కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ పార్టీ తరపున పోటీలో 87ఏళ్ల మహిళ: ఎక్కడ్నుంచి అంటే..?

|
Google Oneindia TeluguNews

కడప: ఏ రాజకీయ నాయకులైనా 60-70ఏళ్లు రాగానే తమ రాజకీయ జీవితానికి ముగింపు పలకాలని అనుకుంటారు. తమ వారసులను రాజకీయాల్లోకి తీసుకువచ్చి తమ బాధ్యతలను వారికి అప్పగిస్తారు. కానీ, ఇక్కడ ఓ వృద్ధురాలు మాత్రం లేటు వయస్సులోనూ రాజకీయాల్లో కొనసాగుతోంది. ఏపీ అధికార పార్టీ నుంచి స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమైంది.

Recommended Video

3 Minutes 10 Headlines | Coronavirus Update | SBI Interest Rates| MP Political Crisis | Oneindia
87 ఏళ్ల వయస్సులో..

87 ఏళ్ల వయస్సులో..


వివరాల్లోకి వెళితే.. కడప జడ్పీ కార్యాలయానికి వచ్చి ఓ 87ఏళ్ల మహిళ. గాలివీడు మండల జడ్పీటీసీ స్థానానికి 87 ఏళ్ల వృద్ధురాలు షేక్ భానుబీ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. వైసీపీ మద్దతురాలిగా జడ్పీటీసీ ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు ఆమె ప్రకటించారు. కాగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఖాదర్ మొహినుద్దీన్ ఉన్నారు.

మహిళకు రిజర్వు కావడంతో..

మహిళకు రిజర్వు కావడంతో..

రాష్ట్ర చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి ఇటీవల జరిగిన కార్యకర్తల సమావేశంలో ఖాదర్ కుటుంబానికి జడ్పీటీసీ టికెట్‌ను కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. గాలివీడు జడ్పీటీసీ స్థానం బీసీ మహిళలకు రిజర్వ్ చేయడంతో మహిళలే పోటీ చేయాల్సి వచ్చింది. ఆ కుటుంబంలో అర్హత గల ఇతర మహిళలు లేకపోవడంతో తన తల్లి భానుబీని పోటీలో నిలిపినట్లు ఖాదర్ మొహినుద్దీన్ తెలిపారు.

ఆమె చురుకుగానే.. స్థానికంగా చర్చనీయాంశం..

ఆమె చురుకుగానే.. స్థానికంగా చర్చనీయాంశం..

పదేళ్ల కిందట జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో భానుబీ గాలివీడు ఎంపీటీసీ స్థానానికి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత ఇప్పుడు 87ఏళ్ల వయస్సులో కూడా జడ్పీటీసీగా పోటీ చేసేందుకు ఆమె ముందుకు రావడంతో స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఆమె చూపుతున్న ఉత్సాహానికి స్థానికులంతా ఆశ్చర్యానికి గురవుతున్నారు. కాగా, స్థానిక ఎన్నికలను అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. మంత్రులు, ఎమ్మెల్యేలు పార్టీ అభ్యర్థుల గెలుపునకు బాధ్యులని ఇప్పటికే వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తేల్చి చెప్పిన విషయం తెలిసిందే.

English summary
87 years old woman filed nomination for Galiveedu zptc seat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X