కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కడప ట్రైనీ ఐపీఎస్ మహేశ్వరెడ్డికి హోంశాఖ షాక్... సస్పెండ్ చేస్తూ.. ఉత్తర్వులు

|
Google Oneindia TeluguNews

ఓ దళిత యువతిని ప్రేమ పెళ్లి చేసుకుని అనంతరం కులం పేరుతో దూషిస్తూ...మరో పెళ్లి చేసుకునేందుకు సిద్దమయ్యాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్నకడప జిల్లాకు చెందిన ట్రైనీ ఐపీఎస్ మహేశ్వర్ రెడ్డిపై కేంద్ర హోంశాఖ కొరడా ఝలిపించింది... ప్రస్తుతం ట్రైనింగ్‌లో మహెశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ... ఆదేశాలు జారీ చేసింది. ఆయన అరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో తదుపరి ఆదేశాలు వచ్చే వరకు సస్పెషన్ అమల్లో ఉంటాయని పేర్కొంది.

దారి తప్పిన ట్రైనీ ఐపీఎస్

దారి తప్పిన ట్రైనీ ఐపీఎస్

కాబోయే ఐపీఎస్ ఆఫీసర్ దారి తప్పాడు. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు అందింది. రెండు నెలల క్రితం బావన అనే హైదారాబాద్ బోయిన్‌పల్లికి చెందిన యువతికి ప్రేమ పేరుతో తనకు దగ్గరై.. పెళ్లి కూడా చేసుకుని ఏడాదిగా కాపురం చేసి ప్లేట్ ఫిరాయిస్తున్నాడని ఆరోపిస్తూ కేసు ఆమె కేసు పెట్టారు. చదువుకునే క్రమంలో తాము ఒక్కటయ్యామని.. ఐపీఎస్‌కు ఎంపిక కావడంతో మాట మార్చుతున్నాడనేది ఆమె ఆరోపణ.

మీడీయాతో చర్చనీయాంశం అయిన ఉదంతం

మీడీయాతో చర్చనీయాంశం అయిన ఉదంతం

అయితే ఆమె ఫిర్యాదు పై పోలీసులు సరిగా స్పందించటం లేదంటూ... మీడీయాకు ఫిర్యాదు చేసింది. దీంతో రెండు నెలల క్రితం హైదరాబాద్‌లో జరిగిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కడప జిల్లాకు చెందిన మహేశ్ రెడ్డితో భావన అనే యువతితో ఏడాది కిందట పెళ్లి జరిగినట్లు సదరు ఆమె ఆరోపిస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో మహేశ్ రెడ్డితో భావనకు పరిచయం ఏర్పడిందని.. ఆ క్రమంలో ప్రేమ పేరుతో దగ్గరయ్యాడని చెబుతుంది. అలా ఆమెపై ఇష్టం పెంచుకున్న మహేశ్ రెడ్డి పెళ్లి చేసుకుందామని ప్రపోజ్ చేయడంతో ఏడాది కిందట మ్యారేజ్ జరిగిందని భావన చెప్పారు.

సంవత్సరం పాటు కాపురం

సంవత్సరం పాటు కాపురం

పెళ్లి తర్వాత సంవత్సర కాలం నుంచి ఇద్దరం కలిసే ఉంటున్నామని.. ఒకే దగ్గర నివసిస్తున్నట్లు కంప్లైంట్‌లో పేర్కొన్నారు. అయితే ఐపీఎస్‌గా సెలెక్ట్ కావడంతో మహేశ్ రెడ్డిలో చాలా మార్పు వచ్చిందని ఆరోపించారు. అదే క్రమంలో తానెవరో తెలియదని బుకాయిస్తున్నట్లు పోలీసులకు వివరించారు. ఇటీవల అదనపు కట్నం తీసుకొస్తే తప్ప కాపురం చేసే ప్రసక్తి లేదన్నట్లుగా మహేశ్ రెడ్డి వేధింపులకు గురి చేస్తున్నాడని.. అందుకే పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సి వచ్చిందని చెప్పారు. దీంతో ఆమె ఫిర్యాదుపై వరకట్న కేసును నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. కాగా భావన మరోవైపు తాను తీసుకుంటున్న డెహ్రడూన్‌లో కూడ సమాచారం అందించింది. విచారణ జరిపిన అధికారులు సస్పెండ్ చేస్తూ... ఉత్తర్వులు జారీ చేశారు.

English summary
Trainee IPS officer Mahesh Reddy has been suspended from traning, central home ministry issued orders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X