కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కౌంటింగ్ రోజున ఖతర్నాక్ లకు చెక్ చెప్పిండి..! ఈసీని కలిసిన వైసీపి..!!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/హైదరాబాద్ : ఎన్నికల కౌంటింగ్‌ ఈనెల 23న జరగనున్న దృష్ట్యా ఎటువంటి అవాంతరాలు లేకుండా జరిగేందుకు అదనపు భద్రత, సీసీ కెమెరాల పర్యవేక్షణ ఏర్పాటు చేయాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నాయకులు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. ఈరోజు ఢిల్లీలో పార్టీకి చెందిన ఎంపీలు, మాజీ ఎంపీలు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, అవంతి శ్రీనివాస్‌, మేకపాటి రాజమోహన్‌రెడ్డి తదితరులు ఎన్నికల సంఘం సభ్యులతో భేటీ అయ్యారు. కౌంటింగ్‌ రోజున అలజడులు సృష్టించేందుకు తెలుగుదేశం పార్టీ ప్రయత్నించే అవకాశం ఉందని, అందువల్ల అదనపు బలగాలను మోహరించాలని కోరారు.

అడుగడుగునా అప్రమత్తం..! సీఈసి కి విజ్నప్తి చేసి వైసీపి..!!

అడుగడుగునా అప్రమత్తం..! సీఈసి కి విజ్నప్తి చేసి వైసీపి..!!

టీడీపీ ఉద్దేశపూర్వకంగా గొడవలు సృష్టించేందుకు కుట్రపన్నుతోందని తెలియజేసింది. కౌంటింగ్‌ ప్రక్రియ స్వేచ్ఛగా, పారదర్శకంగా జరిగేలా చూడాలని కోరారు. అలాగే చంద్రగిరి నియోజకవర్గంలో రీపోలింగ్‌ ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాని విజ్ఞప్తిచేశారు. విజయసాయి రెడ్డి మాట్లాడుతూ...ముఖ్యమంత్రి తన సొంత నియోజకవర్గమైన చంద్రగిరిలో చేసిన అరాచకాలను సీఈసీ దృష్టికి తీసుకువెళ్ళాం.

అదికార పార్టీపై అనుమానాలు..! జాగ్రత్తగా ఉండాలంటున్న వైసీపి నేతలు..!!

అదికార పార్టీపై అనుమానాలు..! జాగ్రత్తగా ఉండాలంటున్న వైసీపి నేతలు..!!

చంద్రగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తులు 7 పోలింగ్ బూత్ ల్లో రిగ్గింగ్ కు పాల్పడ్డారు. పోలింగ్ ఆఫీసర్ ను కూడా జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న బెదిరించారు. అయితే అక్కడ ఎటువంటి రిగ్గింగ్ జరగలేదని ప్రాణభయం పెట్టి పోలింగ్ ఆఫీసర్ తో నివేదిక ఇప్పించారు. రిగ్గింగ్ పై సీసీ ఫుటేజీని పరిశీలించాలని మేం కోరినా కలెక్టర్ పట్టించుకోలేదు. టీడీపీతో కుమ్మక్కై దళితుల ఓటు హక్కును అడ్డుకున్న జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సీఈసీ దగ్గర డిమాండ్ చేశామన్నారు.

శాంతి భద్రతలకు భంగం వాటిల్లొద్ది..! బలగాలను దించాలన్న ప్రతిపక్ష పార్టీ..!!

శాంతి భద్రతలకు భంగం వాటిల్లొద్ది..! బలగాలను దించాలన్న ప్రతిపక్ష పార్టీ..!!

దళితులుగా ఎవరైనా పుట్టాలనుకుంటారా అని మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. ఆయన మార్గదర్శకంలోనే టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అయితే ఏకంగా దళితులపై దాడులు, దౌర్జన్యాలు చేశారు. ఈవిధమైన పాలనతో దళిత ద్రోహిగా చంద్రబాబు నిలిచారు. అనంతపురం జిల్లా రాప్తాడుకు సంబంధించి ఆర్ వో.. స్థానిక మంత్రి సునీతకు తొత్తుగా వ్యవహరించి ఎన్నిక రోజు అరాచకాలకు పాల్పడ్డాడు. అతనిని కౌంటింగ్ డ్యూటీస్ నుంచి తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ కి చెందిన గూండాలు, రౌడీలను పోలింగ్ ఏజెంట్లు, కౌంటింగ్ ఏజెంట్లుగా నియమించారు.

రాజ్యంగ పరిరక్షణే అంతియ లక్ష్యం..! ఏపి పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్న జగన్ నాయకులు..!!

రాజ్యంగ పరిరక్షణే అంతియ లక్ష్యం..! ఏపి పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్న జగన్ నాయకులు..!!

తమకు అనుకూలంగా ఫలితాలు రాకపోతే.. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయించి.. రాష్ట్రంలో అరాచకాలు చేయాలని కుట్రలు జరుగుతున్నాయి. ఈ కుట్రలను అడ్డుకోవాలని కోరారు. కౌంటింగ్ కు ఆంధ్రప్రదేశ్ పోలీసులతోపాటు.. కేంద్ర బలగాలను పంపి.. పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని కోరామని సూచించారు. దేశ రాజకీయాల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాత్ర ఏమిటన్నది ఫలితాల తర్వాత పార్టీ అధినేత జగన్ గారు అందరితో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయానికి పార్టీలో ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉంటారు.

English summary
YSRC Congress leaders have asked the Central Election Commission to set up additional security and CC cameras to ensure that no electoral counting will take place on 23rd of this month.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X