కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉగాది కల్లా, పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనేది ప్రభుత్వ లక్ష్యం : పిల్లి సుభాష్‌చంద్రబోస్

|
Google Oneindia TeluguNews

ఉగాది నాటికి రాష్ట్రంలోని పేదలందరికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఉన్నారని డిప్యూటి సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ చెప్పారు. ఈనేపథ్యంలోనే ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చేందుకు అధికారులు ముమ్మర కసరత్తు చేయాలని ఆయన కోరారు. కడప జిల్లాలో జరిగిన నవరత్నాలు - పేదలకు ఇళ్లు అనే అంశంపై జరిగిన సమీక్ష సమావేశంలో పిల్లి సుభాష్‌తోపాటు ,ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి,గృహనిర్మాణశాఖ మంత్రి రంగనాథరాజు కడపజిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గోన్నారు.

ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ భూపరిపాలన సక్రమంగా కొనసాగాలంటే అధికారులంతా చిత్తశుద్దితో పని చేయాలని ఆయన సూచించారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయని అన్నారు. వాటిని కాపాడాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపైనే ఉందని ఆయన చెప్పారు. ఈనేపథ్యంలోనే ముఖ్యమంత్రి కార్యాలయంలోకి వెళ్లగానే నవరత్నాల హమీలే కనిపిస్తాయని చెప్పారు. ఎప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుపెట్టుకుని రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలన్నదే ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి లక్ష్యమని తెలిపారు.

Housing lands should be given to each poor people by ugadi

గత ప్రభుత్వం జన్మభూమి కమిటీల పేరుతో రాక్షస పాలన చేసినందు వల్లే ప్రజలు ఆపార్టికి బుద్ధి చెప్పారని విమర్శించారు. ఈ సంధర్భంగా రాష్ట్రాభివృద్ధికి అందరూ విభేదాలు పక్కనపెట్టి కలిసి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈనేపథ్యంలోనే అంబేద్కర్‌, గాంధీల మధ్య ఎన్ని అభిప్రాయభేదాలున్నా ప్రజా సంక్షేమం కోసం అంబేద్కర్‌తో రాజ్యాంగాన్ని రాయించారని గుర్తు చేశారు.. మరోవైపు బలహీన వర్గాలకు 25 లక్షల ఇళ్లను కట్టించాలని నవరత్నాల్లో భాగంగా హమీ ఇచ్చారని చెప్పారు.

English summary
lands for Housing should be given to each poor people in andhra pradesh by the ugadi festival said deputy cm pilli subhash chandra bose.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X