కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైసిపి లో చేరిన జ‌య‌సుధ : పోటీ ఎక్క‌డి నుండి అంటే..!

|
Google Oneindia TeluguNews

వైసిపి కి సినీ గ్లామ‌ర్ పెరుగుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు టిడిపిలో ఉన్న స‌హ‌జ న‌టి..మాజీ ఎమ్మెల్యే జ‌య‌సుధ వైసిపి లో చేరా రు. వైసిపి అధినేత జ‌గ‌న్ పార్టీ కండువా క‌ప్పి జ‌య‌సుధ‌ను పార్టీలోకి ఆహ్వానించారు. అయితే, ఎన్నిక‌ల ముందు వైసిపి లో చేరిన జ‌య‌సుధ పోటీ చేస్తారా లేదా..బ‌రిలోకి దిగితే ఎక్క‌డి నుండి అనేదే ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది..

<strong>ఫారం-7 ఎవ‌రైనా ఇవ్వ‌చ్చు : ఆ త‌రువాత ఒక్క ఓటు తొలిగించ‌లేదు : సీఈవో ద్వివేదీ..!</strong>ఫారం-7 ఎవ‌రైనా ఇవ్వ‌చ్చు : ఆ త‌రువాత ఒక్క ఓటు తొలిగించ‌లేదు : సీఈవో ద్వివేదీ..!

వైసిపి లో చేరిన జ‌య‌సుధ‌..

వైసిపి లో చేరిన జ‌య‌సుధ‌..

తెలుగుదేశం పార్టీకి షాక్‌ తగలింది. ప్రముఖ సినీ నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ టీడీపీకి గుడ్‌బై చెప్పి వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైదరాబాద్‌ లోటస్‌ పాండ్‌లో వైఎస్‌ జగన్ కండువా కప్పి జయసుధను పార్టీలోకి ఆహ్వానించారు.

జయసుధ

జయసుధ

అనం తరం జ‌యసుధ మీడియాతో మాట్లాడుతూ...‘వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయం. ప్రస్తుతానికి ఎన్ని కలలో పోటీ చేసే ఆలోచన లేదు. అయితే పార్టీ అధ్యక్షుడు ఆదేశాల మేరకు నడుచుకుంటా. వైఎస్సార్ సీపీలో చేరడంతో మళ్లీ సొంత ఇంటికి వచ్చినట్లు ఉందని తెలిపారు. జయసుధ 2009 ఎన్నికలలో సికింద్రాబాద్‌ నుంచి పోటీ చేసి గెలుపొం దారు. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి అకాల మరణం అనంతరం ఆమె ఆ పార్టీకి దూరంగా ఉన్నారు. జయసుధ ఆ తర్వాత 2016 లో టీడీపీలో చేరినా...క్రియా శీల‌కంగా లేరు.

పోటీ ఎక్క‌డి నుండి...!

పోటీ ఎక్క‌డి నుండి...!

జ‌య‌సుధ వాస్త‌వానికి సికింద్రాబాద్ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన నేత‌. వైసిపి లో ఇంత స‌డ‌న్ గా చేర‌టం వెనుక రానున్న ఎన్నిక‌ల్లో ఎక్క‌డి నుండైనా పోటీ చేసేందుకు వైసిపిని ఎంచుకున్నారా అనే చ‌ర్చ మొద‌లైంది. జ‌య‌సుధ ఏపి ఓట‌ర్ల కు సుప‌రిచితులు. అయితే, ఇప్ప‌టికే పార్టీలో చాలా కాలంగా ప‌ని చేస్తున్న వారికి వైసిపి అధినేత స‌మ‌న్వ‌య‌క‌ర్త‌ల‌ను నియ మించారు. వారిని కాద‌ని కొత్త‌గా జ‌య‌సుధ‌కు సీటు ఇచ్చే అవ‌కాశం లేదు. అయితే, ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో ఎక్క‌డి నుం డైనా పోటీ చేసే అవ‌కాశాలు కొట్టి పారేయ‌లేమ‌ని వైసిపి ముఖ్య నేత‌లు చెబుతున్నారు. దీంతో..జ‌గ‌న్ వైసిపిఅభ్య‌ర్ధుల‌ను ప్ర‌క‌టన ప్రారంభించిన త‌రువాత జ‌య‌సుధ పోటీ చేసే స్థానం పై ఓ స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశం ఉంది. జ‌య‌సుధ మాత్రం తన‌కు పోటీ చేసే అలోచ‌న లేద‌ని చెబుతున్నారు.

English summary
Telugu cine actress jayasudha resigned TDP and joined in YCP in presence of YS Jagan. She says no interest in contest in up coming elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X