కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మంత్రి ఆదికి షాక్‌: జ‌మ్మ‌ల‌మడుగు అభ్య‌ర్ధిని తేల్చేసారు: మాట‌లే లేవు..స‌హ‌క‌రిస్తారా..!

|
Google Oneindia TeluguNews

క‌డ‌ప జిల్లాలో పోటీ చేసే అభ్య‌ర్దుల పై టిడిపి అధినేత కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. ముఖ్యంగా కొంత కాలంగా తెగ‌ని పంచాయితీగా ఉన్న జ‌మ్మ‌ల‌మ‌డుగు ఎమ్మెల్యే..క‌డ‌ప ఎంపీ గా ఎవ‌రు పోటీ చేయాల‌నే దాని పైనా నిర్ణ‌యం తీసుకున్న ట్లుగా తెలుస్తోంది. ఇదే స‌మ‌యంలో క‌మలాపురం అభ్య‌ర్ధి విష‌యంలోనూ చంద్ర‌బాబు ఓ నిర్ణ‌యానికి వ‌చ్చారు.

ఇష్టం లేకపోయినా..బ‌రిలోకి ఆది..!

ఇష్టం లేకపోయినా..బ‌రిలోకి ఆది..!

జ‌మ్మ‌ల‌మ‌డుగు ఎమ్మెల్యేగా వైసిపి నుండి గెలిచి ఆ తరువాత టిడిపిలో చేరి మంత్రి అయిన ఆది నారాయ‌ణ రెడ్డి క‌డ‌ప టిడిపిలో కీల‌కంగా మారారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆది నారాయ‌ణ రెడ్డికి ఇబ్బంది లేకుండా ఉండ‌టానికి స్థానిక టిడిపి సీనియ ర్ నేత మాజీ మంత్రి రామ‌సుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇచ్చారు. దీంతో..త‌మ‌కు ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో సీటు గ్యారంటీగా రామ సుబ్బారెడ్డి వ‌ర్గీయులు భావించారు. అయితే, కొద్ది రోజులుగా క‌డ‌ప ఎంపి..జ‌మ్మ‌ల మ‌డుగు ఎమ్మెల్యే సీటు ఈ ఇద్ద‌రి నేత‌ల‌తో ముఖ్య‌మంత్రి అనేక సార్లు స‌మావేశాలు నిర్వ‌హించారు. మీ ఇద్ద‌రిలోనే ఎవ‌రు ఎక్క‌డ నుండి పోటీ చేస్తారో తేల్చుకోవాల‌ని సూచించారు. అయితే, ఇద్ద‌రూ త‌మ‌కు జ‌మ్మ‌ల‌మ‌డుగు అసెంబ్లీ సీటు కావాలంటూ ప‌ట్టుబ‌ట్టారు. దీంతో..నిర్ణ‌యాన్ని ముఖ్య‌మంత్రికే వ‌దిలేసారు. సీయం ఎలా చెబితే అలా న‌డుచుకుంటా మ‌ని హామీ ఇచ్చారు. ఈ క్ర‌మంలోనే మంతి ఆదినార‌య‌ణ రెడ్డిని వ‌చ్చే ఎన్నిక‌ల్లో క‌డ‌ప ఎంపీగా బ‌రిలోకి దించాల‌ని సీయం తుది నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.

జ‌మ్మ‌ల మడుగు ఆయ‌నకే..

జ‌మ్మ‌ల మడుగు ఆయ‌నకే..

జ‌మ్మ‌ల‌మ‌డుగు అసెంబ్లీ సీటు కోసం స్థానికంగా సుదీర్ఘ కాలంగా వైరి వ‌ర్గాలుగా ఉన్న రామ‌సుబ్బారెడ్డి..ఆది నారాయణ రెడ్డి ఇద్ద‌రూ చివ‌రి నిమిషం వ‌ర‌కు ప్ర‌య‌త్నాలు చేసారు. ముఖ్య‌మంత్రి పై ఒత్తిడి తెచ్చారు. త‌మ సోద‌రులు..అనుచ రులు జ‌మ్మ‌ల‌మ‌డుగు నుండే పోటీ చేయ‌మ‌ని ఒత్తిడి తెస్తున్నార‌ని ఆది నారాయ‌ణ రెడ్డి సీయం కు వివ‌రించారు. ఇక‌, జ‌మ్మ‌ల‌మ‌డుగు లో తానే పోటీ చేస్తానంటూ రామ సుబ్బారెడ్డి చెబుతూ వ‌చ్చారు. ప్ర‌స్తుతం ఆయ‌న‌కు ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇవ్వ‌టం..ఇంకా ఆ ప‌ద‌వికి స‌మ‌యం ఉండ‌టంతో త‌మ‌కే సీటు ఇవ్వాల‌ని ఆది నారాయ‌ణ రెడ్డి ప‌ట్టుబ‌ట్టారు. అయితే,
దీని పై విస్తృత క‌స‌ర‌త్తు త‌రువాత ముఖ్య‌మంత్రి ఓ నిర్ణ‌యానికి వ‌చ్చారు. ఎంపీగా ఆదినార‌య‌ణ రెడ్డి, జ‌మ్మ‌ల‌మ‌డుగు ఎమ్మెల్యేగా రామ సుబ్బారెడ్డిని బ‌రిలోకి దింపాల‌ని నిర్ణ‌యించారు. సీయం కే తుది నిర్ణ‌యం వ‌దిలేయ‌టంలో ఆయ‌న తీసుకున్న నిర్ణ‌యం పై మంత్రి ఆది నారాయ‌ణ రెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి.

మాట‌లే లేవు..స‌హ‌కారం సాధ్య‌మా..

మాట‌లే లేవు..స‌హ‌కారం సాధ్య‌మా..

ఇద్ద‌రూ ఒకే పార్టీలో ఉంటున్నా..సుదీర్ఘ వైరం కార‌ణంగా ఇప్ప‌టికీ రామ‌సుబ్బారెడ్డి - ఆది నారాయ‌ణ రెడ్డి మ‌ధ్య కీనీస మాట‌లే లేవు. ఇద్ద‌రూ సీయం ముందు పంచాయితీలో కూర్చున్నా..మాట్లాడుకున్న సంద‌ర్భాలు లేవు. క‌డ‌ప ఎంపీగా పోటీకి ఆది నారాయ‌ణ‌రెడ్డిని దింప‌టం ద్వారా సొంత నియోజ‌క‌వ‌ర్గంలో రామ‌సుబ్బారెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేస్తార‌ని.. అయితే, ఎంపీగా జ‌మ్మ‌ల‌మ‌డుగు నుండి ఎక్కువ మెజార్టీ వ‌చ్చేలా చూడాల్సిన బాధ్య‌త రామ‌సుబ్బారెడ్డిదే న‌ని పార్టీ స్ప‌ష్టం చేస్తోంది. అయితే, ఈ ఇద్ద‌రి వైరం కార‌ణంగా ఎమ్మెల్యేగా రామ‌సుబ్బారెడ్డికి అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆది నారాయ‌ణ రెడ్డి వ‌ర్గం.. అదే విధంగా ఎంపీగా ఆదినారాయ‌ణ రెడ్డికి రామ‌సుబ్బారెడ్డి వ‌ర్గం ఎంత వ‌ర‌కు స‌హ‌క‌రిస్తుంద‌నేది సందే హంగానే ఉంటుంని విశ్లేష‌కుల అంచనా. ఇదే స‌మ‌యంలో ఎంపీగా పోటీ చేసి ఫ‌లితం ప్ర‌తికూలంగా ఉంటే..శాస‌న మండ‌లి స‌భ్యుడిగా అవ‌కాశం ఇస్తామ‌ని టిడిపి అధినాయ‌కత్వం హామ ఇస్తోంది. దీంతో..ఇప్పుడు ఈ నియోజ‌క‌వ‌ర్గం ఎన్నిక‌..ఎత్తులు..వ్యూహాల పై ఆస‌క్తి నెల‌కొంది.

English summary
Minister Adi Narayana Rddy may contest from Kadapa Loksabha as TDP candidate. Rama Subba Reedy contest form Jammalamadugu Assembly from TDP. Chandra Babu almost all taken decision on these two seats.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X