జనగామ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇంట్రెస్టింగ్: తెలంగాణలో ట్రంప్‌ విగ్రహం ...ప్రత్యేక పూజలందుకున్న అమెరికా అధ్యక్షుడు

|
Google Oneindia TeluguNews

జనగాం: సాధారణంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంటే చాలామంది చీధరించుకుంటారు. ఆయన చేసే వెక్కిలి చేష్టలకు, పాలనాపరమైన నిర్ణయాలు అడ్డగోలుగా తీసుకోవడం, అనవసరంగా నోరుజారడం వంటితో చాలామంది ట్రంప్‌ను ఈసడించుకుంటారు. అదే సమయంలో ఆయన్ను ఆకాశానికి ఎత్తేసేవారు కూడా ఉన్నారు. ఆయనంటే ప్రేమ ఒలకబోసే వారు కూడా ఉంటారు. ట్రంప్ కఠినంగా ఉంటేనే చూడ ముచ్చటగా ఉంటారని చెప్పేవారు లేకపోలేదు. ఇంకా చెప్పాలంటే ట్రంప్‌కు విగ్రహాలు కట్టి పూజించే భక్తులు కూడా ఉన్నారు. ఏంటి నమ్మలేకపోతున్నారా..? అయితే ఈ స్టోరీ చదవాల్సిందే.

 ట్రంప్‌కు కృష్ణ వీరాభిమాని

ట్రంప్‌కు కృష్ణ వీరాభిమాని

డొనాల్డ్ ట్రంప్...అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు. ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో ప్రధానాంశాల్లో పేరు వినిపిస్తూ ఉంటుంది. ట్రంప్ పాలనలో కొంత కొత్తదనం కనిపిస్తున్నప్పటికీ ఆయన తీసుకునే పాలనాపరమైన నిర్ణయాలు చాలామందికి ఇబ్బందిగానే కనిపిస్తుంది. అంతెందుకు అమెరికాలో నివసించేవారే ట్రంప్ నిర్ణయాలను వ్యతిరేకిస్తుంటారు. అలాంటి డొనాల్డ్ ట్రంప్‌ అసలు సిసలైన భక్తుడిని సంపాదించుకున్నాడు. ఆ భక్తుడు ఉండేది ఎక్కడో కాదు. మన తెలంగాణలోనే. జనగాం జిల్లాలోని కొన్నే గ్రామానికి చెందిన బుస్సా కృష్ణ అనే 32 ఏళ్ల వ్యక్తి ట్రంప్‌కు వీరాభిమాని.

రేపే జగన్ పోలవరం సందర్శన..! సీఎం హోదాలో తొలిసారి..!! రేపే జగన్ పోలవరం సందర్శన..! సీఎం హోదాలో తొలిసారి..!!

 ఆరడుగుల ట్రంప్ విగ్రహం ఏర్పాటు

ఆరడుగుల ట్రంప్ విగ్రహం ఏర్పాటు

బుస్సా కృష్ణ ఎంతటి అభిమాని అంటే ఏకంగా ఆయనకు ఒక విగ్రహమే కట్టించేశాడు. అంతేకాదు ప్రతిరోజూ పూజలు కూడా చేస్తాడు. ఇంతకీ ఆ విగ్రహం ఎత్తు ఎంతో తెలుసా అచ్చం ట్రంప్ ఉన్నంత హైటే. అంటే ఆరడుగుల విగ్రహాన్ని బుస్సా కృష్ణ కట్టించాడు. ఇప్పటికే భారత్‌ అమెరికాల మధ్య వాణిజ్యం యుద్ధం జరుగుతున్న క్రమంలో కృష్ణ ట్రంప్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై సర్వత్రా చర్చకు దారితీస్తోంది. అంతేకాదు ట్రంప్ విగ్రహానికి తిలకం దిద్ది, పూలమాల వేసి అభిషేకం చేసి హారతి కూడా ఇచ్చాడు. జై జై ట్రంప్ అంటూ నినాదాలు చేశాడు.

ట్రంప్ యాటిట్యూడ్‌కు ఫిదా అయిన కృష్ణ

ట్రంప్ యాటిట్యూడ్‌కు ఫిదా అయిన కృష్ణ

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంటే తనకు అభిమానమని చెప్పిన కృష్ణ.. అగ్రరాజ్యపు అధ్యక్షుడు తీసుకునే కఠినమైన నిర్ణయాలు తనను ఆకట్టుకుంటున్నాయని చెప్పాడు. అంతేకాదు ట్రంప్ ఆటిట్యూడ్ తనను కట్టిపడేస్తుందని వివరించాడు కృష్ణ. ఏదో ఒక రోజు అగ్రరాజ్యపు అధినేతను కలుస్తాననే ధీమా వ్యక్తం చేశాడు ట్రంప్. ఇక ట్రంప్ విగ్రహం ఏర్పాటుకు కృష్ణ రూ.1.30 లక్షలు ఖర్చు చేసినట్లు ఆమె తల్లి తెలిపింది. విగ్రహావిష్కరణ తర్వాత గ్రామస్తులకు విందు భోజనం కూడా కృష్ణ ఏర్పాటు చేశాడు. జూన్ 14న ట్రంప్ తన 73వ పుట్టిన రోజును జరుపుకున్నారు. ఆ సమయంలో కృష్ణ తన ఇంటి బయట ఓ పెద్ద పోస్టరు పెట్టి ట్రంప్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

English summary
Telangana Man from Jangaon district unveild US President Trump statue. Bussa Krishna says that he was a big fan of Trump and that he likes his attitude and the bold decisions that he takes.Krishna spent about Rs.1.3 lakh for the six feet tall Trump statue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X