కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శ్రీనివాసుల రెడ్డి ఆత్మహత్యపై పోలీసుల షాకింగ్ వివరణ .. సూసైడ్ నోట్స్ పై అనుమానాలు , రహస్య విచారణ

|
Google Oneindia TeluguNews

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తనను పోలీసులు విచారించారన్న మనస్తాపంతో శ్రీనివాసులు రెడ్డి ఆత్మహత్యకు పాల్పడిన సంగతి స్థానికంగా సంచలనంగా మారింది. విచారణ పేరుతో పోలీసులు వేధింపులకు గురి చేశారని, తనకు వివేకానంద రెడ్డి హత్య కేసుకు ఏ విధమైన సంబంధం లేదని సూసైడ్ నోట్ రాసి మరి శ్రీనివాసులు రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డారు. పరమేశ్వర్ రెడ్డికి బావమరిది అయిన శ్రీనివాస్ రెడ్డిని 2 రోజుల క్రితం పోలీసులు విచారణ పేరుతో వేధింపులకు గురి చేశారని కుటుంబసభ్యులు సైతం ఆరోపణలు గుప్పిస్తున్నారు.

మా నాన్నకు వివేకా హత్యతో సంబంధం లేదు .. పోలీసులు వేధించారని శ్రీనివాసులు రెడ్డి కుమారుడి ఆవేదనమా నాన్నకు వివేకా హత్యతో సంబంధం లేదు .. పోలీసులు వేధించారని శ్రీనివాసులు రెడ్డి కుమారుడి ఆవేదన

 విచారించాలనుకున్నది ఒకరిని.. తీసుకెళ్ళింది ఒకరిని .. శ్రీనివాసులు రెడ్డి సూసైడ్ పై పోలీసుల వివరణ

విచారించాలనుకున్నది ఒకరిని.. తీసుకెళ్ళింది ఒకరిని .. శ్రీనివాసులు రెడ్డి సూసైడ్ పై పోలీసుల వివరణ


పోలీసులు వేధింపులతో తన భర్త శ్రీనివాసులు రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారని, సూసైడ్‌ లెటర్‌ ఆధారంగా విచారణ జరపాలని శ్రీనివాసులరెడ్డి భార్య ఫిర్యాదు చేశారు. ఇక ఈ కేసు విషయంలో డీఎస్పీ సూర్యనారాయణ స్పందించారు. వివేకా హత్య కేసులో విచారణలో భాగంగా.. శ్రీనివాసులురెడ్డిని పులివెందుల పోలీసులు పిలిచారని స్పష్టం చేశారు. శ్రీనివాసరెడ్డి ఆత్మహత్యపై లోతుగా విచారిస్తామని డీఎస్పీ సూర్యనారాయణ వెల్లడించారు.అయితే ఈ విషయంపై వివరణ ఇచ్చిన డీఎస్పీ సూర్యనారాయణ తాము తీసుకురమ్మని చెప్పిన శ్రీనివాసరెడ్డి వేరని, కానిస్టేబుళ్ళు పొరపాటున ఆత్మహత్యకు పాల్పడిన శ్రీనివాసులు రెడ్డిని తీసుకొచ్చారని, అది గుర్తించిన వెంటనే ఆయనను పంపించి వేశామని పోలీసులు వివరణ ఇచ్చారు. ఆయన కాదని గుర్తించి 5 నిముషాల్లోనే పంపేశామని పేర్కొన్నారు. శ్రీనివాసులు రెడ్డితో మాట్లాడిన తాము , పొరపాటు పడినట్టు గుర్తించి, పంపించి వేశామని ఉన్నతాధికారులు వెల్లడించారు.

ఆయన రాసిన సూసైడ్ నోట్స్ పై అనుమానాలు .. రెండు చేతిరాతలున్నట్టు గుర్తించామన్న పోలీసులు

ఆయన రాసిన సూసైడ్ నోట్స్ పై అనుమానాలు .. రెండు చేతిరాతలున్నట్టు గుర్తించామన్న పోలీసులు

ఆయనను వేధింపులకు గురి చేశారన్న ఆరోపణలో వాస్తవం లేదని పేర్కొన్నారు.

ఇక అంతే కాకుండా ఆయన రాసినట్టుగా చెబుతున్న లేఖపైనా తమకు అనుమానాలు ఉన్నాయని పోలీసులు పేర్కొన్నారు. దానిలో రెండు రకాల రాతలు ఉన్నాయని తేలిందని పోలీసులు స్పష్టం చేశారు. ఇక దీనిపై విచారణ చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి స్థాయి దర్యాఫ్తునకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయని, కేసును నిశితంగా పరిశీలిస్తున్నామని తెలిపారు .

ఉన్నతాధికారుల ఆదేశాలతో రహస్య విచారణ చేస్తున్నకడప పోలీసులు

ఉన్నతాధికారుల ఆదేశాలతో రహస్య విచారణ చేస్తున్నకడప పోలీసులు

కడప జిల్లా సింహాద్రిపురం మండలానికి చెందిన శ్రీనివాసులు రెడ్డి వివేకా హత్యకేసులో తనను పోలీసులు విచారించటంతో తీవ్ర మనస్తాపానికి లోనై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వివేకా కుటుంబంతో ఎంతో సాన్నిహిత్యం ఉన్న ఆయన వివేకా హత్యకేసులో తనను విచారించటం జీర్ణించుకోలేకపోయారు. ఆత్మహత్యకు పాల్పడిన ఆయనను వెంటనే ఆయన కుటుంబ సభ్యులు స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినా లాభం లేకపోయింది . చికిత్స పొందుతూ శ్రీనివాసులు రెడ్డి ప్రాణాలు విడిచాడు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో పోలీసులు విచారణకు పిలిచారని.. పోలీసుల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్ రాసిపెట్టాడు. అయితే ఆయన రాసిన సూసైడ్ నోట్స్ విషయంలో పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.అంతే కాదు శ్రీనివాసుల రెడ్డి ఆత్మహత్యపై రాయలసీమ రేంజ్ ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాలతో కడప పోలీసులు రహస్యంగా విచారిస్తున్నట్టు తెలుస్తోంది.
.

English summary
Srinivasulu reddy, who was investigated by the police in Viveka murder case, has reportedly committed suicide. Officials said they had sent the constable to bring in a man named Srinivasulu Reddy, but he mistakenly brought srinivaslu reddy who had committed suicide
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X