కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వరదలో ఆటో బోల్తా.. ఆరుగురు గల్లంతు.. మూడు రోజులైనా దొరకని ఆచూకీ

|
Google Oneindia TeluguNews

కడప జిల్లాలో వరద ఓ కుటుంబాన్ని బలి తీసుకుంది. ఆటో నడుపుకుంటూ జీవనం సాగించే ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తి గ్రామానికి చెందిన రామాంజనేయులు అనే వ్యక్తి కుటుంబం వరద ప్రవాహం లో గల్లంతయింది. ఒక శుభకార్యానికి వెళ్లి వస్తూ అర్ధరాత్రి చీకట్లో ఆటోలో ఇంటికి బయలు దేరిన వారుకామనూరు వంక దాటే ప్రయత్నంలో వరదల్లో చిక్కుకుపోయారు. వరద ప్రవాహం ధాటికి కొట్టుకుపోయారు.

కర్నూలు జిల్లాలో ఆటవిక ఘటన .. భార్యను కాపురానికి పిలిచినందుకు మర్మాంగం కోసి ఆపై ..కర్నూలు జిల్లాలో ఆటవిక ఘటన .. భార్యను కాపురానికి పిలిచినందుకు మర్మాంగం కోసి ఆపై ..

కామనూరు వంకలో అటో బోల్తా .. ఆరుగురు గల్లంతు

కామనూరు వంకలో అటో బోల్తా .. ఆరుగురు గల్లంతు

ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు కామనూరు వంకలో గల్లంతయ్యారు. రామాంజనేయులు తోపాటు అతని భార్య పెంచలమ్మ, తల్లి సుబ్బమ్మ, కుమార్తె మేఘన, అంజలి, మరో ఆరు నెలల బాబు ప్రవాహానికి కొట్టుకుపోయారు. అర్ధరాత్రి సమయంలో చోటు చేసుకున్న ఈ ఘటన లో వరదలో చిక్కుకున్న వారు వేసిన కేకలతో గ్రామస్తులు వారిని కాపాడే ప్రయత్నం చేశారు. అర్ధరాత్రి కావడంతో చుట్టూ చిమ్మ చీకటి ఉండడంతో, మరోపక్క వరద ఉధృతి ఎక్కువ కావడంతో వారిని కాపాడలేకపోయారు గ్రామస్తులు.

మూడు రోజులైనా దొరకని ఆచూకీ ..గాలింపుకు 4 బృందాలు

మూడు రోజులైనా దొరకని ఆచూకీ ..గాలింపుకు 4 బృందాలు

రెండు రోజులుగా గల్లంతైన వారి కోసం పోలీసులు ఇతర శాఖల అధికారులు ఎంత గాలించినా ఇప్పటివరకు రామాంజనేయులు కుటుంబ ఆచూకీ దొరకలేదు. కామనూరు వంక కుందూ నది లోకి ప్రవహిస్తున్న కారణంగా కుందూ నదిలో గాలింపు చేపట్టారు పోలీసులు. ప్రస్తుతం వీరి ఆచూకీ కోసం పోలీసులు 4 బృందాలను రంగంలోకి దింపారు. గజ ఈతగాళ్లతో వెతికిస్తున్నారు. వివిధ శాఖల అధికారులు, పోలీసులు ఎంత ప్రయత్నం చేసినా ఇప్పటివరకు ఒక్కరి ఆచూకీ కూడా దొరకలేదు.

 వరదలో కొట్టుకుపోయిన ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు

వరదలో కొట్టుకుపోయిన ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు

ఇక ఆదినిమ్మాయపల్లి ఆనకట్ట వద్ద కూడా గాలింపు చర్యలు చేపడతామని అధికారులు చెబుతున్నారు. ఆటో నడుపుతూ జీవనం సాగించే రామాంజనేయులు కుటుంబం మొత్తం వరద నీటిలో కొట్టుకుపోవడంతో పోట్లదుర్తి గ్రామంలో విషాదం అలముకుంది. వద్దన్నా వినకుండా వరదలో ఇంటికి బయలుదేరి కానరాని లోకాలకు చేరిపోయారని బంధువులు బోరున విలపిస్తున్నారు. ఇక వీరి ఆచూకీ కోసం అధికారులు తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు .

 కడపలో వరద ఉధృతి .. గాలింపు చర్యలకు ఆటంకం

కడపలో వరద ఉధృతి .. గాలింపు చర్యలకు ఆటంకం

కడప జిల్లాలోనూ వరద ఉధృతి కొనసాగుతోంది. కడప జిల్లాలో కుందూ, పెన్నా నదులు పొంగి ప్రవహిస్తున్నాయి.వాగులు, వంకలు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో వరదలో కొట్టుకుపోయిన వారి జాడ కోసం చేస్తున్న ప్రయత్నాలు అన్నీ విఫలం అవుతున్నాయి.

English summary
The flood killed one family in Kadapa district. The family of a man named Ramanjaneyulu from Potladurthy village was lost their lives in the flood. They attended a function and they left home in the midnight and were caught in a flood trying to cross the Kamanooru stream .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X