• search
  • Live TV
కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

కడప స్టీల్‌పై లిబర్టీ హ్యాండ్సప్‌- జగన్‌ సర్కార్‌ యూటర్న్‌-కొత్త పార్ట్‌నర్స్‌ వేట

|

ఏపీలో వైసీపీ ప్రభుత్వం సీఎం జగన్ సొంత జిల్లాలో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కడప స్టీల్‌ ప్లాంట్‌కు ఆదిలోనే కష్టాలు చుట్టుముట్టాయి. ప్రభుత్వం నుంచి తక్కువ పెట్టుబడి అన్న ఏకైక కారణంతో ఎంపిక చేసుకున్న బ్రిటన్ భాగస్వామి లిబర్టీ స్టీల్స్‌ దివాళా తీయడంతో ఇప్పుడు ప్రభుత్వానికి దిక్కు తోచడం లేదు. దీంతో తప్పనిసరి పరిస్ధితుల్లో లిబర్టీ స్టీల్స్‌పై యూటర్న్‌కు ప్రభుత్వం సిద్ధపడింది. లిబర్టీ గ్రూప్‌ దివాళాపై కొంతకాలంగా చర్చ జరుగుతున్నా చివరి నిమిషం వరకూ వేచి చూసిన సర్కార్‌.. ఇప్పుడు చేసేది లేక వారికి గుడ్‌బై చెప్పేసింది.

మళ్లీ మొదటికి కడప స్టీల్ ప్లాంట్

మళ్లీ మొదటికి కడప స్టీల్ ప్లాంట్

సీఎం జగన్‌ సొంత జిల్లా కడపలోని జమ్మలమడుగులో స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణం కోసం ప్రభుత్వం గతేడాది ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రభుత్వం తరఫున తక్కువ ఈక్విటీ ఉందన్న కారణంతో బ్రిటన్‌కు చెందిన అంతర్జాతీయ స్టీల్‌ దిగ్గజం లిబర్టీ స్టీల్స్‌ను భాగస్వామిగా ఎంచుకుంది. ఆరునెలలు గడిచాయో లేదో లిబర్టీ స్టీల్స్‌ను ఆర్ధిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. బ్రిటన్‌లో లిబర్టీ స్టీల్స్‌ మాతృసంస్ధ గుప్తా ఫ్యామిలీ గ్రూప్‌కు రుణదాతగా ఉన్న గ్రీన్‌సెల్‌ సంస్ధ దివాళా తీసింది. కారణం అడిగితే గుప్తా ఫ్యామిలీ గ్రూప్‌ నష్టాలతో తాము నష్టపోయినట్లు చెప్పింది. చివరికి లిబర్టీ స్టీల్స్‌ రోజువారీ అప్పుల్లోకి దిగజారిపోయినట్లు తేలిపోవడంతో కడప స్టీల్స్‌ పరిస్ధితి మళ్లీ మొదటికొచ్చింది. మరి ఇలాంటి సంస్ధను ఎందుకు ఎంచుకున్నారంటే ఏపీ ప్రభుత్వం వద్ద సమాధానం లేదు.

లిబర్టీ స్టీల్స్‌పై సర్కార్‌ యూటర్న్‌

లిబర్టీ స్టీల్స్‌పై సర్కార్‌ యూటర్న్‌

లిబర్టీ స్టీల్స్‌ పరిస్ధితి నానాటికీ దిగజారుతున్నట్లు కొంతకాలంగా అంతర్జాతీయ, బిజినెస్‌ మీడియాలో కథనాలు వస్తున్నా ఏపీ ప్రభుత్వం మాత్రం పట్టించుకోలేదు. చివరికి పరిస్ధితి పూర్తిగా దిగజారిన తర్వాత బ్రిటన్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించి లిబర్టీ స్టీల్స్‌పై నివేదిక కోరింది. ఎంబసీ ఇచ్చిన రిపోర్ట్‌ కూడా ప్రతికూలంగా ఉండటంతో చివరికి లిబర్టీ స్టీల్స్‌ విషయంలో జగన్ సర్కార్‌ యూటర్న్‌ తీసుకుంది. నిన్న పరిశ్రమల మంత్రి మేకపాటి గౌతంరెడ్డి లిబర్టీ స్టీల్స్‌ను వదిలించుకోనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీంతో లిబర్టీతో కడప స్టీల్‌ ప్లాంట్‌ బంధం తెగినట్లయింది.

 కడప స్టీల్‌కు కొత్త భాగస్వాముల వేట

కడప స్టీల్‌కు కొత్త భాగస్వాముల వేట


కడప స్టీల్‌ ప్లాంట్ భాగస్వామి అయిన లిబర్టీ స్టీల్స్‌ దివాలా తీసిందన్న విషయాన్ని నిర్ధారించుకున్న ఏపీ ప్రభుత్వం ఇప్పుడు కడప స్టీల్‌కు కొత్త భాగస్వాముల్ని వెతికే పనిలో పడింది. ఇందుకోసం దేశీయ సంస్ధ ఎస్సార్‌ స్టీల్స్‌తో పాటు మరికొందరితో సంప్రదింపులు జరుపుతోంది. అయితే బ్రిటన్‌ సంస్ధ లిబర్టీ స్టీల్స్‌ తరహాలోనే ప్రభుత్వం తక్కువ పెట్టుబడి పెడుతుందన్న షరతు విధిస్తుండటంతో ఆయా సంస్ధలు ఆలోచనలో పడుతున్నాయి. ప్రభుత్వం మేజర్‌ వాటా కాకపోయినా కనీసం మైనర్‌ వాటా అయినా ఉండాలని వారు కోరుతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం లిబర్టీ స్టీల్‌ వాటా మీకిస్తామని ఆఫర్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఉక్కు పరిశ్రమలకు కష్టకాలం

ఉక్కు పరిశ్రమలకు కష్టకాలం

వాస్తవానికి మన దేశంతో పాటు అంతర్జాతీయంగా కూడా ఉక్కు రంగం గడ్డు పరిస్ధితులను ఎదుర్కొంటోంది. ఇలాంటి తరుణంలో ఏపీలో కొత్తగా ఉక్కు పరిశ్రమలో భాగస్వాములుగా చేరేందుకు పరిశ్రమలు పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. దక్షిణాఫ్రికా, స్విట్జర్లాండ్‌తో పాటు పలు దేశాలకు చెందిన సంస్ధలతో ప్రభుత్వం కడప స్టీల్‌ కోసం సంప్రదింపులు జరుపుతోంది. మరోవైపు విశాఖ ఉక్కు తీసుకునేందుకు సిద్ధమైన కొరియా సంస్ధ పోస్కో కూడా కడప స్టీల్‌ విషయంలో మాత్రం అనాసక్తత చూపుతోంది. తమకు తీర ప్రాంతంలోనే ఉక్కు పరిశ్రమ కావాలని కోరుతోంది. దీంతో కృష్ణపట్నం లేదా ప్రకాశం జిల్లాలో గ్రీన్‌ఫీల్డ్‌ ఉక్కు ప్లాంట్‌ నిర్మాణానికి మాత్రమే పోస్కో సిద్ధమవుతోంది.

English summary
after liberty steels' financial crisis, ap government is now start search for new partner to kadapa steel plant.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X