• search
 • Live TV
కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

30 మంది 35 గంటలు.. కారాడివిలో చిక్కి, తిండి లేక, నీరు లేక.. అరచి, అరచి..

|

ఆంధ్రప్రదేశ్‌లో వర్ష బీభత్సం కొనసాగుతోంది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అయితే ఈ సమయంలో ఓ కుటుంబం పుట్టు వెంట్రుకలు తీయడానికి వెళ్లింది. అదీ కూడా నల్లమల అడవీలోకి వెళ్లి.. దారి తప్పిపోయింది. దాదాపు 30 మంది 35 గంటలపాటు జంగల్‌లో బిక్కుబిక్కుమంటూ గడిపేశారు. తినడానికి తిండి లేదు.. తాగడానికి గుక్కెడు నీళ్లు కూడా లేవు. అరచి అరచి నోరుపోయింది. ఫోన్లలో సిగ్నల్స్ కూడా లేకపోవడంతో వారి బాధ అరణ్య రోదన.. చివరికీ ఫోన్ సిగ్నల్ రావడంతో బతుకుజీవుడా అంటూ.. కాస్త ధైర్యం వచ్చింది.

మరో రెండు రోజులు... ఏపీకి భారీ వర్ష సూచన... మత్య్సకారులకు హెచ్చరిక...మరో రెండు రోజులు... ఏపీకి భారీ వర్ష సూచన... మత్య్సకారులకు హెచ్చరిక...

పుట్టువెంట్రుకల కోసం వెళ్లి.. తప్పిపోయి...

పుట్టువెంట్రుకల కోసం వెళ్లి.. తప్పిపోయి...

కడప జిల్లా ఖాజీపేట అగ్రహారానిక చెందిన ప్రశాంత్ లక్ష్మీ దంపతులు. వీరికి మూడేళ్ల కుమారుడు, 11 నెలల కూతురు ఉన్నారు. ఇద్దరికీ కలిపి ఓకేసారి పుట్టువెంట్రుకలు తీద్దామని అనుకున్నారు. అలా అనుకొని శనివారం రాత్రి మైదుకూరు మండలంలో గల నల్లమల బైరవకోనకు బయలుదేరారు. 30 మంది వరకు రెండు ట్రాక్టర్లలో వెళ్లారు. అలా వెళ్లారో లేదో వీరికి సమస్యలు చుట్టుముట్టాయి. రాత్రి కావడం, భారీ వర్షంతో ఇబ్బందులు పడ్డారు. వారు చేరుకోవాల్సిన గమ్యం కూడా చేరుకోలేదు. అలా అడవీలో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని గడిపారు.

నో సిగ్నల్..

నో సిగ్నల్..

దారి తప్పిపోయామని ఎవరికైనా ఫోన్ చేద్దామనుకున్న సిగ్నల్స్ లేవు. దీంతో వారికి చుక్కలు కనిపించాయి. రాత్రి కావడంతో.. ఏ వైపు నుంచి జంతువులు వస్తాయోమేనని భయపడ్డారు. శనివారం రాత్రి అరుస్తూ ఉన్నారు. అయితే ఆదివారం ఉదయం కూడా వారు దారి కనుగొనలేకపోయారు. ఆదివారం నిర్దేశిత ప్రాంతానికి వెళ్లే ప్రయత్నం చేశారు. లేదంటే తిరిగి వెళదామని అనుకొన్నారు. కానీ ఇంటికెళ్లేందుకు కూడా వారికి దారి కనిపించలేదు. ఆదివారం రాత్రి కూడా అరుస్తూనే ఉన్నారు. అరచి అరచి వారి గొంతుపోయింది. కానీ దారి మాత్రం లభించలేదు.

  Telugu TV Top Anchors Reduced Their Remuneration || Oneindia Telugu
  చివరికీ ఫోన్ కలవడంతో..

  చివరికీ ఫోన్ కలవడంతో..

  అలా సోమవారం వచ్చింది. చూడ చూడగా.. సాయంత్రం ఫోన్ సిగ్నల్ వచ్చింది. వారిపై ఎక్కడో ఆశలు చిగురించాయి. వెంటనే 100కి ఫోన్ చేశారు. జరిగిన ఘటనను వివరించారు. వారు ఉన్న ప్రాంతాన్ని జీపీఆర్ఎస్ ద్వారా పోలీసులు గుర్తించారు. స్ధానికులు కూడా పోలీసులకు సాయం చేశారు. దీంతో సోమవారం రాత్రి 9.30 గంటలకు వారు ఉన్న ప్రాంతానికి పోలీసులు చేరుకున్నారు. అడవీ నుంచి రక్షించి.. తీసుకొచ్చారు. కానీ 30 మంది మాత్రం.. అడవీలో తాము పడ్డ బాధను గుర్తుచేసుకొని బాధపడుతున్నారు. క్షణమొక యుగంలా గడిపామని.. తిరిగి వస్తామని అనుకోలేమని పేర్కొన్నారు.

  English summary
  30 people missed in nallamala forest 35 hours. they are feared in the forest in three days.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X