కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఒళ్లు పగులుద్ది.. ఎవరికీ చెప్పుకుంటావో చెప్పుకో.. ఏఈకి ఎమ్మెల్యే సోదరుడి బెదిరింపులు

|
Google Oneindia TeluguNews

ఏపీలో అధికార పార్టీ నేతలు/ బంధువులు రెచ్చిపోతున్నారు. అధికారులు అని కూడా చూడకుండా బూతుపురాణం చదువుతున్నారు. తాజాగా మరో ఘటన వెలుగుచూసింది. సీఎం జగన్ సొంత ఇలాకా కడప జిల్లాలో ఓ ఎమ్మెల్యే సోదరుడు రెచ్చిపోయాడు. ట్రాన్స్ ఫార్మర్ పెట్టలేటని ఏఈకి ఫోన్‌లోనే బెదిరింపులతో చుక్కలు చూపించాడు. అతని దూషణలతో ఆ ఏఈ కంటతడి పెట్టుకున్నాడు. మొత్తం సిబ్బంది అంతా కలిసి సదరు వ్యక్తిపై ఫిర్యాదు చేశారు. అయినా పోలీసులు విషయాన్ని కోర్టుకు దృష్టికి తీసుకెళ్లారు. ఆ వివరాలెంటో తెలుసుకుందాం పదండి.

మేడా సోదరుడి బూతుపురాణం

మేడా సోదరుడి బూతుపురాణం

రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి చిన్నాన్న కుమారుడు మేడా విజయశేఖర్‌రెడ్డి అలియాస్‌ బాబు ఏఈపై విరుచుకుపడ్డారు. నందలూరు మండలం ఈడిగపల్లెలో ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు చేయడంలో ఆలస్యం చేశారంటూ విద్యుత్‌ శాఖ ఏఈ సురేశ్‌బాబుపై ఫైరయ్యారు. ఫోన్‌చేసి అసభ్యపదజాలంతో దూషించాడు. మేడా బాబును అంటూ ఫోన్‌లో దూషించడం ప్రారంభిచాడు. ఈడిగపల్లెలో ఎందుకు ట్రాన్స్‌ఫార్మర్‌ పెట్టలేదని అడిగాడు. ఒళ్లు పగుల్తుంది అని.. ఈడిగపల్లెకు రా అని బెదిరించాడు.

కలెక్టర్, ఎస్పీకి చెప్పుకో..

కలెక్టర్, ఎస్పీకి చెప్పుకో..


కలెక్టర్‌, ఎస్పీ, ఎస్‌ఈకి చెప్పుకో.. భయపడనని అన్నారు. ఈడిగపల్లెకు రాకపోతే ఒళ్లు పగుల్తుందని లేదంటే ఆఫీసుకొస్తా.. అక్కడికొస్తే కథ వేరుగా ఉంటదని హెచ్చరించారు. రెండు వేల మందితో వస్తా.. ఆడోళ్లతో కేసులు పెట్టిస్తా. ట్రాన్స్‌ఫార్మర్‌ బిగిం చమంటే బిగించవా ఎన్ని రోజులు చెప్పాలి నీకు.. జీతాలు తీసుకునేది మీరు.. తిట్టించుకునేది మేమా..? అంటూ ఫైరయ్యారు. ఈడిగపల్లెకు రా.. నీపై వెయ్యి మంది కేసులు పెడతారు. ఎవరికైనా చెప్పుకో.. నాకు సమాధానం చెప్పాల్సిందే అని బాబు దూషించాడు.

ఏఈ కన్నిటీ పర్యంతం..

ఏఈ కన్నిటీ పర్యంతం..


బాబు బూతులు తిట్టడంపై ఏఈ ఆవేదన వ్యక్తంచేశారు. మేడా బాబుకు ఆయన ఫోన్లోనే బదులిచ్చారు. సమస్య ఒక్కసారి కూడా నాకు చెప్పకుండా.. మొదటి సారి ఫోన్‌ చేసి ఇలా తిట్టడం పద్ధతేనా..? మరో నలుగురైదుగురితో ఫోన్‌లో బెదిరింపు ధోరణిలో మాట్లాడించారని గుర్తుచేశారు. కాగా ఫోన్‌ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి. జిల్లాలోని విద్యుత్‌ శాఖ యూనియన్‌ నేతలంతా కలిసి వెళ్లి నందలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కోర్టుకు నివేదించామని.. కోర్టు ఆదేశాల మేరకు విజయశేఖర్‌రెడ్డిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

అబ్బే నేను చేయలేదే

అబ్బే నేను చేయలేదే

తన నంబర్‌తో ఏఈకి కాల్‌ చేయలేదని.. ఎవరో తనపై రాజకీయ దురుద్దేశంతో తాను మాట్లాడినట్లు మిమిక్రీ చేయించారని బాబు అంటున్నారు. ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి స్వగ్రామంలోని సొంత పంచాయతీ ఈడిగపల్లెలో సుమారు 100 గృహాలకు సంబంధించిన ట్రాన్స్‌ఫార్మర్‌ చెడిపోయి 15 నెలలు అవుతున్నా ఇంతవరకు పట్టించుకోకపోవడం వల్ల తాగునీటి సమస్య ఏర్పడిందన్నారు. ఎమ్మెల్యే స్వగ్రామంలో సమస్యను పరిష్కరించకపోతే వారిని ఏమనుకోవాలని బాబు అంటున్నారు. కానీ తాను మాత్రం తిట్టలేదని చెబుతున్నారు.

English summary
Rajampeta mla brother meda vijayshekar reddy threatened electricity ae for transformer issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X