కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వివేకానంద హత్య కేసులో బీటెక్ రవి విచారణ, ఎప్పుడూ పిలిచినా వస్తా, ఆదినారాయణ సోదరుడు

|
Google Oneindia TeluguNews

వైఎస్ వివేకానంద హత్య కేసులో సిట్ దర్యాప్తు స్పీడ్ పెరిగింది. వారం రోజుల్లో విచారణ పూర్తిచేస్తామని అధికారులు స్పష్టంచేసినా.. నేపథ్యంలో అనుమానితులను విచారిస్తున్నారు. గురువారం టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి సోదరుడు దేవగుడి నారాయణరెడ్డిని ప్రశ్నించారు. వివేకా హత్యకు సంబంధించి వారిపై ప్రశ్నలు సంధించారు. చెప్పిన అంశాలను నోట్ చేసుకొని.. అనుమానితులకు నోటీసు ఇస్తామని అధికారులు స్పష్టంచేశారు.

ఆదినారాయణ సోదరుడి విచారణ..

ఆదినారాయణ సోదరుడి విచారణ..

వివేకా హత్య కేసులో మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి సోదరుడు దేవగుడి నారాయణరెడ్డిని సిట్ అధికారులు విచారించారు. హత్య, తర్వాత జరిగిన పరిణామాలపై ప్రశ్నలు సంధిస్తున్నారు. విచారణలో ఆయన చెప్పే అంశాల ఆధారంగా తదుపరి ఎంక్వైరీ కొనసాగుతుంది. ఇంకా అనుమానితులు ఉంటే వారికి కూడా నోటీసులు జారీచేసి విచారిస్తారు.

బీటెక్ రవి కూడా..

బీటెక్ రవి కూడా..

ఉదయం టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని విచారించారు. వివేకా హత్య, తదనంతరం జరిగిన పరిణామాలపై కొశ్చన్ చేశారు. పలు అంశాలపై గుచ్చి గుచ్చి మరీ ప్రశ్నించారు. వివేకానంద హత్యకు సంబంధించి తన వద్ద ఎలాంటి సమాచారం ఉన్న సిట్‌కు అందజేస్తానని బీటెక్ రవి తెలిపారు. హత్య కేసుకు సంబంధించి దర్యాప్తుకు రావాలని ఎప్పుడూ పిలిచినా వచ్చేందుకు సిద్ధమని స్పష్టంచేశారు.

ఎంక్వైరీ..

ఎంక్వైరీ..

వివేకానంద హత్య కేసు విచారణను గత 9 నెలల నుంచి సిట్ విచారిస్తోంది. అనుమానితులను విడతలవారీగా ప్రశ్నిస్తున్నారు. ఇప్పటివరకు 1300 మంది అనమానితులను ప్రశ్నించామని సిట్ అధికారులు ప్రకటించారు. కొందరిని పుణెకు తీసుకెళ్లి నార్కొ అనాలిసిస్ టెస్ట్‌లు కూడా నిర్వహించారు. కానీ దర్యాప్తు మాత్రం కొలిక్కి రావడం లేదు. దీంతో ప్రభుత్వంపై విమర్శలు రావడంతో విచారణ పూర్తిచేయాలని ప్రభుత్వం సిట్‌కు స్పష్టంచేసింది. దీంతో విచారణను దర్యాప్తు సంస్థ వేగవంతం చేసింది.

బంధువుల విచారణ

బంధువుల విచారణ

వివేకానంద హత్యకేసు ఇప్పటికే వైఎస్ మనోహర్ రెడ్డి, టీడీపీ నేత కోరటి ప్రభాకర్‌ రెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నించారు. వారు చెప్పిన అంశాల ఆధారంగా మిగతావారికి నోటీసులు జారీచేశారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి, టీడీపీ నేత శివరామిరెడ్డిని కూడా ఎంక్వైరీ చేశారు. భాస్కర్ రెడ్డి, పనిమనిషిని కూడా ప్రశ్నించారు.

English summary
sit questioned b.tech ravi on ys vivekananda murder case
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X