కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ అలా..నేత‌లు ఇలా: క‌డ‌ప‌లో వైసీపీ నేత‌ల హ‌ల్‌చ‌ల్: ఉద్యోగి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం..!

|
Google Oneindia TeluguNews

రాజ‌కీయాలు ఎన్నిక‌ల వ‌ర‌కే. ప‌ధ‌కాల అమ‌ల్లో రాజ‌కీయాలు ఉండ‌వు. ఏ పార్టీ అని చూడం. ఏ వ‌ర్గం అని చూడం. ఇదీ.. ప‌దే ప‌దే ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ చెప్పే మాట‌లు. కానీ, క్షేత్ర స్థాయిలో వైసీపీ నేత‌లు మాత్రం ఈ మాట‌ల‌ను ప‌ట్టించు కోవ‌టం లేదు. త‌మ ప్ర‌భుత్వం..త‌మ జ‌గ‌న్..సీఎం చెల్లిస్తున్నాడు అనే భావ‌న‌లో ఉన్నారు. ఇందులో భాగంగానే సీఎం సొంత జిల్లాలో చోటు చేసుకున్న ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. ఏకంగా అక్క‌డి ఉద్యోగి ఆత్మ‌హ‌త్యా య‌త్నం చేసుకున్నాడు. మ‌రి..జ‌గ‌న్ వీరిని నియంత్రించలేరా..

జ‌గ‌న్ అలా..నేత‌లు ఇలా..
ఎన్నిక‌ల ప్ర‌చారంలోనూ..ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన త‌రువాత జ‌గ‌న్ ఒక విష‌యం స్ప‌ష్టం చేసారు. త‌న ప్ర‌భుత్వంలో త‌న‌కు ఓట్లు వేయ‌ని వారికి సైతం సంక్షేమ ప‌ధ‌కాలు అందుతాయ‌ని తేల్చి చెప్పారు. ఎన్నిక‌ల వ‌ర‌కే రాజ‌కీయాలు అని..ప‌ధ‌కాల అమ‌ల్లో వివ‌క్ష ఉండ‌ద‌ని స్ప‌ష్టం చేసారు. త‌న‌కు ఓట్లు వేయ‌ని వారికి సైతం ప‌ధ‌కాల‌ను అందేలా చూస్తామ‌ని హామీ ఇచ్చారు. అయితే, పార్టీ నేత‌లు మాత్రం ఇందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. వైసీపీ నేత‌లు కొంద‌రు చేస్తున్న ఓవ‌ర్ యాక్ష‌న్ కార‌ణంగా ప్ర‌భుత్వానికి..ముఖ్య‌మంత్రికి న‌ష్టం క‌లుగుతోంద‌ని పార్టీ నేత‌లే వ్యాఖ్యానిస్తున్నారు. కొత్త ప్రభుత్వం వ‌చ్చిన త‌రువాత వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌కే ల‌బ్ది క‌ల‌గాల‌నే విధంగా ముఖ్య‌మంత్రి సొంత జిల్లాలోని కొంద‌రు నేత‌లు విప‌రీతంగా ప్రవ‌ర్తిస్తున్నారు. ఏకంగా ఇప్పుడున్న కొంద‌రు యానిమేట‌ర్ల‌ను త‌మ విధుల నుండి త‌ప్పుకోవాల‌ని హెచ్చ‌రిస్తున్నారు. ఇది త‌మ ప్ర‌భుత్వ‌మ‌ని..త‌మ జ‌గ‌న్ జీతాలిస్తున్నారంటూ హ‌చ్చ‌రిస్తున్నారు . క‌డ‌ప‌లో జ‌రిగిన ఒక ఘ‌ట‌న ఇందుకు సాక్ష్యంగా నిలుస్తోంది.

YCP leaders in Kadapa district threatening animators to resign from job. They want to replace with YCP followers

వైసీపీ కార్య‌క‌ర్త‌లే ఉండాలి..
గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో యానిమేట‌ర్ల‌కు చాలా త‌క్కువ‌గా జీతాలు ఉండేవి. జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయిన త‌రువాత వారి జీతాల‌ను ప‌ది వేల‌కు పెంచారు. దీంతో..ఈ ఉద్యోగాల కోసం ఆశావాహుల సంఖ్య పెరిగింది. ఈ ఉద్యోగాల కోసం వైసీపీలోని బ‌లం ఉన్న నేత‌లు అమ అనుయాయుల కోసం ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. క‌డ‌ప జిల్లా చాపాడు మండ‌ల ప‌రిధిలోని ల‌క్ష్మీకోట‌కు చెందిన పాత‌కోట శ్రీనివాసుల రెడ్డి వెలుగు సంస్థ‌లో యానిమేట‌ర్‌గా దాదాపు 15 ఏళ్లుగా ప‌ని చేస్తున్నారు. తాజాగా ఆ ఉద్యోగానికి జీతాలు పెర‌గటంతో ఆయ‌న్ను ఉద్యోగానికి రాజీనామా చేయాల‌ని..వారి స్థానంలో వైసీపీ కార్య‌క‌ర్త ఒక‌రు అందులో చేరుతారంటూ స్థానిక అధికార పార్టీ నేత‌లు హెచ్చ‌రిస్తున్నారు. వారి బెదిరింపుల‌ను త‌ట్టుకోలేక‌నే శ్రీనివాసులు రెడ్డి పురుగుమందు తాగి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన‌ట్లు బాధితుడు వాపోయాడు. తాను స్థానిక ఎమ్మెల్యేకు నివేదిస్తాన‌ని చెప్పినా..వారు విన‌టం లేదంటూ చెప్పుకొచ్చారు. ప్ర‌స్తుతం ఆయ‌న చికిత్స పొందుతూ ఆస్ప‌త్రిలోనే ఉన్నారు.

English summary
Some of the YCP leaders in Kadapa district threatening animators to resign from job. They want to replace with YCP followers in that Jobs. Now on animator attempt suicide with this threaten.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X