కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కడప జిల్లాలో వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ ..కార్యకర్త దారుణహత్య.. గ్రామంలో పోలీసుల పికెట్

|
Google Oneindia TeluguNews

ఏపీలో అధికార పార్టీ నేతల మధ్య ఆధిపత్య పోరు పార్టీ కార్యకర్తల్లో ఘర్షణలకు కారణం అవుతుంది. ఏ జిల్లాలో చూసినా వైసీపీ నేతలకు సొంతపార్టీ లోని నేతలే శత్రువులుగా వ్యవహరిస్తున్నారు. బాహాటంగా విమర్శించటం , ఘర్షణలకు పాల్పడటం వైసీపీలో నిత్యకృత్యంగా మారింది. కర్నూలు , విశాఖ , గుంటూరు , కడప, ప్రకాశం ప్రతీ జిల్లాలో నేతల మధ్య ఆధిపత్య పోరు వైసీపీ అధినాయకత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది .

వైసీపీ మంత్రులు దుష్టశక్తులంటూ వైసీపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు వైసీపీ మంత్రులు దుష్టశక్తులంటూ వైసీపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

వైసీపీలో ఇరువర్గాల మధ్య ఘర్షణ , రాడ్లు , రాళ్ళతో కొట్టుకున్న కార్యకర్తలు

వైసీపీలో ఇరువర్గాల మధ్య ఘర్షణ , రాడ్లు , రాళ్ళతో కొట్టుకున్న కార్యకర్తలు


కడప జిల్లాలో వైసీపీ వర్గీయుల మధ్య వర్గ విభేదాలు చోటు చేసుకున్నాయి . వైసీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి రామసుబ్బారెడ్డి ల మధ్య ఆధిపత్య పోరు ఓ కార్యకర్త దారుణ హత్యకు కారణమైంది. కొండాపురం మండలం పింజి అనంతపురంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, రామసుబ్బారెడ్డి వర్గీయుల మధ్య చోటు చేసుకున్న ఘర్షణలో ఇరువర్గాలు రాడ్లు, రాళ్లతో దాడులకు దిగారు. దీంతో రామ సుబ్బా రెడ్డి వర్గానికి చెందిన గురునాథ్ రెడ్డి మృతి చెందాడు .

గండికోట ప్రాజెక్టు ముంపు పరిహారం విషయంలో వివాదం

గండికోట ప్రాజెక్టు ముంపు పరిహారం విషయంలో వివాదం

కడప జిల్లా కొండాపురం మండలం లోని పింజి అనంతపురంలో గండికోట ప్రాజెక్టు ముంపు పరిహారం విషయంలో వివాదం చోటు చేసుకుంది. గండి కోట ప్రాజెక్టు ముంపు పరిహారం జాబితాలో అనర్హులు ఉన్నారంటూ గుర్నాథ్ రెడ్డి గతంలో అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారణ చేపట్టడం కోసం మండల స్థాయి గ్రామ సభ నిర్వహించారు . ఈ క్రమంలో వైసిపి కి చెందిన మరొక వర్గం గురునాథ్ రెడ్డితో గొడవకు దిగారు. ఇక ఇరు వర్గాల మధ్య బాహాబాహీ జరుగగా రాడ్లు, రాళ్లతో దాడులకు పాల్పడిన క్రమంలో గురునాథ్ రెడ్డి తీవ్ర గాయాలపాలయ్యాడు.

దాడిలో రామసుబ్బారెడ్డి వర్గానికి చెందిన గురునాథ్ రెడ్డి మృతి

దాడిలో రామసుబ్బారెడ్డి వర్గానికి చెందిన గురునాథ్ రెడ్డి మృతి


ఘర్షణ లో తీవ్రంగా గాయపడిన గురునాథ్ రెడ్డిని ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడు.
వైసీపీ కార్యకర్త దారుణ హత్యకు గురికావడంతో ప్రస్తుతం పి అనంతపురం గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు గ్రామాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గ్రామంలో పికెటింగ్ ఏర్పాటు చేశారు.

 పరిస్థితి చెయ్యి దాటకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు.

పరిస్థితి చెయ్యి దాటకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు.

జమ్మలమడుగులో చాలా రోజులుగా ఆధిపత్యపోరు ... హత్యకు కారణం అదే

కడప జిల్లా జమ్మలమడుగు లో గత కొంత కాలంగా సుధీర్ రెడ్డి రామసుబ్బారెడ్డి ల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. సుధీర్ రెడ్డి 2019 ఎన్నికల్లో జమ్మలమడుగు ఎమ్మెల్యే టికెట్ దక్కించుకుని గెలిచారు. అప్పుడు టిడిపి అభ్యర్థి కావున రామసుబ్బారెడ్డి పై సుధీర్ రెడ్డి 51 వేల భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఇక ఆ తర్వాత జమ్మలమడుగు రాజకీయాలలో అనుకోని మార్పు వచ్చింది. మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. రామసుబ్బారెడ్డి రాకతో సుధీర్ రెడ్డికి ఇబ్బందులు మొదలయ్యాయి. అప్పటి నుండి ఇప్పటి వరకు వారిద్దరి మధ్య కొనసాగుతున్న ఆధిపత్య పోరు తాజా హత్యకు కారణం కావడం గమనార్హం.

English summary
In Kadapa district, internal clashes took place between the YCP communities. A power struggle between YCP MLA Sudhir Reddy and Ramasubbareddy led to the brutal murder of an activist. MLA Sudhir Reddy and Ramasubbareddy clashed in Kondapuram zone Pinji Anantapur and both sides attacked with rods and stones. Gurunath Reddy, a follower of the Rama Subba Reddy , was killed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X