కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సీఎం జగన్మోహన్ రెడ్డికి రాయలసీమ విద్యార్థుల హెచ్చరిక

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎక్కడ ఉండాలన్న అంశం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. హైకోర్టును రాయలసీమలో పెట్టాలంటూ ఆ ప్రాంత న్యాయవాదులు, ప్రజలు కోరుతుంటే.. తమ ప్రాంతంలో ఏర్పాటు చేయాలంటూ ఉత్తరాంధ్రకు చెందిన న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నారు. ఇక హైకోర్టును అమరావతి నుంచి తరలిస్తే ఊరుకునేది లేదని ఇక్కడ న్యాయవాదులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం.

విద్యార్థులకు న్యాయవాదుల మద్దతు

విద్యార్థులకు న్యాయవాదుల మద్దతు

ఈ నేపథ్యంలో కర్నూలులో హైకోర్టుతోపాటు రాజధాని కూడా ఏర్పాటు చేయాలంటూ రాయలసీమ విద్యార్థి జేఏసీ డిమాండ్ చేస్తోంది. అంతేగాక, ఈ డిమాండ్‌తో శనివారం కర్నూలు కలెక్టరేట్‌ను ముట్టడించారు. వీరికి ఈ ప్రాంత న్యాయవాదులు కూడా మద్దతు పలికారు. దీంతో విద్యార్థులు తమ ఆందోళనలను ఉధృతం చేస్తున్నారు.

సీఎం జగన్ ఇంటినీ ముట్టడిస్తాం..

సీఎం జగన్ ఇంటినీ ముట్టడిస్తాం..

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చకపోతే తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని అన్నారు. అంతేగాక, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ముట్టడిస్తామని విద్యార్థి జేఏసీ నేతలు హెచ్చరించారు. రాయలసీమ ప్రజలంతా హైకోర్టుతోపాటు రాజధానిని కోరుకుంటున్నారన్నారు.

మాటిచ్చి తప్పించుకోవద్దు..

మాటిచ్చి తప్పించుకోవద్దు..

ప్రజల్లోకి వెళ్లి ప్రజలతో కలిసి రోడ్డెక్కుతామని అన్నారు. రానున్న రోజుల్లో అమరావతి, ఢిల్లీ కేంద్రంగా నిరాహార దీక్షలు చేస్తామని చెప్పారు. రాయలసీమ ప్రాంతం నుంచి ఎన్నికైన 52 మంది ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డిని ఒప్పించి హైకోర్టు, రాజధానిని ఈ ప్రాంతంలో ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. తమకు మాటిచ్చిన నేతలు తప్పించుకునే ప్రయత్నాలు చేయొద్దన్నారు.

లేదంటే పోరాటం ఉధృతమే

లేదంటే పోరాటం ఉధృతమే


స్వచ్చంధ సంస్థ(ఎన్జీవో)లు కూడా తమతోపాటు కలిసి వస్తాయని అన్నారు. ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి త్వరలోనే తీపి కబురు చెబుతామన్నారని.. కానీ ఎలాంటి ప్రకటనా చేయలేదని చెప్పారు. హైకోర్టుతోపాటు రాజధానిని రాయలసీమ ప్రాంతంలో ఏర్పాటు చేయకపోతే తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

English summary
Rayalaseema students demand for Capital city and High Court to Andhra Pradesh CM YS Jaganmohan Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X