కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైఎస్ జగన్మోహనపురం: వాటికంటే డిఫరెంట్‌గా: సెటైర్లు సంధిస్తోన్న టీడీపీ ఫ్యాన్స్

|
Google Oneindia TeluguNews

కడప: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. మూడు రోజుల పర్యటన కోసం ఆయన బుధవారం సాయంత్రం ఇడుపులపాయకు చేరుకున్నారు. రాత్రి అక్కడే బస చేశారు. ఈ ఉదయం ఆయన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధిని సందర్శించారు. ప్రత్యేక ప్రార్థనలను నిర్వహించారు. అనంతరం ఆయన పులివెందులకు బయలుదేరి వెళ్లారు. పులివెందులలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయబోతోన్నారు. పులివెందులలో కొత్త ఆర్టీసీ బస్‌స్టాండ్, అపాచీ లెదర్ డెవలప్‌మెంట్ పార్క్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు.

వన్ ఇండియా స్పెషల్ పేజ్: మీ ఫ్రెండ్స్‌కు ఈ - గ్రీటింగ్స్‌తో న్యూఇయర్ విషెస్ చెప్పండి..

కొమరగిరిలో..

కొమరగిరిలో..

శుక్రవారం ఆయన పులివెందుల చర్చిలో క్రిస్మస్ పండుగ వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం తూర్పుగోదావరి జిల్లాకు బయలుదేరి వెళ్తారు. జిల్లాలోని యు కొత్తపల్లి మండలం కొమరగిరిలో పట్టాల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. కొమరగిరిలో వైఎస్ఆర్ జగనన్న కాలనీ పేరు మీద ప్రభుత్వం 367 ఎకరాలను సేకరించింది. దీనికి సంబంధించిన పట్టాల పంపిణీ ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. అదే రోజు మిగిలిన చోట్ల ఆయా జిల్లాల మంత్రులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. 28న చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని ఉరందూరు వద్ద వైఎస్ జగన్ రెండోదశ ఇళ్ల పట్టాల పంపిణీని చేపడతారు.

రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు నో హాలిడే..

రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు నో హాలిడే..

రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన 30.75 లక్షల మందికి ఇంటి పట్టాలను అందించనున్నారు. తొలిదశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపనలను నిర్వహించబోతోంది ప్రభుత్వం. వారం రోజుల వ్యవధిలో దశలవారీగా మొత్తం కార్యక్రమాన్ని పూర్తి చేస్తుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. అదే రోజు అర్హుల పేర్ల మీద ఇళ్ల పట్టాలను కూడా రిజిస్ట్రేషన్ చేస్తారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని రిజిస్ట్రేషన్ కార్యాలయాన్నింటికీ ప్రభుత్వం క్రిస్మస్ సెలవును రద్దు చేసింది. ఆయా కార్యాలయాలన్నీ యధావిథిగా పనిచేస్తాయని పేర్కొంది.

 జగన్మోహనపురం పేరుపై

జగన్మోహనపురం పేరుపై

డాక్టర్ వైఎస్సార్ పేదలందరికీ ఇళ్ల పట్టాల పంపిణీ పథకం కింద పులివెందులలో నిర్మించ తలపెట్టిన గృహ సముదాయానికి వైఎస్ జగన్మోహనపురం అని పేరు పెట్టారు. ఇది కాస్తా విమర్శలకు దారి తీస్తోంది. ఈ పేరు చుట్టూ సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, సోషల్ మీడియా విభాగం ప్రతినిధులు.. దీనిపై సెటైర్లు సంధిస్తున్నారు. ఈ పేరును పెట్టడం పట్ల అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం ప్రతినిధులు దీనికి కౌంటర్ ఇస్తున్నారు.

 ముఖ్యమంత్రుల పేర్ల మీద కాలనీలు కొత్తేమీ కాదు గానీ..

ముఖ్యమంత్రుల పేర్ల మీద కాలనీలు కొత్తేమీ కాదు గానీ..

ఇదివరకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి మనవడు నారా దేవాన్ష్ పేరు మీద కాలనీని ఏర్పాటు చేసిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ముఖ్యమంత్రుల పేర్ల మీద కాలనీలు ఏర్పాటు కావడం కొత్తేమీ కాదు. ఎన్టీ రామారావు, డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు పేర్ల మీద కాలనీలు, నివాస సముదాయాలు చాలా వెలిశాయి. అయినప్పటికీ.. వైఎస్ జగన్మోహనపురం అనే పేరు వాటన్నింటి కంటే కాస్త భిన్నంగా ఉండటం సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. తెలుగుదేశం-బీజేపీ-జనసేన పార్టీల అభిమానులు ఒకవంక.. వైఎస్ఆర్సీపీ ఫ్యాన్స్ మరోవంక ఓ మినీ యుద్ధమే నడుస్తోంది ఈ పేరు మీద.

English summary
Netizens sattaires on social media over YS Jaganmohana puram in Pulivendula. Chief Minister YS Jagan Mohan Reddy on Monday reviewed the distribution of House site pattas for the poor, scheduled for launch on December 25 on the auspicious day of Vikunat Ekadasi as well as Christmas.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X