• search
  • Live TV
కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

వివేకా హత్య కేసు- చంద్రబాబు బాటలోనే జగన్- ముప్పేటదాడితో కేంద్రంపైకి నెపం

|

ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తుపై సీఎం జగన్ కూడా మాజీ సీఎం చంద్రబాబు బాటలోనే పయనిస్తున్నట్లు కనిపిస్తోంది. చంద్రబాబు హయాంలో ఓవైపు సిట్‌ దర్యాప్తు జరుపుతున్నా సీబీఐ దర్యాప్తు కోరుతూ టీడీపీ సర్కారుపై తీవ్ర విమర్శలకు దిగిన జగన్‌.. ఇప్పుడు తన తల్లి విజయమ్మతో ఈ కేసు దర్యాప్తు తమ చేతుల్లో లేదని చెప్పించడం వెనుక కారణాలపై రాష్ట్రంలో చర్చ జరుగుతోంది. జగన్‌పై కోడి కత్తి దాడి కేసులో ఎన్ఐఏ దర్యాప్తు విషయంలో చంద్రబాబు అనుసరించిన వైఖరినే ఇప్పుడు జగన్ కూడా వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తుపై అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది.

వివేకా హత్య కేసుపై జగన్ ఉక్కిరిబిక్కిరి

వివేకా హత్య కేసుపై జగన్ ఉక్కిరిబిక్కిరి

వైసీపీ విపక్షంలో ఉండగా కడప జిల్లా పులివెందులలో జరిగిన మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు వైఎస్‌ కుటుంబాన్ని ఇప్పట్లో వీడేలా కనిపించడం లేదు. ఈ హత్యలో వైఎస్‌ కుటుంబీకుల పాత్రపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్న వేళ.. సీబీఐ దర్యాప్తు ఆలస్యం కావడం, దీన్ని త్వరగా పూర్తి చేయాలని కూడా జగన్ కోరకపోవడంపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వైసీపీ అధికారంలోకి రాక ముందు సీబీఐ దర్యాప్తు కోసం గట్టిగా డిమాండ్‌ చేసి, అధికారంలోకి వచ్చాక హైకోర్టు ఆదేశాలతో జరుగుతున్న సీబీఐ దర్యాప్తు ఆలస్యం కావడంపైనా మౌనం వహిస్తున్న జగన్ తీరును విపక్షాలు తూర్పారపడుతున్నాయి. ఇదే క్రమంలో వివేకా కుమార్తె సునీతారెడ్డి కూడా జగన్‌ను లక్ష్యంగా చేసుకుని తాజాగా చేసిన విమర్శలతో వైసీపీ సర్కారు ఇరుకునపడింది.

విజయమ్మతో చెప్పించడం వెనుక ?

విజయమ్మతో చెప్పించడం వెనుక ?

విపక్షంలో ఉన్నప్పుడు బాబాయ్‌ వివేకా హత్యపై సీబీఐ దర్యాప్తు కోసం పట్టుబట్టిన జగన్‌ అధికారంలోకి రాగానే మౌనంగా ఉండిపోవడంతో హైకోర్టును ఆశ్రయించి మరీ సీబీఐ దర్యాప్తు ఆదేశాలు తెచ్చుకున్న కుమార్తె సునీతారెడ్డి.. ఇప్పుడు జగన్‌ మౌనాన్ని నేరుగానే ప్రశ్నిస్తున్నారు. దీంతో ఆమె విమర్శలకు స్పందించక తప్పని పరిస్ధితి వైఎస్‌ కుటుంబానికి ఎదురవుతోంది. అలాగని సీఎం జగన్‌ దీనిపై ఓసారి స్పందిస్తే ఆ తర్వాత ఆమె మాట్లాడే ప్రతీ మాటకు స్పందించాల్సి వస్తుంది. లేకపోతే కొత్త అనుమానాలు వ్యక్తం కావడం ఖాయం. దీంతో జగన్‌కు బదులుగా ఆయన తల్లి విజయమ్మ ఈ ఆరోపణలపై స్పందిస్తూ లేఖ విడుదల చేసినట్లు తెలుస్తోంది.

కేంద్రంపైకి నెపం నెట్టేసిన వైనం

కేంద్రంపైకి నెపం నెట్టేసిన వైనం


కేంద్ర దర్యాప్తు సంస్ధ అయిన సీబీఐ దర్యాప్తు చేస్తున్న వివేకా హత్య కేసుపై తన కుమారుడు సీఎం జగన్‌ను టార్గెట్ చేయడం సరికాదని విజయమ్మ తాజా లేఖలో పేర్కొనడం చర్చనీయాంశమైంది. తమ చేతుల్లో లేని దర్యాప్తుపై తాము మౌనంగా ఉన్నామంటూ విమర్శలు చేయడమేంటని ఆమె ప్రశ్నిస్తున్నారు. కానీ గతంలో కేంద్రం పరిధిలోని సీఐఎస్ఎఫ్‌ బలగాలు కాపలా కాస్తున్న వైజాగ్‌ ఎయిర్‌పోర్టులో తనపై జరిగిన కోడి కత్తి దాడి కేసులో జగన్ అప్పటి టీడీపీ సర్కారును టార్గెట్‌ చేసి ఎన్‌ఐఏ విచారణకు ఆదేశాలు తెచ్చుకోవడం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. విపక్షంలో ఉండగా.. రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేసిన జగన్‌.. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అప్పట్లో చంద్రబాబు చేసినట్లుగానే కేంద్రంపైకి నెపం నెట్టేయడం చర్చనీయాంశమవుతోంది.

చంద్రబాబు బాటలోనే జగన్‌ రాజకీయం

చంద్రబాబు బాటలోనే జగన్‌ రాజకీయం

గతంలో చంద్రబాబు హయాంలో జగన్‌పై వైజాగ్‌ ఎయిర్‌పోర్టులో కోడి కత్తి దాడి జరిగినప్పుడు అది కేంద్ర ప్రభుత్వం, కేంద్ర బలగాల పరిధిలో ఉన్న ప్రాంతమని టీడీపీ మంత్రులు, డీజీపీ ఎంత చెప్పినా జగన్‌, వైసీపీ నేతలు విమర్శలు ఆపలేదు. చంద్రబాబే తనపై కోడి కత్తి దాడి చేయించారన్నంత స్ధాయిలో జగన్ ఆరోపణలు చేశారు. ఇప్పుడు తన బాబాయ్‌ వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తుపై మౌనాన్ని వివేకా కూతురు సునీతారెడ్డి ప్రశ్నిస్తుంటే మాత్రం అది కేంద్ర పరిధిలోని అంశమని తల్లి విజయమ్మతో చెప్పించడం వెనుక గల రాజకీయంపై సర్వత్రా చర్చ జరుగుతోంది.

English summary
andhra pradesh chief minister ys jagan seems to be following the footsteps of tdp chief chandrababu over cbi probe on his uncle ys vivekananda reddy's murder case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X