున్నా కట్నం కోసం భార్యను పుట్టింటికి పంపించాడని బాధపడాలో అర్థంకాని సందిగ్ధం నెలకొంది . ఏది ఏమైనా తాళికట్టి పెళ్లాడిన భార్య ను డబ్బు కోసం వదిలిపెట్టకుండా , చక్కగా చూసుకోవాల్సిన బాధ్యత ఆ భర్త పైన ఉంది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Nineteen-year-old Chevuti Saritha, who married V Ramesh, of Gudipeta in Mallial mandal in Jagtial district, has been left to fend for herself after her husband abandoned her about six months ago since her relatives could not get Kalyana Lakshmi money from the government. The girl’s parents had promised to pay the money as dowry.Saritha now lives in a tin-roofed shed in her native village, Kondayapalli, uncertain about her future. At the time of her wedding, Saritha’s relatives and the villagers promised the boy that the government’s incentive of Rs 1,00,116 payable to a Hindu bride at the time of marriage would be paid to him as dowry. It’s been nearly a year since the wedding, but the money remains elusive.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more