కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వేలాదిమందితో బహిరంగ సభ: సర్వమత ప్రార్థనలు: నామినేషన్ దాఖలు చేసిన జగన్

|
Google Oneindia TeluguNews

కడప: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కడప జిల్లాలోని పులివెందుల స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. మధ్యాహ్నం ఆయన రిటర్నింగ్ అధికారి ఎస్ సత్యంకు తన నామినేషన్ పత్రాలను అందజేశారు.

బీజేపీ నేతలకు కోట్లు ఇచ్చినట్టు యడ్యూరప్ప డైరీ, విచారణకు కాంగ్రెస్ డిమాండ్, తోసిపుచ్చిన యడ్డీ బీజేపీ నేతలకు కోట్లు ఇచ్చినట్టు యడ్యూరప్ప డైరీ, విచారణకు కాంగ్రెస్ డిమాండ్, తోసిపుచ్చిన యడ్డీ

ఆ సమయంలో జగన్ వెంట కడప వైఎస్ఆర్ సీపీ లోక్ సభ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఈ నామినేషన్ పత్రాలు సమర్పించే ముందు ఆయన సర్వ మత ప్రార్థనలు నిర్వహించారు. జగన్ నామినేషన్‌ ర్యాలీకి పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు వేల సంఖ్యలో తరలివచ్చారు.

YS Jagan submitted his nomination papers to ro at pulivendula

అంతకుముందు పులివెందులలోని సీఎస్‌ఐ చర్చి ఆవరణలో జగన్ బహిరంగ సభలో పాల్గొన్నారు. పులివెందుల గడ్డపై పుట్టినందుకు గర్వపడుతున్నానని.. కష్టాలను ఎలా ఎదుర్కోవాలో నేర్పిన గడ్డ పులివెందుల అని ఉద్విగ్నంగా ప్రసంగించారు.

YS Jagan submitted his nomination papers to ro at pulivendula

ప్రచారంలో భాగంగా.. రాష్ట్రం మొత్తం తిరగాల్సి ఉన్నందున తాను పోలింగ్ రోజులోగా మరోసారి పులివెందులకు రాకపోవచ్చని అన్నారు. తన బాబాయి వివేకానందరెడ్డిని దారుణంగా చంపించారని ఆరోపించారు వైఎస్ జగన్.

YS Jagan submitted his nomination papers to ro at pulivendula

హత్య చేసి వాళ్లు పోలీసులతోనే విచారణ చేయిస్తున్నారని.. కడప జిల్లాలో గెలవలేమని టీడీపీ నిర్ధారించుకుందని తెలిపారు.

English summary
YSR Congress Party President YS Jagan Mohan Reddy submitted his Nomination Papers to Returning Officer at Pulivendula in Kadapa district. YS Jagan contest as a YSRCP candidate from Pulivendula Assembly constituency.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X