కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని వరించిన మరో పదవి..లోక్‌సభ ప్యానెల్ స్పీకర్‌గా యువనేత

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: లోక్‌సభ ప్యానెల్ స్పీకర్‌గా వైసీపీ లోక్‌సభా పక్షనేత మిథున్‌ రెడ్డిని నియమించారు స్పీకర్ ఓంబిర్లా. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్ కార్యాలయంఓ ప్రకటన విడుదల చేసింది. సాధారణంగా లోక్‌సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ సభలో లేని సమయంలో ప్యానెల్ స్పీకర్ సభను నడిపిస్తారు. ఇప్పటికే ఫ్లోర్ లీడర్‌గా ఉన్న మిథున్ రెడ్డికి మరో మంచి అవకాశం వైసీపీ కల్పించింది.

మిథున్ రెడ్డి రాజకీయ అరంగేట్రం 2014లో జరిగింది. రాజంపేట లోక్‌సభ నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఎంపీ అయ్యారు. నాడు బీజేపీ అభ్యర్థి పురందరేశ్వరిపై విజయం సాధించారు. అనంతరం 2019లో టీడీపీ అభ్యర్థి సత్యప్రభపై పోటీ చేసి రాజంపేట నియోజకవర్గం నుంచి 2 లక్షల 68వేల 284 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. ఇక పెద్దిరెడ్డి కుటుంబానికి జగన్ ఇటు రాష్ట్రంలోను అటు ఢిల్లీలోనే పెద్ద పీట వేశారనే చెప్పాలి. సీనియర్లు ఉన్నప్పటికీ రెండు సార్లు గెలిచిన మిథున్ రెడ్డికే ప్యానెల్ స్పీకర్‌గా అవకాశం కల్పించారు జగన్. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీకి ఆర్థికంగా కూడా వెన్నుదన్నుగా నిలిచారు. అదే సమయంలో జగన్‌కు విశ్వాసపాత్రులుగా పెద్దిరెడ్డి కుటుంబం ఉన్నింది. వైయస్ అవినాష్ రెడ్డికి కూడా రెండు సార్లు ఎంపీగా అయిన అనుభవం ఉంది. అయినప్పటికీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వైపే జగన్ మొగ్గు చూపారు.

YCPs Mithun Reddy appointed as Loksabha Panel speaker by OM Birla

మిథున్ రెడ్డి ప్యానెల్ స్పీకర్‌గా స్పీకర్ కుర్చీలో కూర్చోని సభను నడపడం ఖాయంగా కనిపిస్తోంది.మరోవైపు టీడీపీకి ఈ పరిణామం మింగుడుపడటం లేదని సమాచారం. ఇక డిప్యూటీ స్పీకర్‌గా అప్పట్లో వైసీపీకి చెందిన గిరిజన ఎంపీ గొడ్డేటి మాధవికి వస్తుందనే ప్రచారం జరిగింది. అయితే పొలిటికల్ ఈక్వేషన్స్ మారడంతో అది కుదరలేదు. కానీ ఈ సారి మాత్రం లోక్‌సభ ప్యానెల్ స్పీకర్‌ పదవిని వైసీపీ అంగీకరించడంతో భవిష్యత్తులో బీజేపీ వైసీపీల మధ్య మరింత స్నేహం చిగురించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్యానెల్ స్పీకర్ పదవి వైసీపీకి ఇవ్వడం ద్వారా రాజ్యసభలో ప్రస్తుతం సంఖ్యాబలం తక్కువగా ఉన్న బీజేపీకి వైసీపీ మద్దతు లభిస్తుంది. బిల్లులు పాస్ చేసే సమయంలో వైసీపీ మద్దతు బీజేపీకి లభించే అవకాశాలు ఉన్నాయి.

English summary
YCP Loksabha floor leader Peddireddy Mithun Reddy is appointed as panel speaker by Loksabha speaker OmBirla on Monday. Mithun Reddy who is a two time MP from Rajampet constituency started of his political career in 2014. He won over BJP candidate Purandeshwari in 2014 and TDP candidate satyaprabha in 2019.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X