కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లిఫ్ట్ అడిగి యువతి కిరాక్ పని.. కాస్ట్లీ బైకుతో పరార్..!

|
Google Oneindia TeluguNews

కడప : లిఫ్ట్ అడిగిన ఓ యువతి కిరాక్ పని చేసింది. యువకుడిని నమ్మించి లిఫ్ట్ తీసుకుని కాస్ట్లీ బైకుతో ఉడాయించింది. కడప జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లో చర్చానీయాంశంగా మారింది. పోనీలే పాపం అని లిఫ్ట్ ఇస్తే ఆ యువకుడికి అసలుకే ఎసరు వచ్చింది. అయితే వారం రోజుల వ్యవధిలోనే సదరు యువతి గుట్టురట్టైంది. పోలీసులకు అడ్డంగా చిక్కి కటాకటాల పాలైంది.

ఈ నెల 17వ తేదీన శివ అనే యువకుడు తన బైక్ మీద పనుల నిమిత్తం బయలుదేరాడు. అయితే మధ్యలో కలసపాడు మండలం ఎగువ రామపురానికి చెందిన 21 సంవత్సరాల బసిరెడ్డి లీల అనే యువతి అతడిని లిఫ్ట్ కావాలంటూ సైగలు చేసింది. దాంతో అతడు బైక్ ఆపాడు. ఎక్కడికి వెళ్లాలంటూ ఆరా తీయడంతో అర్జెంటుగా రిమ్స్‌కు వెళ్లాలని.. తమ బంధువులకు అక్కడ ట్రీట్‌మెంట్ జరుగుతోందని.. దయచేసి అక్కడివరకు లిఫ్ట్ కావాలంటూ బతిమిలాడింది. ఆ క్రమంలో శివ సరే అన్నాడు. అతడి బైక్‌పై లీలను ఎక్కించుకుని రిమ్స్ వైపు బయలుదేరాడు.

<strong>మొబైల్ ఆర్డర్ ఇస్తే గడియారం.. ఇంకేదో కొంటే ఖాళీ బాక్స్.. ఆన్‌లైన్‌ షాపింగ్ లీలలు..?</strong>మొబైల్ ఆర్డర్ ఇస్తే గడియారం.. ఇంకేదో కొంటే ఖాళీ బాక్స్.. ఆన్‌లైన్‌ షాపింగ్ లీలలు..?

young woman asked for lift and jumps with costly bike

అలా వెళుతున్న సమయంలో మధ్యలో శివకు ఫోన్ కాల్ వచ్చింది. దాంతో ఆయన రోడ్డు సైడుకు తన బైకును ఆపి అలా పక్కకు వెళ్లి ఫోన్ మాట్లాడుతున్నాడు. అదే అదనుగా భావించిన లీల శివ బైకుతో ఉడాయించింది. దాంతో బాధితుడు లబోదిబమన్నాడు. లక్షా 29వేల రూపాయల విలువ చేసే బైకును సదరు యువతి మాయం చేయడంతో పోలీసులను ఆశ్రయించాడు.

శివ ఫిర్యాదు మేరకు కేసు ఫైల్ చేశారు పోలీసులు. 17వ తేదీన సదరు యువతి బైక్‌తో జంప్ అయినప్పటికీ.. 21వ తేదీన కేసు ఫైల్ అయింది. అయితే కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే కేసును చేధించారు పోలీసులు. నిందితురాలి కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు ఆమె శనివారం నాడు కడపకు రాగానే అదుపులోకి తీసుకున్నారు.

English summary
A young woman who asked for a lift and theft costly bike in kadapa district Andhra Pradesh. At last she caught in one week for police and case filed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X