కడప యురేనియం కర్మాగారంలో అగ్ని ప్రమాదం
కడప: జిల్లాలోని ఎం తుమ్మనపల్లెలోని యురేనియం పరిశ్రమలో అగ్ని ప్రమాదం సంభవించింది. పరిశ్రమలోని కెమికల్ విభాగంలోని గొట్టానికి వెల్డింగ్ చేస్తుండగా ఒక్కసారిగా మంటలు పండ్డాయి. అయితే, ప్రమాదంలో ప్రాణ నష్టజరగలేదు.
అగ్ని ప్రమాదానికి గాల కారణాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న వెంటనే అగ్ని మాపక దళాలు ఘటనా స్థలానికి చేరి మంటలను అర్పుేశాయి.

బీభత్సం సృష్టించిన లారీ..
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం హనుమన్ జంక్షన్ వద్ద లారీ బీభత్సం సృష్టించింది. జాతీయ రహదారిపై కారు, బైక్ ను లారీ ఈడ్చుకుంటూ వెళ్లింది. దీంతో బైక్ పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. బైక్ పై ఉన్న మరో మహిళ కాళ్లు విరిగిపోయాయి.
కారులో ఇరుక్కుపోయిన నలుగురిని పోలీసులు బయటికి తీశారు. గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించారు. కాగా, లారీ డ్రైవర్ మద్యం సేవించి వాహనాన్ని నడిపినట్లు పోలీసులు భావిస్తున్నారు. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.