• search
  • Live TV
కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

వివేకా హత్యకేసులో స్పీడ్ పెంచిన సిట్... హత్యకు ముందు రోజు రెక్కీ చేసిన సీసీ టీవీ ఫుటేజ్ ఆధారాలు

|

వైసీపీ అధినేత , ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి బాబాయి, సీనియర్ పొలిటీషియన్ , మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది . ఎన్నికలకు ముందు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణంగా హత్యకు గురైనా ఇప్పటి వరకు ఎవరు ఎందుకు ఆయన్ను హత్య చేశారు అనేది మాత్రం తెలియలేదు .మార్చి 15, 2019 న వైయస్ వివేకాను కడపలోని తన పులివెందుల నివాసంలో దారుణంగా హత్య చేశారు.

నేను బతికే ఉన్నాను ... ఆస్థి కోసం నా కొడుకు నన్ను చంపేశాడని ఓ తల్లి న్యాయపోరాటం

విచారణలో వేగం పెంచిన సిట్.. హత్యకేసు చేదించే పనిలో అధికారులు

విచారణలో వేగం పెంచిన సిట్.. హత్యకేసు చేదించే పనిలో అధికారులు

ఈ కేసులో నిందితులైన ఎర్ర గంగి రెడ్డి (ఎ 1), వ్యక్తిగత కార్యదర్శి ఎంవి కృష్ణారెడ్డి (ఎ 2), పని మనిషి కొడుకు ప్రకాష్ (ఎ 3) లుగా అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. ఈ హత్య సంఘటన వెనుక టిడిపి నాయకులు ఉన్నారని కూడా అప్పట్లో వైసీపీ నాయకులు ఆరోపించారు. వైయస్ఆర్సిపి అధికారంలోకి రావడంతో, సిట్ అధికారులు దర్యాప్తు ప్రక్రియను వేగవంతం చేశారు. తన ఇంట్లో వివేకానందరెడ్డిని దుండగులు దారుణంగా గొడ్డళ్లతో నరికి చంపిన కేసులో గత ప్రభుత్వం వై ఎస్ వివేకా హత్యకేసు విచారణకు సిట్ ను నియమించినా అది కేసులో ఎలాంటి పురోగతి సాధించలేదు .దీంతో జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త సిట్ ను నియమించి వై ఎస్ వివేకా హత్యకేసును ఛేదించే పనిలో పడింది .

హత్యకు ముందు రోజు వివేకా ఇంటి ముందు ఇద్దరు రెక్కీ .. ఆరా తీస్తున్న పోలీసులు

హత్యకు ముందు రోజు వివేకా ఇంటి ముందు ఇద్దరు రెక్కీ .. ఆరా తీస్తున్న పోలీసులు

వైయస్ వివేకానంద రెడ్డి హత్య జరిగి నాలుగు నెలలు అయింది. ఈ హత్య కేసు విచారణ కోసం జగన్ ప్రభుత్వం సిట్ ను నియమించింది. ఈ హత్య కేసు దర్యాప్తులో వేగం పెంచిన సిట్ అధికారులు వైయస్ వివేకానంద రెడ్డి హత్యకు ముందు రోజు జరిగిన పరిణామాలపై దృష్టిసారించారు. హత్యకు ముందు రోజు వైయస్ వివేకా ఇంటికి సమీపంలో ఇద్దరు వ్యక్తులు రెక్కీ నిర్వహించినట్లుగా గుర్తించారు. సీసీటీవీ ఫుటేజ్ లో వ్యక్తుల ఆనవాళ్ళు సరిగా కనిపించక పోవడంతో వారు ఉపయోగించిన హోండా షైన్ బైక్ ఎవరిది అన్న దానిపై దృష్టి సారించారు. ఇక పులివెందుల నియోజకవర్గం లోని ఏడు మండలాల్లో ఏడుగురు ఎస్ఐ ల ఆధ్వర్యంలో షైన్ స్ప్లెండర్ ప్లస్ వాహనాల యజమానులను పిలిచి విచారిస్తున్నారు.

ఇక అక్కడ రెక్కీ నిర్వహించిన వ్యక్తుల ఆనవాళ్ళు దొరికితే ఈకేసులో పురోఅతి సాధించినట్టేనని సిట్ అధికారులు భావిస్తున్నారు. వారం రోజుల్లో రెక్కీ నిర్వహించిన వ్యక్తి ఎవరో పట్టుకు తీరుతామని వారంటున్నారు.

ప్రధాన నిందితులకు నార్కో పరీక్షలు .. వారి కాల్ డేటా పరిశీలన, వారు చెప్పే విషయాలు కీలకమే

ప్రధాన నిందితులకు నార్కో పరీక్షలు .. వారి కాల్ డేటా పరిశీలన, వారు చెప్పే విషయాలు కీలకమే

ఇక విచారణలో భాగంగా వివేకా హత్య కేసులో ప్రధాన నిందితులుగా భావిస్తున్న వివేకా ముఖ్య అనుచరుడైన గంగిరెడ్డికి, వాచ్ మ్యాన్ రంగయ్యకు, కిరాయి హంతకుడు శేఖర్ రెడ్డి కి నార్కో అనాలిసిస్ పరీక్షలను నిర్వహించటానికి కోర్టు అనుమతి ఇవ్వటంతో వారిని హైదరాబాద్ కు తరలించి నార్కో పరీక్షలు నిర్వహిస్తున్నారు. మాజీ మంత్రి వైయస్ వివేకానంద్ రెడ్డి హత్య నాలుగు నెలల క్రితం జరిగినప్పటికీ, సిట్ ఒక్క క్లూని సైతం సేకరించడంలో విఫలమైంది, ఇది కేసు దర్యాప్తుకు సహాయపడుతుంది. అందుకే నిందితుల కాల్ డేటాను పరిశీలించడమే కాకుండా, హత్య సంఘటనకు ముందు జరిగిన కార్యకలాపాలపై సిట్ అధికారులు దృష్టి సారించారు.

English summary
SIT has speeded up the investigation process of the murder mystery incident of the former minister YS Vivekanand Reddy. Even though the murder incident took place four months ago, SIT failed to collect a single clue which can help them to chase the case. Apart from examining the call data of the accused, SIT authorities have been focussing on the activities that took place just before the murder incident. On March 15th, 2019 YS Viveka was murdered brutally at his Pulivendula residence in Kadapa. Yerram Gangi Reddy (A1), personal secretary MV Krishna Reddy (A2) and son of housemaid Prakash (A3), accused in the case were arrested and sent for the remand. It was also alleged that TDP leaders were behind the murder incident. As YSRCP has come into power, SIT officials have speeded up the investigation process.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X