కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎగ్జామ్స్ ఫీవర్: పదో తరగతి పరీక్షలు: ఏ పరీక్ష..ఎప్పుడంటే..

|
Google Oneindia TeluguNews

కడప: పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది. అలాంటిలాంటి పరీక్షలు కాదు. పదో తరగతి పరీక్షలు. ఉన్నత విద్యను అభ్యసించడానికి పదో తరగతిని తొలి మెట్టుగా భావిస్తారు తల్లిదండ్రులు. ఇందులో మంచి మార్కులతో ఉత్తీర్ణులైతే.. ఇంటర్మీడియట్ లో మంచి కాలేజీలో ఉచితంగా సీట్ ను సాధించవచ్చనే ఆశ వారికి ఉంటుంది. పదో తరగతిలో మెరిట్ తెచ్చుకుంటే.. అదే ఊపు ఇంటర్మీడియట్, డిగ్రీల్లో ఉంటుందని విద్యార్థులు కూడా భావిస్తుంటారు. అలాంటి కీలక పరిక్షల సమయం వచ్చేసింది. వచ్చే నెల 18వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు ఆరంభం కానున్నాయి.

ఏప్రిల్ 2వ తేదీ వరకు కొనసాగుతాయి. దీనికి సంబంధించిన షెడ్యూల్ ను మంత్రి గంటా శ్రీనివాసరావు సోమవారం కడపలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పరీక్షల వివరాలను వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఆరు లక్షల 10 వేల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని అన్నారు. ఈ నెల 7 వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా కల్పిస్తున్నట్లు చెప్పారు. మార్చి 18 నుండి ఏప్రిల్‌ 2 వరకు మొత్తం 2,833 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తామని, నెల రోజుల్లో ఫలితాలను విడుదల చేస్తామని వెల్లడించారు.

10 class examinations scheduled released by education minister

పరీక్షలన్నీ ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం12:15 నిమిషాల వరకు కొనసాగుతాయి. హాల్‌ టికెట్లను ఆన్‌లైన్‌ ద్వారా వెబ్‌సైట్‌ నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చని సూచించారు. ఇదీ షెడ్యూల్..

సమయం : ఉదయం గం.9.30ల నుండి మధ్యాహ్నం 12.15 గంటల వరకు..

18/03/2019, ఫస్ట్‌ లాంగ్వేజ్‌ (తెలుగు) పేపర్‌-1,
19/03/2019 , ఫస్ట్‌ లాంగ్వేజ్‌ (తెలుగు) పేపర్‌-2
20/03/2019, సెకండ్‌ లాంగ్వేజ్‌ (హిందీ)
22/03/2019, ఇంగ్లీష్‌ పేపర్‌-1
23/03/2019, ఇంగ్లీష్‌ పేపర్‌-2
25/03/2019, మ్యాథ్స్‌ పేపర్‌-1
26/03/2019, మ్యాథ్స్‌ పేపర్‌-2
27/03/2019, జనరల్‌ సైన్స్‌ పేపర్‌-1
28/03/2019, జనరల్‌ సైన్స్‌ పేపర్‌-2
29/03/2019, సోషల్‌ స్టడీస్‌ పేపర్‌-1
30/03/2019, సోషల్‌ స్టడీస్‌ పేపర్‌-2

English summary
State Secondery Board examinations scheduled released by Education minister Ganta Srinivasa Rao. He released this scheduled at Kadapa. He told that total 6 lakhs 10 thousand student will appeared the exams and 2,833 centres will be identified for this purpose. Within a month we will released results..mnister added.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X