• search
  • Live TV
కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

అర్ద్రరాత్రి పంచాయితీ : జ‌మ్మ‌ల‌మ‌డుగు జ‌గ‌డం: ఎంపీగా ఎవ‌రు.. ఎమ్మెల్యేగా ఎవ‌రికి..!

|

ఇద్ద‌రూ రాజ‌కీయ ప్ర‌త్య‌ర్ధులే. ప‌రిస్థితులు వారిద్ద‌రినీ ఒకే పార్టీలో ఉంచాయి. కానీ, వారిలో ఎవ‌రూ ఎవ‌రిని పూర్తిగా న‌మ్మ లేని ప‌రిస్థితి. వారిలో ప్ర‌స్తుతం ఒక‌రు మంత్రిగా ఉండ‌గా..మ‌రొక‌రు ఎమ్మెల్సీగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇక‌, ఎన్నిక‌ల సీజ న్ వ‌చ్చేసింది. వీరిద్ద‌రిలో ఒక‌రిని ఎంపీగా పంపాల‌ని పార్టీ అధినేత ఆలోచ‌న‌. దీని పైనే అర్ద‌రాత్రి పంచాయితీ. కానీ, అక్క‌డ ఏం తేలింది.. ఎవ‌రిని లోక్‌స‌భ‌కు..ఎవ‌రిని అసెంబ్లీకి పంపాల‌ని నిర్ణ‌యించారు..

మ‌నుషులు క‌లిసినా..క‌ల‌వ‌ని మ‌నసులు..

మ‌నుషులు క‌లిసినా..క‌ల‌వ‌ని మ‌నసులు..

క‌డ‌ప జిల్లాలో జ‌మ్మ‌ల‌మ‌డుగు నియోజ‌క‌వ‌ర్గానికి ప్ర‌త్యేక‌త ఉంది. 2014 ఎన్నిక‌ల వ‌ర‌కు అక్క‌డ టిడిపి వ‌ర్సెస్ కాంగ్రె స్‌. రామ‌సుబ్బారెడ్డి వ‌ర్సెస్ ఆది నారాయ‌ణ రెడ్డి. ఇద్ద‌రూ రెండు పార్టీల నుండి పోటీ చేసారు. వైసిపి అభ్య‌ర్ధిగా పోటీ చేసిన ఆది నారాయ‌ణ రెడ్డి గెలిచారు. ఆ త‌రువాత అధికార పార్టీలోకి ఫిరాయించారు. ఫ‌లితంగా మంత్రి ప‌ద‌విని ద‌క్కించుకున్నారు. జ‌గ‌న్ పై అస్త్రంగా అవ‌స‌ర‌మైన ప్ర‌తీ సంద‌ర్భంలోనూ టిడిపి ఆదినారాయ‌ణ రెడ్డిని వ‌దులుతూ నే ఉంది.

ఇక‌, ఇప్పుడు క‌డ‌ప జిల్లా లో ప్ర‌తీ నియోజ‌క‌వ‌ర్గం టిడిపి కి కీల‌కంగా మారింది. దీంతో..వీరిద్ద‌రినీ ఒకే వేదిక మీద‌కు తేవ‌టం ద్వారా క‌డ‌ప లో రాజ‌కీయంగా ప‌ట్టు సాధిస్తామ‌ని ముఖ్య‌మంత్రి భావించారు. ఫ‌లితంగా ఇద్ద‌రి మ‌ధ్య స‌మ‌స్య‌లు త‌లెత్తిన ప్ర‌తీ సంద‌ర్భంలోనూ రాజీ చేస్తున్నారు. అయినా..వీరిద్ద‌రిలో ఒక‌రి పై మరొక‌రికి అప న‌మ్మ‌కం. ఒక‌రికి అవకాశం ఇస్తే రెండో వారితో స‌మ‌స్య‌. ఇద్ద‌రూ క‌లిసిన‌ట్లుగానే పైకి క‌నిపిస్తున్నా..లోలోప‌ల మాత్రం మ‌న‌సులు క‌లుసుకోవ‌టం లేదు.

చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న పై ఆంక్ష‌లు : కేంద్రం..ఎందుకిలా..! చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న పై ఆంక్ష‌లు : కేంద్రం..ఎందుకిలా..!

జ‌గ‌న్ ల‌క్ష్యంగా క‌డ‌ప లో అడుగులు..

జ‌గ‌న్ ల‌క్ష్యంగా క‌డ‌ప లో అడుగులు..


వైసిపి అధినేత సొంత జిల్లా క‌డ‌ప‌లోనే జ‌గ‌న్ ను దెబ్బ తీయాల‌ని టిడిపి అధినేత చాలా ప‌ట్టుద‌ల తో ఉన్నారు. అక్క‌డ జ‌గ‌న్ ను దెబ్బ కొట్ట‌టం అంత సులువు కాదనే విష‌యం ఆయ‌న‌కు బాగా తెలుసు. దీంతో..ప్ర‌తీ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకుంటున్నారు. కొద్ది కాలం క్రితం జ‌రిగిన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ బాబాయ్ వివేకానంద రెడ్డిని టిడిపి అభ్య‌ర్ధి బిటెక్ ర‌వి ఓడించారు. దీంతో..అక్క‌డ టిడిపి నేత‌లు క‌లిసి ప‌ని చేస్తే జ‌గ‌న్ అభ్య‌ర్ధులను దెబ్బ కొట్ట‌వ చ్చనే విశ్వాసం వారిలో పెరిగింది. అందులో భాగంగా.. క‌డ‌ప పార్ల‌మెంట్ ప‌రిధిలో పులి వెందుల త‌రువాత భారీగా మెజార్టీ వ‌చ్చే నియోజ‌క‌వ‌ర్గాల్లో జ‌మ్మ‌ల మ‌డుగు ఒక‌టి. అక్క‌డ వైసిపి నుండి గెలిచి టిడిపిలోకి ఫిరాయించి మంత్రి అయిన ఆది నారాయ‌న రెడ్డిని ఎలాగైనా వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఓడించి బుద్ది చెప్పాల‌ని వైసిపి నేత‌లు చెబుతున్నారు. ఇదే స‌మ‌యంలో స్థానిక సీనియ‌ర్ టిడిపి నేత రామ‌సుబ్బారెడ్డితో..ఆది నారాయ‌ణ‌రెడ్డికి ఉన్న విబేధాల‌ను త‌మ‌కు అనుకూ లంగా మ‌ల‌చుకోవాల‌ని వైసిపి భావిస్తోంది. దీంతో..ఈ ఇద్ద‌రు నేత‌ల‌తో ముఖ్య‌మంత్రి పంచాయితీ నిర్వ‌హించారు.

అర్ద‌రాత్రి పంచాయితీ..అయినా ఏం తేల్చారంటే..

అర్ద‌రాత్రి పంచాయితీ..అయినా ఏం తేల్చారంటే..

వ‌చ్చే ఎన్నిక‌ల్లో ముందుగానే అభ్య‌ర్ధుల‌ను ఖ‌రారు చేయాల‌నే ఉద్దేశంతో ఉన్న చంద్ర‌బాబు..దీనికి త‌గిన‌ట్లుగానే క‌డ ప పార్ల‌మెంట్ పై దృష్టి పెట్టారు. అక్క‌డ నుండి మంత్రిగా ఉన్న ఆదినారాయ‌ణ రెడ్డిని బ‌రిలోకి దించాల‌ని ఆలోచ‌న చేస్తున్నారు. అయితే, ఇది ఏక‌ప‌క్షంగా ప్ర‌క‌టిస్తే..

ఆదినారాయ‌ణ రెడ్డితో పాటుగా రామ సుబ్బారెడ్డి నుండి ఎటువంటి స్పంద‌న వ్య‌క్తం అవుతుందో అనే ఉద్దేశంతో ఇద్ద‌రినీ అర్ద‌రాత్రి పంచాయితీకి పిలిచారు. ఆ భేటీలో ఈ ఇద్ద‌రు నేత‌ల ఓత పాటుగా ఎంపీ సీఎం రమేష్, టీడీ జనార్ధన్ పాల్గొన్నారు. అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు ఈ పంచాయితీ జరిగింది. మీలో ఒక‌రు లోక్‌స‌భ‌కు..మ‌రొక‌రు జ‌మ్మ‌ల‌మ‌డుగు అసెంబ్లీకి పోటీ చేయాల్సి ఉం టుంద‌ని..ఎవ‌రు ఎక్క‌డ నుండి పోటీ చేస్తారో మీరే తేల్చుకోండ‌ని ముఖ్య‌మంత్రి సూచించిన‌ట్లు స‌మాచారం. అయితే, ఆది నారాయ‌ణ‌రెడ్డి మాత్రం త‌న కుటుంబం..వ‌ర్గం నేత‌ల‌ను ఇందు కోసం ఒప్పించాల్సి ఉంటుంద‌ని..మీరే వారితో మాట్లాడండ‌ని సూచించారు.

రామ సుబ్బారెడ్డి మాత్రం మీ ఇష్టం అంటూ ముఖ్య‌మంత్రికి స్ప‌ష్టం చేసిన‌ట్లు తెలుస్తోం ది. దీంతో..కొద్ది రోజుల్లోనే మ‌రో సారి పంచాయితీ ఏర్పాటు చేసి ఈ ఇద్దిర‌లో ఒక‌రిని లోక్‌స‌భ‌కు..మ‌రొక‌రిని జ‌మ్మల మ‌డుగు అసెంబ్లీకి పోటీ చేయించేలా ఒప్పందం చేసే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

English summary
Jammalamadugu dispute in TDP. Chandra Babu conducted meeting with minister Adi narayana reddy and MLC Rama subba reddy on this issue. C.m Suggested them to decide who contest as m.p and who contest as Mla. But, Decision nor clear.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X