కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సీఎంగా జ‌మ్మ‌ల‌మ‌డుగుకి జ‌గ‌న్ : ఆది నారాయ‌ణ‌రెడ్డికి జ‌ల‌క్ : అక్క‌డే అన్నింటికీ స‌మాధానం..!

|
Google Oneindia TeluguNews

ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్ తొలి సారి క‌డ‌ప జిల్లాకు వెళ్తున్నారు. ముఖ్య‌మంత్రి హోదాలో మ‌ర‌ణించిన త‌న తండ్రి వైయ‌స్సార్ జ‌న్మ‌దినం నాడు ముఖ్య‌మంత్రి హోదాలోనే జ‌గ‌న్ నివాళి అర్పించ‌నున్నారు. అదే రోజు త‌న తండ్రికి నివాళిగా ఆ రోజును రైతు దినోత్స‌వంగా జ‌ర‌పాల‌ని ముఖ్య‌మంత్రి నిర్ణ‌యించారు. అదే రోజు త‌న హాయంలో పెంచిన సామాజిక పెన్ష‌న్ల‌ను జ‌గ‌న్ పంపిణీ చేయ‌నున్నారు. దీంతో పాటుగా రైతుల‌కు సంబంధించిన అనేక కార్యక్ర‌మాల‌ను సీఎం ప్రారంభిస్తారు. వీటికి జ‌మ్మ‌ల‌మ‌డుగు వేదిక కానుంది. ముఖ్య‌మంత్రి జ‌మ్మ‌ల‌మ‌డుగునే ఎందుకు ఎంచుకున్నా రు...మాజీ మంత్రి ఆదినారాయ‌ణ రెడ్డి ఎక్క‌డ ఉన్నారు..జ‌గ‌న్ అక్క‌డ ఏం చెప్ప‌బోతున్నారు..

ముఖ్య‌మంత్రి హోదాలో క‌డ‌ప జిల్లాలోకి తొలిసారి..

ముఖ్య‌మంత్రి హోదాలో క‌డ‌ప జిల్లాలోకి తొలిసారి..

వైయ‌స్ జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయిన త‌రువాత తొలి సారి సొంత జిల్లా క‌డ‌ప‌కు వెళ్తున్నారు. అందుకు ముహూర్తంగా త‌న తండ్రి జ‌న్మ‌దినం నాడు వెళ్ల‌నున్నారు. ఈనెల 8న వైయ‌స్సార్ జ‌న్మ‌దినం కావటంతో ఇడుపుల పాయ‌లో త‌న తండ్రికి కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి నివాళి అర్పిస్తారు. అనంతరం గండి క్షేత్రంలో ఆలయ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతారన్నారు. పులివెందుల డాక్టర్‌ వైఎస్సార్‌ ఆర్టికల్చర్‌ యూనివర్శిటీకి అనుబంధంగా అరటి రీసెర్చ్‌ స్టేషన్‌కు గండిలో శంకుస్థాపన చేస్తారన్నారు.జమ్మలమడుగులో జరిగే సభలో రైతులకు మద్దతు ధర, వైఎస్సార్‌ పెన్ష న్‌ కానుక ప్రారంభించనున్నారన్నారు. క్వింటా శనగలకు రూ.6,500, వైఎస్సార్‌ పెన్షన్‌ను రూ.2250లు అందజేయ‌ను న్నారు.వృద్ధులకు, వికలాంగులకు, వితంతు తదితర పెరిగిన పింఛన్లు అందజేస్తారు. అయితే, తాజాగా తీసుకున్న నిర్ణ‌యం మేర‌కు ఇదే రోజున మ‌రో 12 కార్య‌క్ర‌మాల‌ను సీఎం జ‌గ‌న్ ప్రారంభించనున్నారు.

ఆదినారాయ‌ణ రెడ్డికి జ‌ల‌క్ ఇచ్చిన‌ట్లేనా..

ఆదినారాయ‌ణ రెడ్డికి జ‌ల‌క్ ఇచ్చిన‌ట్లేనా..

ముఖ్య‌మంత్రి అయిన త‌రువాత జ‌గ‌న్ జ‌మ్మ‌ల‌మ‌డుగులోకి అడుగు పెడుతున్న వేళ అంద‌రి దృష్టి మాజీ మంత్రి ఆది నారాయ‌ణ రెడ్డి మీదే ఫోక‌స్ ఉంది. ప్ర‌ధానంగా వైసీపీ కేడ‌ర్‌కు సీఎం హోదాలో జ‌గ‌న్ రావ‌ట‌మే ఆదినారాయ‌ణ రెడ్డికి స‌మాధానంగా చెబుతున్నారు. వైసీపీ నుండి గెలిచి టీడీపీలోకి ఫిరాయించి మంత్రి అయిన ఆదినారాయ‌ణ రెడ్డి శాస‌న స‌భ‌లో..బ‌య‌టా జ‌గ‌న్‌ను వ్య‌క్తిగ‌తంగా టార్గెట్ చేసి అనేక విమ‌ర్శ‌లు..ఆరోప‌ణ‌లతో పాటుగా ప‌లు సంద‌ర్భాల్లో ఎద్దేవా చేసారు. ఏది అడిగినా జ‌గ‌న్ తాను ముఖ్య‌మంత్రి అయిన త‌రువాత అంటూ స‌మాధానం ఇస్తార‌ని..జ‌గ‌న్ ఈ జ‌న్మ‌లో సీఎం అయ్యేది లేద‌ని హేళ‌న‌గా మాట్లాడేవార‌ని వైసీపీ నేత‌లు గుర్తు చేస్తున్నారు. తాజా ఎన్నిక‌ల్లో క‌డ‌ప ఎంపీగా పోటీ చేసి..జమ్మ‌ల‌మ‌డుగులో రామ‌సుబ్బారెడ్డి పోటీ ఖ‌చ్చితంగా జ‌మ్మ‌ల‌మ‌గుడులో గెలుస్తామ‌ని ధీమా వ్య‌క్తం చేసారు. ఎన్ని క‌ల స‌మ‌యంలో వివేకా మ‌ర‌ణం స‌మ‌యంలోనూ అదినారాయ‌ణ‌రెడ్డి మీద ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఇక‌, ఇప్పుడు జ‌గ‌న్ అధికారంలోకి రావ‌టంతో జ‌మ్మ‌ల‌మ‌డుగులో వైసీపీ గెల‌వ‌టంతో ఆదినారాయ‌ణ రెడ్డి పూర్తిగా రాజ‌కీయాల‌కు దాదాపు దూరంగా ఉంటున్న ప‌రిస్థితి కనిపిస్తోంది. జ‌గ‌న్ ఇక్క‌డే స‌భ ద్వారా అక్క‌డే వైసీప కేడ‌ర్‌లో మ‌రింగా జోష్ నింప‌ను న్నార‌ని పార్టీ నేత‌లు చెబుతున్నారు.

జ‌గ‌న్ సీరియ‌స్ వార్నింగ్‌: బిత్త‌ర‌పోయిన సీనియ‌ర్ మంత్రి: న‌లుగురు జూనియ‌ర్ల‌కు హెచ్చరిక‌.. <br /> జ‌గ‌న్ సీరియ‌స్ వార్నింగ్‌: బిత్త‌ర‌పోయిన సీనియ‌ర్ మంత్రి: న‌లుగురు జూనియ‌ర్ల‌కు హెచ్చరిక‌..

జ‌మ్మ‌ల‌మ‌డుగ‌లోనే ఈ కార్య‌క్ర‌మం ఎందుకంటే..

జ‌మ్మ‌ల‌మ‌డుగ‌లోనే ఈ కార్య‌క్ర‌మం ఎందుకంటే..

జ‌గ‌న్ త‌న తండ్రి జ‌న్మ‌దినం నాడు రైతాంగానికి సంబంధించిన కార్య‌క్ర‌మాలతో పాటుగా.. ప‌ధ‌కాల అమ‌లును క‌డ‌ప జిల్లా జ‌మ్మ‌ల‌మ‌డుగు నుండే ప్రారంభించాల‌ని నిర్ణ‌యించారు. ఇందు కోసం జ‌మ్మ‌ల‌మ‌డుగు నుండే ఆరంభించాల‌ని నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే వైయ‌స్సార్‌కు జ‌మ్మ‌ల‌మ‌డుగుకు విడ‌తీయ‌రాని బంధం ఉంది. వైయ‌స్సార్ పుట్టింది..పెరిగింది..వైద్యుడిగా సేవ‌లు అందించిందీ ఇక్కడే. ఆయ‌న జ‌మ్మ‌ల‌మ‌డుగులోని క్యాంబెల్ ఆస్ప‌త్రిలోనే జ‌న్మించారు. వైద్యుడిగా ఇక్క‌డే ప‌ని చేసారు. దీంతో..ఆయ‌న పుట్టిన ప్రాంతంలోనే ఆయ‌న జ‌న్మ‌దినం నాడు త‌న ప్ర‌భుత్వంతో రైతు సంక్షేమ కార్య‌క్ర‌మాల‌తో పాటుగా సామాజిక పెన్ష‌న్ల‌ను ప్రారంభించాల‌ని సీఎం నిర్ణ‌యించారు. ఈ కార్య‌క్ర‌మానికి వైయ‌స్సార్ కుటుంబ స‌భ్యుల‌తో పాటుగా జిల్లాకు చెందిన వైసీపీ నేత‌లు పాల్గొంటారు. దీనికి సంబం ధించి ఇప్ప‌టికే జిల్లా అధికారులు..నేత‌లు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసారు. ఇప్పుడు ఈ స‌భ రాజ‌కీయంగానూ ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

English summary
CM Jagan Arriving Kadapa first time as Chief Minister. He pray tributes to his father in Idupulpaya. Later he reach Jammalamadugu and start govt Famers schemes and distribute social pensions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X