India
  • search
  • Live TV
కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జ‌గ‌న్ తో అమ‌ర‌నాధ‌రెడ్డి భేటీ : రాజంపేట పై తేల్చేసిన‌ వైసిపి అధినేత : ఆకేపాటి నిర్ణ‌యం ఇదే...!

|
Google Oneindia TeluguNews

క‌డప జిల్లా రాజంపేట టిడిపి ఎమ్మెల్యే మేడా మ‌ల్లి ఖార్జున రెడ్డి ఆ పార్టీని వీడి వైసిపిలో చేరారు. త‌న ఎమ్మెల్యే ప‌ద‌వ‌కి రాజీనామా చేసారు. ఇదే స‌మ‌యంలో మేడా రాక‌ను వ్య‌తిరేకిస్తూ ఆకేపాటి వ‌ర్గీయులు అసంతృప్త వ్య‌క్తం చేస్తున్నారు. ఈ ప‌రిస్థితుల్లో ఆకేపాటి ఆమ‌ర్నాధ‌రెడ్డి వైసిపి అధినేత జ‌గ‌న్ తో స‌మావేశ‌మ‌య్యారు. జ‌గ‌న్ సైతం త‌న నిర్ణ‌యాన్ని ఆకేపాటి కి స్ప‌ష్టం చేసిన‌ట్లు స‌మాచారం. మ‌రి..అమ‌ర్నాధ రెడ్డి స్పంద‌న పై ఆస‌క్తి నెలకొంది...

మేడా చేరిక తో మొద‌లైన పంచాయితీ..

మేడా చేరిక తో మొద‌లైన పంచాయితీ..

క‌డ‌ప జిల్లా రాజంపేట ఎమ్మెల్యే త‌న సోద‌రులు..అనుచ‌రుల‌తో క‌లిసి భారీ ర్యాలీగా వ‌చ్చి వైసిపి లో చేరారు.దానికి ముందుగానే త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసారు. తాను ఏ ప‌ద‌వి ఆశించ‌టం లేద‌ని తొలి సారి జ‌గ‌న్ కు క‌లిసిన స‌మ‌యంలో చెప్పిన మేడా త‌నకు పార్టీలో వ‌చ్చే అవ‌కాశాల పై జ‌గ‌న్ తో చ‌ర్చించారు. మేడా సోద‌రుడు ఈ సారి ఎన్ని క‌ల్లో పోటీ చేస్తార‌ని ప్ర‌చారం జ‌రిగింది. రాజంపేట లోక్‌స‌భ సభ్యుడు మిధున్ రెడ్డి మేడా ను పార్టీలోకి తీసుకురావ‌టం లో కీల‌క పాత్ర పోషించారు. ఇక‌, మేడా త‌న అనుచ‌ర వ‌ర్గంలో వైసిపి లో చేరే స‌మ‌యంలోనూ రాజంపేట వైసిపి ఇన్ ఛార్జ్ ఆకేపాటి అమ‌ర్నాధ‌రెడ్డి దూరంగా ఉన్నారు. దీంతో..అక్క‌డ పరిస్థితిని జ‌గ‌న్ అంచనా వేసారు. అమ‌ర్నాధ రెడ్డికి ప్రాధాన్య‌త త‌గ్గ‌ద‌ని ..ఇద్ద‌రూ క‌లిసి ప‌ని చేసుకోవాల‌ని మేడా కు స్ప‌ష్టం చేసారు. దీంతో..మేడా సైతం తాను ఆకేపాటి తో క‌లిసి ప‌ని చేస్తాన‌ని..వ‌చ్చే ఎన్నిక‌ల్లో రాజంపేట టిక్కెట్ త‌న‌కేన‌ని జ‌గ‌న్ స్ప‌ష్టం చేసార‌ని మేడా వెల్ల‌డించారు.

ఆకేపాటి అమ‌ర్నాధ‌రెడ్డి వ‌ర్గంలో క‌ల‌వరం..

ఆకేపాటి అమ‌ర్నాధ‌రెడ్డి వ‌ర్గంలో క‌ల‌వరం..

తొలి నుండి వైయ‌స్ కుటుంబం తో సన్నిహితంగా ఉంటూ..వైసిపి లో తొలి రోజు నుండి జ‌గ‌న్ కు విధేయుడుగా ఉన్న అమ‌ర్నాధ‌రెడ్డిని కాద‌ని మేడాకు సీటు ఇస్తాన‌ని జ‌గ‌న్ హామీ ఇవ్వ‌టం పై అమ‌ర్ నాద్ రెడ్డి శిబ‌రం లో అసంతృప్తి మొద‌లైంది. దీంతో..జ‌గ‌న్ త‌న‌ను క‌ల‌వాలంటూ అమ‌ర్నాధ‌రెడ్డికి స‌మాచారం పంపారు. జ‌గ‌న్‌తో స‌మావేశ‌మైన స‌మ యంలో రాజంపేట రాజ‌కీయ‌ల పై జ‌గ‌న్ స్ప‌ష్ట‌త ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. రాజంపేట నుండి మేడా పోటీ చేస్తార‌ని.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో జిల్లాలో అన్ని స్థానాలు గెలిపించే బాధ్య‌త తీసుకోవాల‌ని జ‌గ‌న్ సూచించారు. అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ఎమ్మెల్సీ ప‌ద‌వి తో పాటుగా టిటిడి ఛైర్మ‌న్ ప‌ద‌వి ఇస్తాన‌ని జ‌గ‌న్ హామీ ఇచ్చిన‌ట్లు విశ్వ‌స‌నీయ సమాచారం. తొలుత‌, ఈ భేటీకి అమ‌ర‌నాధ రెడ్డి వైసిపి వీడుతున్నార‌నే ప్ర‌చారం సైతం జ‌రిగింది.

జ‌గ‌న్ ను వీడ‌ను..ప్ర‌తిఫ‌లం ఆశించ‌ను..

జ‌గ‌న్ ను వీడ‌ను..ప్ర‌తిఫ‌లం ఆశించ‌ను..

జ‌గ‌న్ తో భేటీ త‌రువాత అమ‌ర‌నాధ రెడ్డి ఉత్సాహంగా క‌నిపించారు. త‌న అనుచ‌రుల‌కు జ‌గ‌న్ చెప్పిన అంశాల‌ను వివ రించారు. తాను స్వలాభం కోసం ఏనాడూ పాటుపడలేదని, కేవలం వై.ఎ్‌స.రాజశేఖర్‌రెడ్డి కుటుంబంపై ఎనలేని ప్రేమ తో వైసీపీ కోసం అహర్నిశలు పాటుపడుతున్నానని, తనకు ఎటువంటి ప్రతిఫలం అవసరం లేదని, కేవలం జగన్ ము ఖ్యమంత్రి కావడమే తన ఆశయమని ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి తన అనుచ‌రుల‌కు స్ప‌ష్టం చేసారు. జగన్‌మోహన్‌రెడ్డి తనకు ఎటువంటి అన్యాయం చేయరని, నమ్మిన వారిని ఆదుకునే వారెవరంటే వై.ఎస్‌ కుటుంబమేనన్నారు. పార్టీ విజయానికి అన్ని విధాలా పాటుపడతానన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవడమే తమ ముందున్న ప్రధాన ధ్యేయమని త‌న అనుచ‌రుల‌కు దిశా నిర్దేశం చేసారు. దీంతో..రాజంపేట లో మేడా చేరిక తో వైసిపి లో మొద‌లైన ముస‌లం స‌మిసిపోయింది.

English summary
Rajampeta crisis in YCP is cleared. Amarnath Reddy met jagan adn taken his future assurance from party president. Jagan says he will give more importance in party and govt.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X