• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

IPL 2021 suspended: బ్యాడ్‌లక్ టు కడప క్రికెటర్: ధోనీసేనలో చోటు: డెబ్యూ టోర్నీ అర్ధాంతరంగా

|

చెన్నై: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడప నుంచి ప్రతిష్ఠాత్మకమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్-2021 (IPL 2021) టోర్నమెంట్‌లో ఆడే అవకాశాన్ని దక్కించుకున్నయంగ్ క్రికెటర్ మారంరెడ్డి హరిశంకర్ రెడ్డికి దురదృష్టం వెంటాడింది. ఈ మెగా టోర్నమెంట్‌కు ఎంపికైనప్పటికీ.. అర్ధాంతరంగా వెనుదిరగాల్సి వచ్చింది. ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే ఇంటిదారి పట్టాల్సి వచ్చింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) దీన్ని అర్ధాంతరంగా వాయిదా వేయడమే దీనికి కారణం.

22 సంవత్సరాల మారంరెడ్డి హరిశంకర్ రెడ్డి స్వస్థలం రాయచోటి. కుడిచేతి వాటం మీడియం పేస్ బౌలర్. తొలివిడత మినీ ఐపీఎల్ వేలంపాటలో ఆయనకు ఛాన్స్‌ లభించింది. చెన్నై సూపర్ కింగ్స్‌కు అతను ఎంపికయ్యాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 18వ తేదీన చెన్నైలోని గ్రాండ్ చోళ హోటల్ వేదికగా సాగిన వేలంపాటలో హరిశంకర్ రెడ్డిని సొంతం చేసుకుంది ధోనీ సేన. మారంరెడ్డి బేస్ ప్రైజ్ 20 లక్షల రూపాయలు. అదే మొత్తానికి చెన్నై సూపర్ కింగ్స్ అతణ్ని జట్టులోకి తీసుకుంది. ప్రస్తుతం అతను ఆంధ్రా క్రికెటర్ జట్టుకు ప్రాతినిథ్యాన్ని వహిస్తున్నారు.

Kadapa Cricketer Harishankar Reddy hopes go in vain as the IPL 2021 suspended

ఇప్పటిదాకా మారంరెడ్డి 13 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. కిందటి నెల 15వ తేదీన ముంబైలో పుదుచ్చేరి టీమ్ మీద 35 పరుగులకు మూడు వికెట్లను తీసుకున్నాడు. కొంతకాలంగా అతను దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్నాడు. ఆ అనుభవంతోనే ఐపీఎల్‌ మినీ ఆక్షన్‌లో ఎంట్రీ లభించింది. అదృష్టం అతని తలుపు తట్టింది. ఆరోన్ ఫించ్, అలెక్స్ హేల్స్ వంటి అంతర్జాతీయ క్రికెటర్లు ఐపీఎల్‌లో చోటు దక్కించుకోవడంలో విఫలమైన చోట.. హరిశంకర్ రెడ్డికి అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటిదాకా ఏడు మ్యాచ్‌లను ఆడింది. ఈ ఏడింటిలోనూ అతనికి తుదిజట్టులో చోటు దక్కలేదు. డగౌట్‌కే పరిమితమయ్యాడు.

ఇంకా ఏడు మ్యాచ్‌లు మిగిలి ఉన్నందున హరిశంకర్ రెడ్డి ఆడే ఛాన్స్ దక్కి ఉండేది. అది కాస్తా అర్ధాంతరంగా ముగించాల్సి వచ్చింది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు బౌలింగ్ కోచ్ లక్ష్మీపతి బాలాజీ కరోనా బారిన పడ్డారు. ఫలితంగా -ఆ జట్టు మొత్తం ఐసొలేషన్‌కు వెళ్లాల్సి వచ్చింది. తన తదుపరి మ్యాచ్‌లో ధోనీసేన రాజస్థాన్ రాయల్స్‌ను ఢీ కొట్టాల్సి ఉంది. లక్ష్మీపతి బాలాజీకి కరోనా వైరస్ సోకడంతో బుధవారం జరగాల్సిన ఈ మ్యాచ్‌ను వాయిదా వేయాలంటూ మొదట్లో వార్తలు వెలువడ్డాయి. ఆ తరువాత సన్‌రైజర్స్ హైదరాబాద్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ వృద్ధిమాన్ సాహా, ఢిల్లీ కేపిటల్స్ స్పిన్నర్ అమిత్ మిశ్రా కరోనా బారిన పడటంతో టోర్నీ మొత్తాన్నీ బీసీసీఐ సస్పెండ్ చేసింది.

English summary
Kadapa Cricketer Harishankar Reddy hopes go in vain as the youngster did not play a match for CSK. His debut IPL 2021 tournament indefinitely suspended by the BCCI.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X