• search
 • Live TV
కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

కడపలో కదం తొక్కిన బీజేపీ,జనసేనలు ..జగన్ పాలన అరాచకం అని నిప్పులు

|

ఏపీలో అధికార పార్టీ అయిన వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కడప జిల్లాలో బీజేపీ, జనసేన పార్టీల నేతలు ఆందోళనకు దిగారు. బీజేపీ, జనసేన పార్టీల నేతలపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ నగరంలోని అంబేద్కర్ కూడలిలో బీజేపీ నేతలు నిరసన చేపట్టారు.ఇక ఈ సందర్భంగా ఈ ఆందోళన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ తో పాటు పలువురు జనసేన పార్టీ నేతలు పాల్గొన్నారు. వైసీపీ దాడులు, దౌర్జన్యాలు నశించాలని, తక్షణం తమ పార్టీ నేతలపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివెయ్యాలని వారు డిమాండ్ చేశారు.

జగన్ ఢిల్లీ పర్యటనల ఎఫెక్ట్ .. ఎన్డీఏలోకి వైసీపీ ... జోరందుకున్న ప్రచారంపై కన్నా ఏం చెప్పారంటే

వివేకాది గుండెపోటు అని చెప్పి గుండెల్లో పొడిచిందెవరో తెలుసన్న ఆదినారాయణ రెడ్డి

వివేకాది గుండెపోటు అని చెప్పి గుండెల్లో పొడిచిందెవరో తెలుసన్న ఆదినారాయణ రెడ్డి

ఇక ఈ సందర్భంగా మాట్లాడిన బీజేపీ నేత , మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి వైసీపీ లాంటి అసమర్ధ, అరాచక ప్రభుత్వానికి చెక్‌ పెట్టాలని పేర్కొన్నారు .ఇక అంతే కాదు వివేకా హత్య కేసును గురించి ప్రస్తావిస్తూ వివేకాది మొదట గుండెపోటు అని చెప్పి గుండెల్లో పొడిచిందెవరో అందరికీ తెలుసని ఆయన విమర్శించారు. కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని జగనే కోరాడని ఇప్పుడు తానె వద్దని చెప్తునారని, అందులో మతలబు ఏంటో అందరికీ తెలుసనీ పేర్కొన్నారు.

ఏపీలో జగన్ పులి.. ఢిల్లీలో పిల్లి అని వ్యాఖ్యలు

ఏపీలో జగన్ పులి.. ఢిల్లీలో పిల్లి అని వ్యాఖ్యలు

జగన్‌ ఇక్కడ ఏపీలో పులి అని ఇక ఢిల్లీ వెళ్తే తమ అధినాయకులైన బీజేపీ పెద్దల ముందు పిల్లి అని ఆదినారాయణరెడ్డి ఎద్దేవా చేశారు. జగన్‌ కడపలో పుట్టినప్పటికీ కడప పౌరుషాన్ని అవమానిస్తున్నారన్నారు.వైసీపీ అధికారంలోకి వచ్చాక నేటి వరకు అరాచకమే రాజ్యమేలిందని ఆయన పేర్కొన్నారు . వైసీపీ అరాచక పాలనకు చరమ గీతం పాడాలని మాజీ మంత్రి , బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి పిలుపునిచ్చారు .

జగన్ ప్రజల రక్తాన్ని పీలుస్తున్నారని కన్నా విమర్శలు

జగన్ ప్రజల రక్తాన్ని పీలుస్తున్నారని కన్నా విమర్శలు

ఇదే కార్యక్రమంలో మాట్లాడిన కన్నా లక్ష్మీ నారాయణ వైసీపీ అధికారంలోకి వస్తే జగన్‌ మంచి పాలన అందిస్తారని ప్రజలు భావించారని కానీ అలాంటిదేమీ లేదని పేర్కొన్నారు.అధికారం చేపట్టిన తర్వాత జగన్ ప్రజల రక్తాన్ని పీలుస్తున్నారని బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. ఇక వైసీపీ రాక్షస పాలనను ఎవరైనా ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు.తక్షణం తమ నాయకులపై పెట్టిన తప్పుడు కేసులు ఎత్తివెయ్యాలని డిమాండ్ చేశారు .

  Janasena Chief Pawan Kalyan Visits Amaravati Villages | Oneindia Telugu
   బీజేపీ నేతలపై కేసులు బనాయిస్తున్నారని ఆగ్రహం

  బీజేపీ నేతలపై కేసులు బనాయిస్తున్నారని ఆగ్రహం

  ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీపై విమర్శలు గుప్పించిన మీరు ఇప్పుడు చేస్తున్నదేంటని కన్నా ప్రశ్నించారు. రాష్ట్రంలో వైసీపీ నేతలంతా ఇసుక అక్రమాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు కన్నా . ఇక వైసీపీ నేతలు కావాలనే బీజేపీ నేతలపై కేసులు బనాయిస్తూ శునకానందం పొందుతున్నారని విమర్శించారు. మోదీని రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేకప్రతిపక్షాలు నక్క జిత్తుల వ్యవహారాలు చేస్తున్నాయని కన్నా విమర్శించారు. వైసీపీ పాలనపై ప్రజలు చాలా వ్యతిరేకతతో ఉన్నారని కన్నా అభిప్రాయపడ్డారు.

  English summary
  Leaders of BJP and Jana Sena parties in Kadapa district have raised concerns over the anti-people policies of the YCP in the AP. BJP leaders staged a protest at the city's Ambedkar stadium demanding the withdrawal of illegal cases filed by BJP and Jana Sena leaders.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more