కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వివేకా హ‌త్య కేసులో ముగ్గురు అరెస్ట్ : సాక్ష్యాల‌ను తారుమారు చేసారు : కోర్టులో విచార‌ణ స‌మ‌యంలో..!

|
Google Oneindia TeluguNews

వివేకానంద రెడ్డి హ‌త్య కేసులో కీల‌క మ‌లుపు. వివేకా హ‌త్య కేసు ఏపి పోలీసుల‌తో కాకుండా వేరే సంస్థ‌కు విచార‌ణ బా ధ్య‌త‌లు ఇవ్వాల‌ని హైకోర్టులో వేసిన పిటిష‌న్ల పై విచార‌ణ జ‌రుగుతున్న స‌మ‌యంలో క‌డ‌ప పోలీసులు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. వివేకా హ‌త్య కేసులో సాక్ష్యాల‌ను తారుమారు చేసార‌నే ఆభియోగం తో అరెస్ట్ చేసారు.

వివేకా హత్యోదంతంపై సిట్ కు ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు: అలాంటివి చేయొద్దంటూ సూచనలు వివేకా హత్యోదంతంపై సిట్ కు ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు: అలాంటివి చేయొద్దంటూ సూచనలు

ముగ్గురు అరెస్ట్‌..

ముగ్గురు అరెస్ట్‌..

వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్ష్యాలను తారుమారు చేసిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఎర్ర గంగిరెడ్డి, పీఏ కృష్ణారెడ్డి, ప్రకాశ్ అనే నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు ప్రకటించారు. వివేకా హత్య జరిగిన తర్వాత సాక్ష్యాలను వీరు తారుమారు చేశారని పోలీసులు గుర్తించారు. బాత్‌రూమ్‌లో ఉన్న వివేకా మృతదేహాన్ని వీరు బెడ్‌రూమ్‌కి తరలించినట్లుగా పోలీసులు గుర్తించారు. ఆ సమయంలో ఎర్ర గంగిరెడ్డి అక్కడే ఉన్నట్లు పోలీసులు భావి స్తున్నారు. వివేకా పీఏ కృష్ణారెడ్డికి వివేకా రాసిన లేఖ దొరికానా, సాయంత్రం వరకు దాన్ని పోలీసులకు ఇవ్వలేదనే కారణంతో పోలీసులు ఆయన్ని అరెస్టు చేశారు. ఈ విష‌యాన్ని పోలీసులు ప‌త్రికా ప్ర‌క‌ట‌న ద్వారా వెల్లిడించారు.

హైకోర్టులో విచార‌ణ స‌మ‌యంలో..

హైకోర్టులో విచార‌ణ స‌మ‌యంలో..

ఇక‌, వివేకా కేసును సిట్ ఆధ్వ‌ర్యంలో కాకుండా..సిబిఐ లేదా మూడో విచార‌ణ సంస్థ‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించాలని వైసిపి అధినేత జ‌గన్ తో పాటుగా వివేకా స‌తీమ‌ణి సౌభాగ్య‌మ్మ‌, కుమార్తె సునీత మ‌రో ప్ర‌జా ప్ర‌యోజ‌న వాజ్యం కోర్టులో దాఖ‌లైంది. దీని పై కోర్టు విచార‌ణ జ‌రుపుతున్న స‌మ‌యంలోనే క‌డ‌ప పోలీసులు అరెస్ట్ నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ కేసులో రాజ‌కీయంగా పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నిక‌ల ప్ర‌చారంలోనూ టిడిపి అధినేత చంద్ర బాబు ఈ హ‌త్య ఇంటి దొంగ‌ల ప‌ని అంటూ ఆరోప‌ణ‌లు చేస్తుంటే..వైసిపి అధినేత జ‌గన్ త‌మ చిన్నాన్న ను టిడిపి అధి నేత చంపించార‌ని ఆరోపిస్తున్నారు.

ఆదినారాయ‌ణ రెడ్డి పై సుతీన ఆరోప‌ణ‌లు..

ఆదినారాయ‌ణ రెడ్డి పై సుతీన ఆరోప‌ణ‌లు..

క‌డ‌ప ఎంపీగా టిడిపి నుండి పోటీలో ఉన్న ఆదినారాయ‌ణ రెడ్డి పై వివేకా కుమార్తె సునీత అనుమానం వ్య‌క్తం చేసారు. జ‌మ్మ‌ల‌మ‌డుగు లో వివేకా ప్ర‌చారం చేస్తున్నార‌ని..ఆయ‌న హ‌త్య విష‌యంలో వీరిని ఎందుచు విచారించ‌ర‌ని సునీత ప్ర‌శ్నిస్తున్నారు. ఇక‌, ఇదే స‌మ‌యంలో టిడిపి నేత‌లు ఆదినారాయ‌ణ రెడ్డి, స‌తీష్ రెడ్డి, బిటెక్ ర‌వి మాత్రం ఈ హ‌త్య కేసులో త‌మ‌కు ఎటువంటి ప్ర‌మేయం లేద‌ని స్ప‌ష్టం చేస్తున్నారు. అయితే, ఈ కేసు వెనుక వివేకా స‌న్నిహితులే చేసా ర‌ని..ఇది ఆస్తుల వివాదంలో భాగంగా జ‌రిగింద‌నే క‌ధ‌నాలు వ‌చ్చాయి. ఈ పరిస్థితుల్లో ముగ్గురుని అరెస్ట్ చేయ‌టం ద్వారా ఇప్పుడు ఇది ఎటువంటి మ‌లుపు తీసుకుంటుందో చూడాలి.

English summary
Kadapa police arrest three persons in Viveka murder case. Viveka P.a Krishna reddy and follower ganga reddy adn Prakash in this list.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X