కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కడప జైలు స్పెషల్ .. దేశంలోనే తొలి స్కిల్ డెవలప్మెంట్ యూనిట్ ..శంకుస్థాపన చేసిన హోం మంత్రి

|
Google Oneindia TeluguNews

కడప కారాగారంలో దేశంలోని తొలి స్కిల్ డెవలప్మెంట్ యూనిట్ కు శంకుస్థాపన చేశారు హోం శాఖా మంత్రి మేకతోటి సుచరిత . రాష్ట్రంలోని అన్ని జైళ్లలో సంస్కరణలు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని హోంమంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు . కడప కారాగారంలో స్కిల్ డెవవలప్‌మెంట్‌ సెంటర్‌ కు నేడు శంకుస్థాపన చేసిన క్రమంలో ఆమె మాట్లాడారు.

 నిన్న విలేజ్ కోర్టులు ... నేడు విలేజ్ క్లినిక్ లు .. గ్రామాలపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్ నిన్న విలేజ్ కోర్టులు ... నేడు విలేజ్ క్లినిక్ లు .. గ్రామాలపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్

Recommended Video

3 Minutes 10 Headlines | AP EAMCET 2020 Notification | COVID-19 Update
మోడ్రన్‌ స్కిల్ డెవలప్‌మెంట్‌ యూనిట్‌ కు శంకుస్థాపన

మోడ్రన్‌ స్కిల్ డెవలప్‌మెంట్‌ యూనిట్‌ కు శంకుస్థాపన

హోం మంత్రి సుచరితతో పాటు డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు, అధికారులు ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు.4 కోట్ల 70 లక్షల రూపాయలతో మోడ్రన్‌ స్కిల్ డెవలప్‌మెంట్‌ యూనిట్‌ ను ఏర్పాటు చెయ్యనున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి మనదేశంలో ఎక్కడ జైలులోనూ ఇప్పటివరకు స్కిల్ డెవలప్మెంట్ యూనిట్ లేదని మొదటి సారిగా కడప జైలులో ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.

స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఉపాధి పొందేలా ఖైదీలకు ట్రైనింగ్

స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఉపాధి పొందేలా ఖైదీలకు ట్రైనింగ్


ఇలాంటి స్కిల్ డెవలప్మెంట్ యూనిట్ ఒక్క స్విట్జర్లాండ్ లోనే ఉందని ఆమె పేర్కొన్నారు. జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు బయటకు వెళ్లిన తరవాత స్కిల్ డెవలప్‌మెంట్‌ ద్వారా ఉపాధి పొంది ఉన్నత జీవితం గడపాలనేదే ప్రభుత్వ లక్ష్యం అని మంత్రి సుచరిత పేర్కొన్నారు .ఇక ఈ సందర్భంగా జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు తయారుచేసిన వివిధ రకాల వస్తువులు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను హోంమంత్రి పరిశీలించారు.

ఖైదీల సమస్యలపై సీఎం జగన్ తో చర్చిస్తానన్న హోం మంత్రి

ఖైదీల సమస్యలపై సీఎం జగన్ తో చర్చిస్తానన్న హోం మంత్రి


జైలులో ఏళ్ల తరబడి శిక్ష అనుభవిస్తూ, సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేసే అంశంపై ముఖ్యమంత్రితో మాట్లాడతామని , ఖైదీలు సన్న బియ్యం కావాలని అడుగుతున్నారని , ఇక ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్తానని మంత్రి పేర్కొన్నారు. ఖైదీలు తయారు చేస్తున్న వస్తువులు బహిరంగ మార్కెట్‌లోని వస్తువులతో పోటీ పడుతున్నాయని పేర్కొన్నారు. జైళ్లలో నాణ్యతతో కూడిన వస్తువులు తయారు చేస్తున్నారన్న గుర్తింపు వచ్చిందని మంత్రి సుచరిత తెలిపారు.

English summary
The Modern Skill Development Unit will be set up at Kadapa Jail with a sum of Rs 4 crore 70 lakhs. Speaking on the occasion, the minister said that for the first time in the country, there is no skill development unit anywhere in the country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X