కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

క్రిస్మస్ పండుగ కోసం సొంతూరికి సీఎం జగన్.. ఫ్యామిలీతో కలిసి మూడ్రోజులు అక్కడే..

|
Google Oneindia TeluguNews

ఏపీ సీఎం జగన్ ఎప్పటిలాగే ఈసారి కూడా క్రిస్మస్ వేడుకల్ని సొంతూరు పులివెందులలోనే జరుపుకోనున్నారు. ఫ్యామిలీతో కలిసి పులివెందుల సీఎస్ఐ చర్చిలో ప్రార్థనలో పాల్గొంటారు. పండుగకు రెండ్రోజుల ముందే ఆయన కడప జిల్లా పర్యటనకు బయల్దేరివెళ్లనున్నారు. ఈ నెల 23 నుంచి 25 దాకా కడప జిల్లాల్లో ఆయన పాల్గొనే కార్యక్రమాల షెడ్యూల్ ను అధికారులు సిద్ధం చేశారు.

సోమవారం ఉదయం కడప చేరుకుకోనున్న సీఎం జగన మొదట రైల్వే ఓవర్ బ్రిడ్జిని ప్రారంభిస్తారు. ఆ తర్వాత వివిధ డెవలప్మెంట్ ప్రోగ్సామ్స్ చూసుకుని, మధ్యాహ్నానికి జమ్ములమడుగులో ఏపీ హైగ్రేడ్‌ స్టీల్స్‌కు శంకుస్ధాపన చేస్తారు. అక్కడే బహిరంగసభను ఉద్దేశించి మాట్లాడుతారు. సాయంత్రానికి ఇడుపులపాయ చేరుకుంటారు.

ap cm ys jagan three days tour in kadapa district

మంగళవారం జగన్ ఫ్యామిలీ మొత్తం వైఎస్సార్ ఘాట్ కు వెళ్లి నివాళులర్పిస్తారు. అదేరోజు రాయచోటిలో సభ ఉంటుందని అధికారులు తెలిపారు. మంగళవారం సాయంత్రానికి పులివెందుల భాకరాపురంలోని సొంతింటికి జగన్ వెళ్తారు. బుధవారం క్రిస్మస్ వేడుకల తర్వాత రెండు మూడు ప్రోగ్సామ్స్ చూసుకుని సాయంత్రానికి విజయవాడ చేరుకుంటారు.

English summary
ap cm ys jagan to celebrate christmas in his home town
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X