కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ సొంత జిల్లాలో కరోనా రికార్డు- కోలుకున్న 13 మంది డిశ్చార్జ్

|
Google Oneindia TeluguNews

ఏపీలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్నా కొన్ని జిల్లాల్లో మాత్రం పరిస్ధితి పూర్తిగా అదుపులోకి వస్తోంది. గతంతో పోలిస్తే ఆస్పత్రుల్లో కరోనా వైరస్ చికిత్స తీసుకుని డిశ్చార్జ్ అవుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఇదో సానుకూల సంకేతమని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా వైఎస్సార్ కడప జిల్లాలో కరోనా నుంచి కోలుకున్న పలువురిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.

కడపలో కరోనాపై విజయం...

ఏపీలో కరోనా వైరస్ ప్రభావం ప్రారంభమైన వారం పది రోజుల వరకూ కడప జిల్లాలో ఒక్కటంటే ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. దీంతో చాలా రోజుల పాటు అనుమానాలే తప్ప కేసులు లేని జిల్లాగా కడప పేరు తెచ్చుకుంది. కానీ ఢిల్లీ వెళ్లి వచ్చిన వారి కారణంగా జిల్లాలో కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. చివరికి తాజా లెక్కల ప్రకారం అది 36కు చేరింది. అయితే కరోనా బాధితులుగా తేలిన వారికి క్రమ పద్ధతిలో చికిత్స అందించిన అధికార యంత్రాంగం... ఇవాళ అందులో 13 మందిని డిశ్చార్జ్ చేసింది. పలుమార్లు పరీక్షలు నిర్వహించిన తర్వాత నెగెటివ్ రావడంతో వీరిని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా స్వయంగా ఆస్పత్రికి వచ్చి వీరిని డిశ్చార్జ్ చేశారు.

13 covid 19 patients recovered after treatment in ysr kadapa district

17 రోజులుగా చికిత్స... చివరికి..

17 రోజుల క్రితం కరోనా వైరస్ ప్రభావంతో కడపలో ఏర్పాటు చేసిన కోవిడ్ 19 ప్రత్యేక ఆస్పత్రిలో చేరిన వీరిని ప్రభుత్వం అన్నివిధాలుగా పరీక్షలు నిర్వహించింది. పరీక్షల తర్వాత పాజిటివ్ గా తేలినా వైద్యుల ప్రత్యేక పర్యవేక్షణలో చికిత్స అందించింది. దీంతో వీరంతా కేవలం రెండు వారాల వ్యవధిలోనే కోలుకున్నారు. రాష్ట్రంలో మరే చోట ఇంత ఎక్కువ స్ధాయిలో కరోనా పాజిటివ్ బాధితులు కోలుకోలేదంటూ అతిశయోక్తి కాదు. ఇప్పటివరకూ విశాఖ కోవిడ్ 19 ఆస్పత్రి నుంచి అత్యధికంగా పది మంది డిశ్చార్జ్ కాగా.. ఇప్పుడు 13 మందితో కడప ఆ రికార్డును బ్రేక్ చేసింది. ఆస్పత్రి నుంచి కోలుకున్న వారికి అవసరమైన పౌష్టిక ఆహార సామగ్రిని పంపిణీ చేసి డిప్యూటీ సీఎం అంజాత్ బాషా ఇళ్లకు పంపారు. ఈ
కార్యక్రమంలో కలెక్టర్ హరికిరణ్, ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ మేయర్ సురేష్ బాబు పాల్గొన్నారు.

English summary
13 coronavirus positive patients recovered in ysr kadapa district have discharged from hospitals today. after conducting repeated covid 19 tests they have confirmed negative. with this, the total number of covid 19 patients in the district decreases from 36 to 23 now.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X