కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కడప జిల్లాలో భగ్గుమన్న విభేదాలు: దొమ్మీకి దిగిన వైసీపీ నేతలు: లాఠీఛార్జీ.. ఉద్రిక్తత

|
Google Oneindia TeluguNews

కడప: కడప జిల్లాలో పాతకక్షలు భగ్గుమన్నాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే చెందిన రెండు గ్రూపుల నాయకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. రోడ్డెక్కి మరీ వైఎస్ఆర్సీపీ నాయకులు తన్నుకున్నారు. దొమ్మీకి దిగారు. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు లాఠీ ఛార్జీకి దిగడంతో పరిస్థితులు సద్దెమణిగాయి. అయినప్పటికీ.. ఎప్పుడేం జరుగుతుందో తెలియని వాతావరణం నెలకొంది.

తెలంగాణ ఆలయాల్లో భక్తులకు ఎంట్రీ: తలనీలాలు, గదుల అద్దె కష్టమే: దర్శనానికి మాత్రమే ఛాన్స్తెలంగాణ ఆలయాల్లో భక్తులకు ఎంట్రీ: తలనీలాలు, గదుల అద్దె కష్టమే: దర్శనానికి మాత్రమే ఛాన్స్

కడప జిల్లా బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని బీ కోడూరు మండలంలో బుధవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. బీ కోడూరు మండలం పరిధిలోని పాయలకుంటలో గ్రామ సచివాలయం నిర్మాణానికి శంకుస్థాపన సందర్భంగా అదే నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు కనిపించింది. తమ నాయకుడి చేతుల మీదుగా గ్రామ సచివాలయానికి శంకుస్థాపన చేయాలంటూ వారి అనుచరులు పోటీ పడ్డారు.

Clashes brake out between YSRCP leader in Badvel constituency in Kadapa district

దీనితో ఇరు పక్షాల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. అది కాస్తా ఘర్షణకు దారి తీసింది. వైసీపీ నాయకుల అనుచరులు పరస్పరం కొట్టుకున్నారు. దొమ్మీకి దిగారు. పిడిగుద్దులు కురిపించుకున్నారు. చేతికి అందిన వస్తువుతో దాడులకు పాల్పడ్డారు. రాళ్లు రువ్వుకున్నారు. కర్రలతో కొట్టుకున్నారు. దీనితో ఉద్రిక్త పాయలకుంటలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వారిపై లాఠీఛార్జీ చేశారు. చెదరగొట్టారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి.

ఈ ఘటనలో మాజీ జెడ్పీటీసీ కృష్ణారెడ్డి, యోగానంద రెడ్డి అనుచరులపై కేసు నమోదైంది. సచివాలయ నిర్మాణానికి తమకు కనీస సమాచారం ఇవ్వలేదంటూ మాజీ జెడ్పీటీసీ కృష్ణారెడ్డి అనుచరులు ఈ దాడికి పాల్పడినట్టు యోగానంద రెడ్డి వర్గీయులు ఫిర్యాదు చేశారు. కృష్ణారెడ్డి వర్గీయులు సైతం ఎదురు కేసు పెట్టారు. ఉద్దేశపూరకంగానే తమను రెచ్చగొట్టారని, వారే ముందుగా దాడులకు పాల్పడ్డారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

English summary
Clashes brake out between two groups in YSR Congress Party leaders in Badvel Assembly constituency in Kadapa district of Andhra Pradesh. Police rushed to the spot and make lathicharge on the mob.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X