కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేంద్రం నిషేధించిన ట్రస్ట్ విజయమ్మది కాదు: అదే అసలు కారణం: ఆ సంస్థ బాధ్యులు ఎవరంటే..!

|
Google Oneindia TeluguNews

తాజాగా కేంద్రం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఎఫ్ సీ ఆర్ ఏ రిజిస్ట్రేషన్ రద్దయిన స్వచ్చంద జాబితాలో వైయస్ విజయమ్మ ఛారిటబుల్ ట్రస్ట్ సైతం ఉన్నది . దీంతో..విజయమ్మ నిర్వహిస్తున్న ట్రస్ట్ పైన కేంద్రం నిషేధించిదంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. దీని వెనుక అనేక కారణాలు ఉన్నాయంటూ విశ్లేషణలు మొదలయ్యాయి. అయితే, ఈ సంస్థతో పాటుగా తెలుగు రాష్ట్రాల్లోని అనేక సంస్థల పైన నిషేధం విధించారు. అందులో ఏపీలో దాదాపు 90కి పైగా ఉన్నట్లు గుర్తించారు. అయితే, అసలు ఈ ఎన్జీఓ సంస్త పేరు వైయస్ విజయమ్మ అయినా..ఈ సంస్థకు విజయమ్మకు ఎలాంటి సంబంధం లేదు. అసలు ఈ సంస్థ వార్షిక నివేదికలు సమర్పించలేదనే కారణంతో రద్దు చేసారు. అసలు ఇంతకీ ఈ ట్రస్టు నిర్వహిస్తుంది..వైయస్ విజయమ్మ లేదా వారి కుటుంబ సభ్యులు కాదు.

ట్రస్టు ఎవరిదంటే..

ట్రస్టు ఎవరిదంటే..

తాజాగా కేంద్రం తీసుకున్న కొన్ని ఎన్జీఓల రద్దు వ్యవహారంలో ఏపీలో కీలక అంశం చోటు చేసుకుది. వైయస్ విజయమ్మ చారిటబుల్ ట్రస్ట్ ను సైతం నిషేధించిన జాబితాలో పొందరు పరిచారు. అయితే, ఈ ట్రస్టు కూడా ఉంది. అయితే, ఈ ట్రస్టు వైయస్ కుటుంబం నిర్వహిస్తున్నది కాదు. ఈ ట్రస్టుకు పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణానికి చెందిన అంబడిపూడి వీరభద్రావని మేనేజింగ్ ట్రస్టీగా వ్యవహరిస్తున్నారు. ఈ ట్రస్టు ద్వారా కొన్నాళ్ల పాటు వైద్య శిబిరాల నిర్వహణ.. సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రస్తుతం మాత్రం ఎలాంటి కార్యక్రమాలు కొనసాగించటం లేదు.

వైయస్ కుటుంబం అంటే ఇష్టంతో..

వైయస్ కుటుంబం అంటే ఇష్టంతో..

తనకు చిన్నప్పటి నుండి సేవా కార్యక్రమాలంటే ఇష్టమని వీరభద్రావతి చెబుతున్నారు. గతంలో పలు సేవా సంస్థలు స్థాపించి..వాటి ఆద్వర్యంలో అనేక కార్యక్రమాలను నిర్వహించానని వివరించారు. గత ఏడాది ఈ ట్రస్టును మూసివేసామని చెప్పుకొచ్చారు. అయితే, తనకు వైయస్ రాజశేఖర రెడ్డి..ఆయన కుటుంబమంటే ఎంతో అభిమానం అని..అందుకే విజయమ్మ పేరుతో 2012లో ఈ ట్రస్టు ప్రారంభించానని వివరించారు. అంతే తప్ప ఆ కుటుంబానికి..ఆ ట్రస్టుకు..వారితో తనకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేసారు.

వార్షిక రిటర్నులు సమర్పించలేదని..

వార్షిక రిటర్నులు సమర్పించలేదని..

తమ సంస్థ కు కేంద్ర సంస్థల నుండి నోటీసులు వచ్చిన విషయాన్ని ట్రస్టీగా ఉన్న వీరభద్రావతి నిర్ధారించారు. 2017-18 వార్షిక రిటర్నులు సమర్పించలేదన్న కారణంతో తమకు నోటీసు వచ్చిందన్నారు. అయితే, విదేశీ నిధుల నియంత్రణ చట్టం 2010 ప్రకారం.. నివేదికలను సమర్పించాల్సి ఉన్నా.. 2017-18 సంవత్సరానికి నివేదికలు సమర్పించడంలో నిషేధానికి గురైన సంస్థలు విఫలమయ్యాయని కేంద్ర హోంశాఖ తెలిపింది. 2019, మార్చి 31 వరకు గడువు పొడిగించినా కూడా వార్షిక నివేదికలు సమర్పించలేదని, వార్షిక నివేదికలు సమర్పించకపోవడం చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు. చివరి సారిగా జూన్ 22న నోటీసులు ఇచ్చామని, 15 రోజుల్లో ఆదాయ వ్యయ నివేదికలు సమర్పించాలని కోరినా...స్పందించకపోవటంతో నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

English summary
FCRA registraion cancelled YS Vijayamma Charitable trust not belongs to YS family. This NGO oraganising by A lady in Tanuku.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X