కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సీయం విచార‌ణ‌ను ప్ర‌భావితం చేస్తున్నారు: సీఈఓకు వివేకా కుమార్తె ఫిర్యాదు..

|
Google Oneindia TeluguNews

త‌న తండ్రి హ‌త్య కేసు ను ప‌క్క‌దారి ప‌ట్టించే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంద‌ని వివేకా కుమార్తె సునీత రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారికి ఫిర్యాదు చేసారు. సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు విచారణాధికారులను ప్రభావితం చేసేలా ఉన్నాయని ఆమె ఫిర్యాదు చేశారు. సిట్ విచారణ పారదర్శకంగా జరిగేలా చూడాలని ఆమె ద్వివేదిని కోరారు. త్వరలో కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఈ విషయంపై ఫిర్యాదు చేస్తామన్నారు సునీత‌.

Chandra babu statements may impact on SIT : Sunith complaint to CEO

దిగ్విజయ్ దుకాణం బందేనా?డిగ్గిరాజాను దూరం పెడుతున్న కాంగ్రెస్ హైకమాండ్ దిగ్విజయ్ దుకాణం బందేనా?డిగ్గిరాజాను దూరం పెడుతున్న కాంగ్రెస్ హైకమాండ్

సీఈవోకు ఫిర్యాదు
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ద్వివేదిని దివంగత వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె డా. సునీతారెడ్డి, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి కలిశారు. వివేకా హత్య కేసును తప్పుదారి పట్టించే ప్రయత్నం జరుగుతోందని ఆమె ద్వివేదికి ఫిర్యాదు చేశారు. సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు విచారణాధికారులను ప్రభావితం చేసేలా ఉన్నాయన్నారు. సిట్ విచారణ పారదర్శకంగా జరిగేలా చూడాలని ఆమె ద్వివేదిని కోరారు. త్వరలో కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఈ విషయంపై ఫిర్యాదు చేస్తామని చెప్పారు . సిట్ పై ప్రభావం చూపేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు ఉన్నాయి. దర్యాప్తు సంస్థపై సీఎం ఒత్తిడి ఉంటే కేసు తప్పుదారి పట్టే అవకాశం ఉంది. దర్యాప్తు సజావుగా జరిగేలా చర్యలు చేపట్టాలని ఎన్నికల ప్రధాన అధికారి దృష్టికి తీసుకు వెళ్లారు. ఈ ఫిర్యాదుపై కేంద్ర ఎన్నికల కమిషన్‌కు నివేదిక ఇస్తామని సీఈవో హామీ ఇచ్చారు.

Chandra babu statements may impact on SIT : Sunith complaint to CEO

కేంద్ర ఎన్నిక‌ల సంఘం దృష్టికి..

Chandra babu statements may impact on SIT : Sunith complaint to CEO
తాజాగా రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారికి ఫిర్యాదు చేసిన సునీత‌..ఈ వ్య‌వ‌హారాన్ని కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి నివేదిం చాల‌ని నిర్ణ‌యించారు. ఇప్ప‌టికే ఈ కేసు విచార‌ణ సిబిఐ కి అప్ప‌గించాల‌ని కోరుతూ జ‌గ‌న్ హైకోర్టును ఆశ్రయించారు. దీని పై రాష్ట్ర స్థాయిలో జ‌రుగుతున్న సిట్ విచార‌ణ పై వైసిపి నేత‌లు ఆనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. ఎన్నిక‌ల ప్ర‌చా రంలోనూ ఇది కీల‌క అంశంగా మారుతోంది. ఇప్పుడు హైకోర్టు దీని పై ఎటువంటి నిర్ణ‌యం తీసుకుంటుందో..ఇసి ఏ ర‌కంగా స్పందిస్తుందో అనే ఉత్కంఠ మొద‌లైంది.
English summary
YS Vivekananda Reddy's Daughter DR Sunitha Reddy complaint CEO on Chandra Babu on his statements on Viveka's murder. Sunitha expressed doubt that CM statements may impact on SIT investigation. She also decided to complaint to CEC.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X