కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైఎస్ వివేకానంద హత్య కేసులో సిట్ విచారణకు మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి గైర్హాజరు

|
Google Oneindia TeluguNews

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద హత్య కేసులో అనుమానితులను సిట్ ప్రశ్నిస్తోంది. వైఎస్ కుటుంబసభ్యులను, టీడీపీ నేతలను విచారిస్తోంది. ఇటీవల టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి సోదరుడు నారాయణ రెడ్డి హాజరయ్యారు. విచారణకు హాజరుకావాలని మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డిని సిట్ ఆదేశించింది. కానీ దర్యాప్తుకు మాత్రం మాజీ మంత్రి హాజరుకావడం లేదు.

వివేకానంద హత్య కేసులో బీటెక్ రవి విచారణ, ఎప్పుడూ పిలిచినా వస్తా, ఆదినారాయణ సోదరుడువివేకానంద హత్య కేసులో బీటెక్ రవి విచారణ, ఎప్పుడూ పిలిచినా వస్తా, ఆదినారాయణ సోదరుడు

అప్పట్లోనే ఆరోపణలు

అప్పట్లోనే ఆరోపణలు


వివేకానంద హత్య తర్వాత అప్పటి మంత్రి ఆదినారాయణరెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. అప్పటి ప్రభుత్వం విచారణకు సిట్‌‌ను నియమించింది. 9 నెలల నుంచి సిట్ దర్యాప్తు విచారిస్తోంది. దాదాపు చాలా మంది అనుమానితులను ప్రశ్నించింది. ఇటీవల బీటెక్ రవి, నారాయణరెడ్డి కూడా విచారించింది. దర్యాప్తుకు సహకరించాలని మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డిని కోరింది. విచారణకు రావాలని కోరింది. రెండుసార్లు పిలిచినా.. ఆదినారాయణ రెడ్డి మాత్రం హాజరుకాలేదు.

హస్తం ఉందా..?

హస్తం ఉందా..?

వివేకా హత్య కేసులో ఆదినారాయణరెడ్డి పాత్ర ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన ఢిల్లీలో ఉంటూ స్టే తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అతని సోదరుడు విచారణకు హాజరుకాగా.. ఆదినారాయణరెడ్డి రావడంలో అభ్యంతరం ఏంటి అని ప్రశ్న తలెత్తుతుంది. ఈ ఆరోపణలకు బలం చేకూరేలా ఆది ప్రవరిస్తున్నారు. రెండుసార్లు పిలిచినా రాకపోవడం ఏంటీ అనే అనుమానం కలుగుతుంది.

ప్రశ్నల వర్షం

ప్రశ్నల వర్షం


వివేకానంద హత్య కేసు విచారణను గత 9 నెలల నుంచి సిట్ విచారిస్తోంది. అనుమానితులను విడతలవారీగా ప్రశ్నిస్తున్నారు. ఇప్పటివరకు 1300 మంది అనమానితులను ప్రశ్నించామని సిట్ అధికారులు ప్రకటించారు. కొందరిని పుణెకు తీసుకెళ్లి నార్కొ అనాలిసిస్ టెస్ట్‌లు కూడా నిర్వహించారు. కానీ దర్యాప్తు మాత్రం కొలిక్కి రావడం లేదు. దీంతో ప్రభుత్వంపై విమర్శలు రావడంతో విచారణ పూర్తిచేయాలని ప్రభుత్వం సిట్‌కు స్పష్టంచేసింది. దీంతో విచారణను దర్యాప్తు సంస్థ వేగవంతం చేసింది.

అనుమానం వస్తే చాలు

అనుమానం వస్తే చాలు


వివేకానంద హత్యకేసు ఇప్పటికే వైఎస్ మనోహర్ రెడ్డి, టీడీపీ నేత కోరటి ప్రభాకర్‌ రెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నించారు. వారు చెప్పిన అంశాల ఆధారంగా మిగతావారికి నోటీసులు జారీచేశారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి, టీడీపీ నేత శివరామిరెడ్డిని కూడా ఎంక్వైరీ చేశారు. భాస్కర్ రెడ్డి, పనిమనిషిని కూడా ప్రశ్నించారు.

English summary
ex minister adinarayana reddy not attend sit enquiry.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X