కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రొద్దుటూరులో టీడీపీనేత సుబ్బయ్య అంత్యక్రియలలో పాల్గొన్న నారాలోకేష్ .. శవరాజకీయాలని వైసీపీ ఫైర్

|
Google Oneindia TeluguNews

కడప జిల్లా ప్రొద్దుటూరులో దారుణ హత్యకు గురైన టిడిపి నేత సుబ్బయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ రోజు కూడా ప్రొద్దుటూరు లోనే ఉన్నారు. ఈరోజు సుబ్బయ్య అంత్యక్రియలలో లోకేష్ పాల్గొంటున్నారు. సుబ్బయ్య అంతిమయాత్రలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో పాటుగా టిడిపి కార్యకర్తలు పార్టీ నేతలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మరోవైపు లోకేష్ ప్రొద్దుటూరు పర్యటనపై వైసీపీ నేతలు భగ్గుమంటున్నారు .

నారాలోకేష్ కు ఆ కీలక బాధ్యతలు అప్పగించిన చంద్రబాబు నారాలోకేష్ కు ఆ కీలక బాధ్యతలు అప్పగించిన చంద్రబాబు

సుబ్బయ్య హత్య నేపధ్యంలో ప్రొద్దుటూరులో ఉద్రిక్తత .. నిన్నంతా హైడ్రామా

సుబ్బయ్య హత్య నేపధ్యంలో ప్రొద్దుటూరులో ఉద్రిక్తత .. నిన్నంతా హైడ్రామా

నిన్న సుబ్బయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన నారా లోకేష్ తో , సుబ్బయ్య భార్య అపరాజిత తన భర్త చావుకు కారణం స్థానిక ఎమ్మెల్యే రాజమల్లు శివప్రసాద్ రెడ్డి , ఆయన బావమరిది బంగారు మునిరెడ్డి , ప్రొద్దుటూరు పురపాలక కమిషనర్ రాధ అని తెలిపి, పోలీసులకు చెప్పినప్పటికీ పోలీసులు ఎఫ్ఐఆర్లో వారి పేర్లను నమోదు చేయలేదని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో నారా లోకేష్ శవం వద్ద బైఠాయించి ఎఫ్ఐఆర్లో వారి పేర్లను నమోదు చేయాల్సిందిగా ధర్నా చేశారు.

ప్రొద్దుటూరులోనే ఉన్న లోకేష్ .. నేడు అంత్య క్రియలు

ప్రొద్దుటూరులోనే ఉన్న లోకేష్ .. నేడు అంత్య క్రియలు

నిన్నంతా ప్రొద్దుటూరులో సుబ్బయ్య హత్య నేపథ్యంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. నారా లోకేష్ శవం వద్ద బైఠాయించి ఆందోళన చేయడంతో పోలీసులు మరోమారు అపరాజిత నుండి వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. ఇప్పటికే ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన కారణంగా ,కోర్టును సంప్రదించి వారి పేర్లు చేరుస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. సాయంత్రం సుబ్బయ్య అంత్యక్రియలు జరగాల్సి ఉండగా, స్థానిక నేతల పేర్లు చేర్చడం కోసం చేసిన ఆందోళన నేపథ్యంలో అప్పటికే రాత్రి కావడంతో ఈరోజు సుబ్బయ్య అంత్యక్రియలను నిర్వహిస్తున్నారు. దీంతో టిడిపి నేత మాజీ మంత్రి నారా లోకేష్ ప్రొద్దుటూరు లోనే ఉండి ఈరోజు సుబ్బయ్య అంతిమ యాత్రలో పాల్గొంటున్నారు.

హత్యా రాజకీయాలకు టీడీపీ దే పేటెంట్ అని డిప్యూటీ సీఎం ఫైర్

హత్యా రాజకీయాలకు టీడీపీ దే పేటెంట్ అని డిప్యూటీ సీఎం ఫైర్

వ్యక్తిగత కారణాలతోనే హత్య .. ఎమ్మెల్యేకు సంబంధం లేదన్న జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
ఇక హత్యా రాజకీయాలు చేయడంలో టిడిపి పేటెంట్ హక్కు పొందిందని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా టిడిపి నేతలను విమర్శించారు. వ్యక్తిగత కక్షల నేపథ్యంలో సుబ్బయ్య హత్యకు గురైతే చంద్రబాబు, లోకేష్ ప్రభుత్వ హత్యని రాద్ధాంతం చేస్తున్నారని నీచ రాజకీయాలు, చిల్లర రాజకీయాలు, శవ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. నందం సుబ్బయ్య టీడీపీ నాయకుడైనా , అతనిపై 14 కేసులు ఉన్నాయని , గతంలో జైలు శిక్ష కూడా అనుభవించిన నేరస్తుడు అని అంజాద్ బాషా మండిపడ్డారు .

లోకేష్ ప్రొద్దుటూరు కి వచ్చి శవ రాజకీయాలు చేస్తున్నారంటూ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆగ్రహం

లోకేష్ ప్రొద్దుటూరు కి వచ్చి శవ రాజకీయాలు చేస్తున్నారంటూ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆగ్రహం

రాష్ట్రంలో ఏ చిన్న సంఘటన జరిగినా దాన్ని ప్రభుత్వానికి సీఎంకు అంటగట్టడం చంద్రబాబుకు, లోకేష్ కు బాగా అలవాటు అయింది అని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మండిపడ్డారు.

టిడిపి నేత సుబ్బయ్య తో రాచమల్లు ప్రసాద్ రెడ్డి ఎలాంటి సంబంధమూ లేదని, సుబ్బయ్య హత్యకు వ్యక్తిగత కారణాలే ఉన్నాయని, టిడిపి నాయకులు ప్రతీది రాద్ధాంతం చేస్తున్నారని జమ్మలమడుగు వైసిపి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పేర్కొన్నారు. దీనిపై లోకేష్ ప్రొద్దుటూరు కి వచ్చి శవ రాజకీయాలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి.

English summary
TDP national general secretary Nara Lokesh, who went to visit the family of slain TDP leader Subbaiah in Proddatur, Kadapa district, was still in Proddatur today. Lokesh is attending Subbaiah's funeral today. A large number of TDP activists and party leaders, including TDP national general secretary Nara Lokesh, attended Subbaiah's funeral. Meanwhile, YCP leaders are upset over Lokesh Proddatur's visit.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X