కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కన్నతల్లి బరువైందని కొడుకు కసాయితనం ... కడపలో అమానుషం

|
Google Oneindia TeluguNews

నవమాసాలు మోసి , భరించలేని నొప్పులను భరించి కని ,పెంచి, పెద్ద చేసిన కన్నతల్లిపై కసాయి తనం చూపించాడు ఓ కొడుకు. చిన్ననాడు గుండెల మీద ఆడుకున్న తల్లి, గుండెను వృద్ధాప్యంలో గట్టిగా తన్నాడు ఆ తనయుడు . తన ప్రాణాలు పణంగా పెట్టి, తన ఇష్టాలను బిడ్డలకోసం త్యాగం చేసి కంటికి రెప్పలా కాపాడి, ఆలనా పాలనా చూసిన ఓ తల్లిని అమానుషంగా నడిరోడ్డుపై వదిలేశాడు ఓ కసాయి కుమారుడు.

జనసంచారం లేని చోట తల్లిని వదిలి వెళ్ళిన తనయుడు

జనసంచారం లేని చోట తల్లిని వదిలి వెళ్ళిన తనయుడు

వృద్ధురాలైన తల్లికి ఆలనాపాలనా చూడాల్సిన కొడుకు ఇక నేను నిన్ను భరించలేను అంటూ జన సంచారం లేని చోట వదిలి వెళ్ళిన అమానుష ఘటన కడప జిల్లాలో చోటు చేసుకుంది. అన్నిటికంటే నిర్మానుష్య ప్రదేశంలో ఆమెను దించి మళ్లీ వస్తామని చెప్పు వెళ్లడం. ఆ కొడుకు కోసం తల్లి దీనంగా ఎదురుచూడటం ఆవేదన భరితం.

కడప ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి ఠాణా పరిధిలో జన సంచారం లేని ప్రదేశంలో ఓ కొడుకు తల్లిని వదిలి వెళ్ళిన ఘటన చోటుచేసుకుంది.

ఇక్కడే ఉండు .. తిరిగొస్తానని చెప్పి వెళ్ళిపోయిన కొడుకు

ఇక్కడే ఉండు .. తిరిగొస్తానని చెప్పి వెళ్ళిపోయిన కొడుకు

కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలానికి చెందిన 63 ఏళ్ల లింగమ్మ ను ఆమె కుమారుడు, కోడలు గురువారం ఆటో లో తీసుకెళ్లి కడప ప్రభుత్వ ఆస్పత్రి సమీపంలో జన సంచారం లేని చోట వదిలిపెట్టి తిరిగి వస్తానని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయారు. కొడుకు తిరిగి వస్తానని చెప్పడంతో, తన కొడుకు తిరిగొచ్చి తీసుకువెళతాడు అని ఆశగా తల్లి ఎదురు చూసింది. కానీ ఎంతసేపటికీ కొడుకు రాకపోవడంతో, తిండిలేక నీరసించిన ఆమె అక్కడే స్పృహ తప్పి పడిపోయింది. దీంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ఆమెను చూసి వెంటనే స్పందించాడు.

కొడుకు కోసం తల్లి నిరీక్షణ .. స్పృహ తప్పిన తల్లిని ఆస్పత్రిలో చేర్చిన ఓ కానిస్టేబుల్

కొడుకు కోసం తల్లి నిరీక్షణ .. స్పృహ తప్పిన తల్లిని ఆస్పత్రిలో చేర్చిన ఓ కానిస్టేబుల్

తన కొడుకు , కోడలు తనను వదిలిపెట్టి వెళ్లారని, మళ్ళీ వస్తామని చెప్పి వెళ్లిపోయారని ఆమె చెప్పింది. తల్లి దయనీయ పరిస్థితి చూసి చలించిపోయిన కానిస్టేబుల్ వారు రారని నిర్ధారించుకుని 108కి సమాచారం అందించారు. తల్లిని వదిలించుకునేందుకు కొడుకు ఈ పని చేసినట్లుగా గుర్తించారు. అక్కడికి వచ్చిన సిబ్బంది ఆమెను కాపాడి ఆమెను వైద్య చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్పించారు. తల్లి బిడ్డల కోసం ఎన్నో త్యాగాలు చేస్తే, పిల్లలు మాత్రం వృద్ధాప్యంలో తల్లిదండ్రులను భారంగా భావిస్తున్నారు.

సమాజంలో పెరిగిపోతున్న బిడ్డల నిరాదరణ ..

సమాజంలో పెరిగిపోతున్న బిడ్డల నిరాదరణ ..


తల్లిదండ్రులను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బిడ్డలు కాఠిన్యం ప్రదర్శిస్తున్నారు. అమ్మానాన్నలని కూడా చూడకుండా అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. తల్లిదండ్రులు భారమని భావించి వదిలించుకుంటున్న ఇలాంటి ఘటనలు నిత్యకృత్యంగా మారుతున్నాయి. తల్లిదండ్రులు పిల్లల పట్ల ప్రేమను చూపిస్తే, పిల్లలు మాత్రం తల్లిదండ్రుల పట్ల కఠినత్వాన్ని చూపించడం సమాజంలో అనారోగ్య వాతావరణానికి సంకేతం.
సమాజంలో తల్లిదండ్రులపై పెరుగుతున్న నిరాదరణ ఆందోళనకరం .

English summary
Lingamma, 63, of Chintakommadinne mandal in Kadapa district, was leave by her son and daughter-in-law near Kadapa government hospital and left saying that they would return. The mother waited that her son would return and pick her up, saying that the son would return. She fainted on the spot as she did not arrive for a while. The constable on duty there saw her and responded immediately.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X