కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

క‌న్నీరు పెట్టుకున్న వైసీపీ ఎంపీలు : జ‌గ‌న్ ఓదార్పు : మీ ల‌క్ష్యం అదే..!

|
Google Oneindia TeluguNews

వైసీపీ నుండి కొత్త‌గా ఎన్నిక‌యిన ఎంపీల్లో కొంద‌రు భావోద్వేగానికి గుర‌య్యారు. అధినేత జ‌గ‌న్‌తో స‌మావేశమైన పార్ల‌మెంట‌రీ పార్టీ స‌మావేశంలో ఈ స‌న్నివేశం క‌నిపించింది. జ‌గ‌న్ వారిని ఓదార్చారు. ఒక ఎంపీ క‌న్నీరు పెట్టుకున్నారు. అదే స‌మయంలో ఏపీలో ప‌రిస్థితులు వివ‌రిస్తూ..ఎంపీలుగా వారి ల‌క్ష్యాలేంటో జ‌గ‌న్ స్ప‌ష్టం చేసారు.

క‌న్నీరు పెట్టుకున్న సురేష్‌..
వైసీపీ ఎంపీగా బాప‌ట్ల నుండి గెలిచిన నందిగం సురేష్ వైసీపీ పార్ల‌మెంట‌రీ పార్టీ స‌మావేశంలో క‌న్నీరు పెట్టుకున్నారు.
పార్టీ అధినేత జ‌గ‌న్ అధ్య‌క్ష‌త‌న వైసీపీ పార్ల‌మెంట‌రీ పార్టీ స‌మావేశం జ‌రిగింది. ఆ స‌మ‌యంలో సురేష్ స్పందిస్తూ తాను ఇదే రాజ‌ధాని ప్రాంతంలో పొలం ప‌నులు చేసుకొనే వాడిన‌ని..త‌న‌ను ఎంపీగా ప్ర‌కిటించి..గెలిపించి పార్ల‌మెంట్ కు పంపిన ఘ‌న‌త జ‌గ‌న్‌కే ద‌క్కుతుంద‌న్నారు. త‌న‌తో వైయ‌స్సార్ స‌మాధి వ‌ద్ద లోక్‌స‌భ అభ్య‌ర్దుల జాబితా విడుద‌ల చేయించిన రోజును తాను మ‌ర్చిపోలేన‌ని చెప్పుకొచ్చారు. కూలీ ప‌నుల‌కు వెళ్లే త‌మ లాంటి వారికి ఎంపీలుగా అవ‌కాశం ఇచ్చారంటూ భావోద్వేగం నియంత్రించుకోలేక క‌న్నీటి ప‌ర్యంతం అయ్యారు. ఆ స‌మ‌యంలో అక్క‌డే ఉన్న మిగిలిన ఎంపీలు భావోద్వేగానికి గుర‌య్యారు. వారికి జ‌గ‌న్ ఓదార్పు ఇస్తూ మీరు ఎంపీలుగా గెలిచిన క్ష‌ణం నుండి మీ మీద బాధ్య‌త పెరిగిందంటూ వారికి కార్యాచ‌ర‌ణ నిర్ధేశించారు.

YCP MPs emotional on their victory in AP Elections...Jagan suggested them to fight for Special status..

ఎంపీలంతా కొత్త‌వారే..వారికి దిశా నిర్ధేశం..
ఈ సారి వైసీపీ ఎంపీలుగా గెలిచిన వారిలో అధిక శాతం కొత్త వారే ఉన్నారు. చిత్తూరు, తిరుప‌తి, నంద్యాల‌, క‌ర్నూలు, అనంత‌పురం, హిందూపురం, బాప‌ట్ల‌, న‌ర్స‌రావుపేట‌, ఏలూరు, న‌ర్సాపురం, రాజ‌మండ్రి, అమ‌లాపురం, అన‌కాప‌ల్లి, విశాఖ‌, విజ‌య‌న‌గ‌రం, అర‌కు నుండి కొత్త అభ్య‌ర్దులు తొలి సారి పార్ల‌మెంట్‌లో అడుగు పెడుతున్నారు. పార్ల‌మెంట‌రీ పార్టీ అధినేత ఎంపిక కార్య‌క్ర‌మాన్ని వాయిదా వేసారుద‌. ఏపీ ఆర్దికంగా చాలా ఇబ్బ‌దుల్లో ఉంద‌ని..కేంద్ర సాయం కోసం అంద‌రూ స‌మిష్టిగా పోరాటం చేయాల‌ని సూచించారు. ప్ర‌త్యేక హోదా సాధ‌న సాధించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చెప్పుకొచ్చారు. తాను రేపు ప్ర‌ధానిని కలిసి ఏపీలో ప్ర‌స్తుత ప‌రిస్థితిని వివ‌రిస్తున్నాన‌ని..కేంద్రం సానుకూలంగా ఉంటుంద‌నే అశాభావం వ్య‌క్తం చేసారు.

English summary
YCP MP's emotional on their victory in elections and entering in to parliament. Bapatla MP suresh tears on given priority for him by jagan, Jagan directed them to fight for Special status.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X