కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అనుచ‌రులే సూత్ర‌ధారులా : వివేకా హ‌త్య కేసులో వీడుతున్న చిక్కుముడి : సిఐ స‌స్పెన్ష‌న్‌..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

వివేకా హ‌త్య కేసులో వీడుతున్న చిక్కుముడి...!! | Oneindia Telugu

మాజీ మంత్రి వైయ‌స్ వివేకానంద‌రెడ్డి హ‌త్య‌కు అస‌లు సూత్ర‌ధారులు ఆయ‌న అనుచ‌రులే అనే విష‌యాన్ని పోలీసు లు తేల్చారు. చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి ఆయ‌న గ్యాంగ్ ఇందులో పాత్ర‌ధారులుగా పోలీసుల విచార‌ణ లో తేలిన‌ట్ల విశ్వ‌స‌నీయ స‌మాచారం. ఇప్ప‌టి వ‌రకు 40 మందిని విచారించిన పోలీస‌లు అనేక కోణాల్లో విచారిస్తున్నారు. హ‌త్య జ‌రిగిన సమ యం లో నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించార‌నే కార‌ణంగా సిఐను స‌స్పెండ్ చేసారు.

గులాబీ బాస్ పెద్దపల్లి టికెట్ విషయంలో వివేక్ కు షాక్ ఇవ్వటానికి రీజన్ ఇదే గులాబీ బాస్ పెద్దపల్లి టికెట్ విషయంలో వివేక్ కు షాక్ ఇవ్వటానికి రీజన్ ఇదే

 ఆస్తి త‌గాదాలే కార‌ణ‌మా..

ఆస్తి త‌గాదాలే కార‌ణ‌మా..

వివేకానందరెడ్డి హత్యకు ఆస్తి తగాదాలే కారణం అని తెలుస్తోంది. ఆయ‌న తో పాటు ఉండే అనుచరులే ఆయన్ని చం పేశారనే విష‌యం ప్రాధ‌మికంగా నిర్ధార‌ణ అయిన‌ట్లు స‌మాచారం. పరమేశ్వర్‌రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి అనే వారు సూత్రధా రులైతే.. పాత్రధారిగా చంద్రశేఖర్‌రెడ్డి అండ్‌ గ్యాంగ్‌ ఈ దారుణానికి పాల్పడినట్లుగా పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. అలాగే ఈ కేసులో తాజాగా మరో ఇద్దరు కీలక వ్యక్తులను అదుపులోకి తీసుకుని, ఓ స్కార్పియో వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు 40 మందిని రహస్య ప్రదేశాల్లో విచారిస్తున్నారు. కేసు కొలిక్కి వస్తుండటంతో ఒకటి రెండురోజుల్లోనే అధికారికంగా అరె్‌స్టలు చూపించే అవకాశం ఉన్నట్లు పోలీస్‌ వర్గాలు పేర్కొంటు న్నాయి. ఈ కేసు ఇప్ప‌టికే రాజ‌కీయ దుమారానికి కార‌ణ‌మైంది.

రూ.1.50 కోట్ల వివాద‌మే..

రూ.1.50 కోట్ల వివాద‌మే..

వివేకానందరెడ్డి పేరుతో సింహాద్రిపురం.. బలపనూరు.. బెంగళూరు,..పులివెందుల తదితర ప్రాంతాల్లో భారీగానే స్థిరా స్తులు ఉన్నట్లు సమాచారం. బెంగళూరులో ఉన్న ఆస్తులపై కన్నేసిన ముఖ్య అనుచరులు వాటి ఆర్థిక లావాదేవీలలో రూ.1.50 కోట్లకు వివాదం నెలకొందని విచార‌ణ‌లో గుర్తించారు. హత్యకు 15 రోజుల ముందు చోటుచేసుకున్న ఈ వివా దం చంపేంత వరకు వెళ్తుందని వివేకా కూడా ఊహించలేదని చెబుతున్నారు. అందుకే భద్రతా చర్యలు తీసుకోకుం డా హంతకులైన అనుచరుల చుట్టూ వివేకా తిరుగుతూ వచ్చారని తెలిసింది. ఆయనకు ముఖ్య అనుచరులుగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి, పరమేశ్వర్‌రెడ్డిలు వివేకా ఆస్తులకు బినామీలుగా వ్యవహరించేవారని పోలీసులు గుర్తించినట్లు సమా చారం. పరమేశ్వర్‌రెడ్డి ఎమ్మెల్సీ బీటెక్‌ రవి చిన్నాన్న హత్య కేసులో జైలు శిక్ష అనుభవించి ఇటీవలే విడుదలయ్యా రు. బెంగళూరులో వివేకా పేరుతో భారీగానే ఆస్తులుండడం, వాటి అమ్మకాల్లో జరిగిన వివాదంతో వివేకాను హత్య చేయా లని ఆ ఇద్దరు ప్రణాళిక రచించారని విచార‌ణ‌లో పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది.

చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి గ్యాంగ్ ప‌నేనా..

చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి గ్యాంగ్ ప‌నేనా..

ఈ వివాదం లో భాగంగా వివేకాను హత్య చేసే పనిని చంద్రశేఖర్‌రెడ్డి అనే గ్యాంగ్‌స్టర్‌కు అప్పగించి ఆ తర్వాత అతనికి పెద్ద మొత్తమే ముట్టజెప్పేలా ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. తన సోదరుడు రంగేశ్వర్‌రెడ్డిని చంద్రశేఖర్‌రెడ్డి హత్య చేసి ఇటీవలే జైలు నుంచి విడుదలయ్యారు. ఇలాంటి హత్యలను చంద్రశేఖర్‌రెడ్డితో పాటు అతని వెంట ఉన్న గ్యాంగ్‌ చేస్తుందని పోలీసులు గుర్తించినట్లు సమాచారం. దీంతో.. చంద్రశేఖర్‌రెడ్డిని గురువారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్య జరిగిన రాత్రి 11.30గంటల ప్రాంతంలో చిన్న అనే వ్యక్తికి చెందిన స్కార్పియో వాహనంలో అత ను పులివెందులలో తిరిగినట్లు సీసీ ఫుటేజీల్లో పోలీసులు గుర్తించినట్లు చెబుతున్నారు. దీని ఆధారంగా పోలీసులు చంద్రశేఖర్‌రెడ్డిని అదుపులోకి తీసుకుని ఓ రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారు. కాగా, వివేకా హత్య అనంతరం ఎర్ర గంగిరెడ్డి సాక్ష్యాలు తారుమారు చేసేందుకు యత్నించాడని గుర్తించిన పోలీసులు, అలా ఎందుకు చేయాల్సి వచ్చిం దో ఆరా తీస్తున్నారు. ఈ అంశ‌మే ఇప్పుడు విచార‌ణ‌లోనూ..రాజ‌కీయ విమ‌ర్శ‌ల‌కు కీల‌కం గా మారింది.

English summary
YS Vivekanada murder case investigation is yet to concluding stage. Police suspecting Viveka's followers are the main culprits in this case. SIT investigating Chandra Sekhar reddy in this murder.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X