కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాజధాని మారిస్తే గ్రేటర్ రాయలసీమ ఇవ్వాలని డిమాండ్ చేసిన కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి

|
Google Oneindia TeluguNews

ఏపీ సీఎం జగన్ రాజధాని విషయంలో పెట్టిన చిచ్చు ఇంకా ఏపీలో రగులుతూనే ఉంది. మూడు రాజధానుల ప్రతిపాదన సరైనది కాదనే ఆభిప్రాయం వ్యక్తం అవుతుంది. వైజాగ్ లో పరిపాలనా రాజధాని ఏర్పాటు చేస్తే రాయలసీమ వాసులకు చాలా దూరమా అవుతుందని రాయలసీమ వాసులు వైజాగ్ పరిపాలనా రాజధాని చెయ్యటాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే రాజధాని మారిస్తే గ్రేటర్ రాయలసీమ ఇవ్వాలని ప్రధానంగా డిమాండ్ వినిపిస్తుంది.

రాజధాని అమరావతి విషయంలో కీలక వ్యాఖ్యలు చేసిన ఏపీ హైకోర్టు .. ఇప్పుడు జోక్యం చేసుకోలేం అంటూ రాజధాని అమరావతి విషయంలో కీలక వ్యాఖ్యలు చేసిన ఏపీ హైకోర్టు .. ఇప్పుడు జోక్యం చేసుకోలేం అంటూ

రాజధాని రాయలసీమలోనే ఏర్పాటు చెయ్యాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు రాయలసీమ వాసులు. ఒకపక్క అమరావతిలో రైతులు రాజధాని తరలించవద్దు అని ఉద్యమం చేస్తుంటే ఇక రాయలసీమ వాసులు రాజధాని తమ ప్రాంతంలోనే ఏర్పాటు చెయ్యాలని, లేదా ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండ్ చేస్తున్నారు. గ్రేటర్‌ రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

The demand for Greater Rayalaseema if the capital is changed : Kotla Suryaprakash reddy

నెల్లూరు, ప్రకాశం జిల్లాలను రాయలసీమలో కలిపి గ్రేటర్‌ రాయలసీమ ఇవ్వాలని లేకపోతే గ్రేటర్ రాయలసీమ ఉద్యమం ప్రారంభిస్తామని కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి స్పష్టం చేశారు. రాజధానిపై ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తర్వాత ఉద్యమ కార్యచరణ ప్రకటిస్తామన్నారు. ఇక రాజధానిపై ప్రజలను జగన్ తప్పుదోవ పట్టిస్తున్నారని కేఈ ప్రభాకర్ విమర్శించారు.గ్రేటర్‌ రాయలసీమ కోసం పార్టీలకతీతంగా ఉద్యమాలను ఉధృతం చేస్తామని తెలిపారు. మొత్తానికి రాయలసీమ వాసులు మాత్రం జగన్ మూడు రాజధానుల ప్రకటనను, ముఖ్యంగా వైజాగ్ పరిపాలనా రాజధాని చేస్తామన్న ప్రకటనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

English summary
AP CM Jagan's statement on the topic of three capitals in AP created tensions in AP. At the same time a new argument also came up. Rayalaseema residents are demanding that the capital be established in Rayalaseema itself.Politician Kotla Surya prakash reddy demanded that the districts of Nellore and Prakasam should be merged into Rayalaseema, as Greater Rayalaseema other wise they will fight against government .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X